Telugu News Power

కూటమి ప్రభుత్వంపై ప్రజల నమ్మకం. -నమ్మకం సభలో మంత్రుల మాట

నమ్మకం సభలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి వర్మ
నమ్మకం సభలో మాట్లాడుతున్న రాష్ట్ర మంత్రి నిమ్మల

పాలకొల్లు: జూన్, 18( తెలుగు న్యూస్ పవర్. కామ్)అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందిస్తూ, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ దూసుకుపోతుందని స్థానిక లోక్ సభ సభ్యులు, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మాత్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పుష్కర కాల పాలన, ఎన్డీఏ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతగా గురువారం, స్థానిక రామచంద్ర గార్డెన్స్ లో కళ్యాణ మండపంలో జరిగిన నమ్మకం సభలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. ఈ సభకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో ఎవరు పోటీ పడలేని విధంగా మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, ఎక్కడెక్కడించొ నిధులు సమీకరించి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారని మిమ్మలను మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ రెండేళ్లలో తన నియోజకవర్గంలో రూ 986 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నట్టు తెలిపారు. రెండేళ్ల పాలనలో కూటమి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో హర్షాతిరేకాలతో వ్యక్తం చేస్తున్నారన్నారు. వైయస్సార్ పార్టీ నాయకులు ఇది చూసి ఓర్వలేక, అర్థ సత్యాలు, అసత్యాలతో ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలతో కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గర అయిందనన్నారు. జగన్ తెచ్చిన దుర్మార్గపు చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ మూసివేసి పేదల పొట్టకొడితే, ఓటమి ప్రభుత్వం మళ్లీ తెరిచి పేదలకు అండగా నిలిచింది అన్నారు. గత విధ్వంసకర పాలనను చీకొట్టిన ప్రజలు, 11 సీట్లకే పరిమితం చేసినా, ఐదేళ్లు విధ్వంస పాలన చేసిన వైసిపి పార్టీ అభివృద్ధికి అడ్డం పడుతుందని ఆరోపించారు. తనపై నమ్మకం ఉంచి మూడుసార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవటానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా, ప్రతినబూరు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఏపీ ఐ ఐ డి సి చైర్మన్, జిల్లా టిడిపి అధ్యక్షులు మంతెన రామరాజు, టిడిపి నాయకులు, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, పాముల రజిని కుమార్, మామిడిశెట్టి పెద్దిరాజు, రమేష్ రాజు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, పెనుమత్స రాంభద్ర రాజు, చేగొండి రవిశంకర్, బోనం నాని, గౌరు నాయుడు దంపతులు, కాసా సత్య, బిజెపి జిల్లా అధ్యక్షులు అయినంపూడి శ్రీదేవి, ఉన్నమట్ల కపర్తి, జక్కంపూడి కుమార్, యర్రంశెట్టి పద్మారావు, కొల్లికొండ ప్రసాద్, జిల్లా జనసేన నాయకులు కోటికలపూడి గోవిందరావు, బోనం వెంకట నరసయ్య చిన్నబాబు, తులా రామలింగేశ్వర రావు,కొడవటి వరబాబు, ప్రేమ్ భాయ్, పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.