Skip to main content

Telugu News Power

శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పణ.

అమ్మవారికి భక్తులు సమర్పించిన సరె.
అమ్మవారికి సారె సమర్పిస్తున్న భక్తులు

యలమంచిలి: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాపులపాలెం వద్ద వేంచేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారికి శనివారం ఆషాడ మాస సారె సమర్పించారు. అమ్మవారి దేవస్థానం నుంచి మేళ తాళాలతో ప్రారంభమైన సరె ఊరేగింపులు మహిళలు విశేషంగా పాల్గొన్నారు. ఆషాడం సారె తో మూలస్థానేశ్వరి దేవస్థానం వరకు సాగిన ఊరేగింపు కనకదుర్గమ్మ,, దేవరమ్మ, మారెమ్మ ఆలయాల దర్శనం చేసుకుని, గుంతల ముసలమ్మ దేవస్థానానికి చేరుకున్నారు. వివిధ రకాల మిఠాయిలు పండ్లు, డ్రై ఫ్రూట్స్ తో అమ్మవారి సారె దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వారు భక్తి పారవశ్యానికి లోనయ్యారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.