Skip to main content

Telugu News Power

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు వచ్చాయని సీజెపి అభిజీత్ దీప్కే ఆరోపణ.

సి జె పి అధ్యక్షుడు అభిజిత్

న్యూఢిల్లీ: జులై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) బొద్ధింకల జనతా పార్టీ
(సీజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తనకు బీజేపీలో చేరాలని బెదిరింపులు వచ్చాయని శుక్రవారం ఆరోపించారు. “మీకు, మీ కుటుంబానికి మేలు కావాలంటే బీజేపీలో చేరండి” అనే తరహా హెచ్చరికలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇది శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న యువతపై ఒత్తిడి తెచ్చే విధానమని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అగ్ర నాయకులు యువత సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి, బెదిరింపుల రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. అయితే బీజేపీ నేతలు ఈ ఆరోపణలను ఖండిస్తూ, రుజువులు చూపాలని, ఎవరైనా పార్టీ కార్యకర్త అలా చేసి ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.