పాలకొల్లు:ఆగష్టు,1(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక
శ్రీ క్షీరా మలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో రాష్ట్రంలో వర్షాలు సంవృద్దిగా కురవడానికి, లోక కళ్యాణార్ధం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రెండవ రోజు,శనివారం, ఉదయం 7.00 గంటల నుంచి జలాభిషేకం పూజలు ప్రారంభించారు. శ్రీ స్వామివారికి వరుణ జపాలు, జలాభిషేకాలు 11 రోజుల సందర్భంగా, వరుణ జపాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అభిషేకం పూజలు అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న, మద్దూరి సూరిబాబు, ప్రధాన అర్చకులు కృష్ణప్ప, అనిల్ అభిషేకం పూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ క్షీరా మలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో రెండవ రోజు జలాభిషేకం పూజలు.
జలాభిషేక పూజలు నిర్వహిస్తున్న రుత్వికులు.