Skip to main content

Telugu News Power

సప్త ప్రదక్షిణలలో పాల్గొన్న పెద్దాపురం పీఠాధిపతి.

సప్త ప్రదక్షిణలో పీఠాధిపతి శ్రీదేవి దాస్

పాలకొల్లు: ఆగస్టు,3( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం మాడవీధులలో సోమవారం సాయంత్రం సప్త ప్రదక్షిణాలలో పెద్దాపురం వారి పీఠం, భగలముఖి అమ్మవారు పీఠం స్వామీజీ త్రిపాటి సూర్యనారాయణ దేవి దాస్ వారు మాడవీధులలో సప్త ప్రదక్షిణాలలో పాల్గొన్నరు.భక్తుల సంఖ్య సుమారు 400 మంది భక్తులు దేవి దాసు స్వామీజీ కలిసి ప్రదక్షిణాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ, పరమేశ్వరుని కొలవటంతో మన సమస్యలన్నీ కూడా తీరిపోతాయన్నారు.
శ్రీదేవి దాస్ శ్రీ స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. స్వామీజీని ఆలయ కార్యనిర్వణాధికారి శేష వస్త్రంతో సత్కరించారు. అనంతరం ప్రధాన అర్చకులు కిష్టప్ప గారు వారికి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు సూపరింటెండెంట్ వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.