Skip to main content

Telugu News Power

Telugu News Power

కళ్యాణోత్సవాలపై భక్తులతో సమావేశం.

పాలకొల్లు: మార్చి, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ శీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వారు ఈ నెల 26 నుంచి సప్తాహ్నిహ్నక కళ్యాణ్ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా, ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, కార్యనిర్వహణాధికారి, ముచ్చర్ల శ్రీనివాసరావు, స్థానిక అభిషేక మనకు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. భక్తులు ఇచ్చిన విలువైన సూచనలను, ఉత్సవాలకు ఉత్సవాల సందర్భంగా పరిగణలోకి…

Read More

జల వనరులను కాపాడుకోవాలి.

పాలకొల్లు: మార్చి, 22(తెలుగు న్యూస్ పపర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల లో ఆదివారం ప్రపంచ నీటి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులలో నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వ్యాసరచన మరియు పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, నీటి ప్రాముఖ్యత, సంరక్షణ,అవసరం, భవిష్యత్తు తరాలకు నీటి వనరులను కాపాడాల్సిన…

Read More

అరసవల్లి ఆదిత్య క్షేత్రానికి మహర్దశ.

అరసవల్లి: మార్చి, 22(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీకాకుళం జిల్లా, అరసవల్లిలో వేంచేసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి క్షేత్ర అభివృద్ధికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు ఆదివారం భూమి పూజ చేశారు. ఆలయ అభివృద్ధికి 4 కోట్ల రూపాయల నిధులు కూటమి ప్రభుత్వం కేటాయించిందని కేంద్రమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కింజరపు అచ్ఛెం నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్…

Read More

దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ఇక రాష్ట్ర పండుగ.

అమరావతి: మార్చి, 22(తెలుగు న్యూస్పవర్.కామ్) విద్యాశాఖమాత్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని యువగళం పాదయాత్ర సందర్భంగా,హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు శెట్టిబలిజ సమాజ అభివృద్ధికి విశేషంగా కృషిచేసిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రజా ప్రభుత్వం అధికారికంగా ఈనెల…

Read More

పాలకొల్లుకు రోటరీ గవర్నర్ పదవి.

విజయవాడ/పాలకొల్లు: మార్చి, 22 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అత్యంత ప్రతిష్టాత్మకమైన రోటరీ గవర్నర్ పదవి పాలకొల్లుకు చెందిన ప్రముఖ దంత వైద్యులు ముచ్చర్ల సంజయ్ ను వరించింది. విజయవాడలో ఆదివారం రాత్రి అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతో సంజయ్ విజయం సాధించారు ఈ మేరకు మాంటిసోరి వాసు ముందుగానే సూచన ఇచ్చారు. డాక్టర్ సంజయ్ సుదీర్ఘ కాలంగా రోటరీ క్లబ్ కు విశేషాలు అందిస్తూ గుర్తింపు పొందారు. పాలకొల్లులో ప్రతిష్టాత్మకమైన…

Read More

ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలలి, రాష్ట్ర రైతు సదస్సు డిమాండ్.

వీరవాసరం: మార్చి, 22(తెలుగు న్యూస్ పవర్ . కామ్) సిండికేట్ల కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న రొయ్యల రైతుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేయాలని పాలకొల్లు శ్రీ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం, అధ్యక్షులు, పాలకొల్లు ఏఎంసి చైర్మన్ గొట్టుముక్క గాంధీ భవన్ రాజు డిమాండ్ చేశారు. రాష్ట్రస్థాయి ఆక్వా రైతుల భారీ సదస్సు ఆదివారం వీరవాసరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించారు. సదస్సుకు పాలకొల్లు, ఆచంట, నరసాపురం తూర్పుగోదావరి, కృష్ణ తదితర జిల్లా…

Read More

ప్రధాని మోదీ అరుదైన రికార్డు

న్యూఢిల్లీ: మార్చి, 22 (తెలుగు న్యూస్ పవర్. కాం) సీఎం నుంచి ప్రధాని వరకూ నిరవధిక అధికార ప్రయాణం భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీi ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, ప్రధాని స్థాయికి ఎదిగి, 25 ఏళ్ళకు పైగా అంతరాయం లేకుండా అధికారంలో కొనసాగడం అరుదైన ఘనతగా నిలిచింది. గుజరాత్ సీఎం గా ప్రారంభం, మోదీ 2001లో గుజరాత్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మోడీ 2002, 2007, 2012 ఎన్నికల్లో…

Read More

శ్రీ శ్రీ శ్రీ మావులమ్మకు రూ.1.80 లక్షల బంగారం కానుక.

భీమవరం: మార్చి, 21(తెలుగు న్యూస్ పవర్.కాం)పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు,ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ, అమ్మవారి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం, స్వర్ణ నిధికి అండలూరు చెందిన చిలుకూరు రాంబాబు, కుసుమరాణి పుణ్య దంపతులు లక్ష ఎనభై వేల రూపాయల విలువ చేసే 12 గ్రాములు బంగారం విరాళంగా సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆశీర్వచన పూజలు నిర్వహించినారు.దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్,…

Read More

విశాఖలో రూ. 250 కోట్ల రూపాయలతో 5 నక్షత్రాల హోటల్.

విశాఖపట్నం: మార్చి ,21 (తెలుగు న్యూస్ పవర్. కాం) విశాఖపట్నంలోని సాగర్ నగర్–ఎండాడ సమీపంలో ప్రతిష్టాత్మక హయత్ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శనివారం భూమి పూజ చేశారు. స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం నిర్మించబోతున్న, రూ.250 కోట్ల భారీ పెట్టుబడితో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ హోటల్, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుని వచ్చే రెండేళ్లలో అందుబాటులోకి మంత్రి తెలిపారు….

Read More

ఘనంగా దేవాన్ష్ పుట్టినరోజు

తిరుమల: మార్చి, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు మనవడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుమారుడు,నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల లో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో అన్నదానానికి 44 లక్షల రూపాయల విరాళం అందజేశారు. ఎప్పుడు అధికారిక కార్యక్రమాల్లో తప్ప, వ్యక్తిగత కార్యక్రమాల్లో ఎక్కువగా కనపడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడి పుట్టినరోజు వేడుకల్లో హుషారుగా కుటుంబ…

Read More