Skip to main content

Telugu News Power

Telugu News Power

రొయ్యలు చేపల కూరతో అన్నదానం చేసి, మృగశిర కు ఆహ్వానం పలికిన ఆక్వా రైతు సంఘం.

పాలకొల్లు: జూన్,8 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం,మార్టేరు కూడలి ప్రాంతాల్లో ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం రొయ్యలు చేపల కూరతో అలగాలని చేసి మృగశిర కార్తికి ఆహ్వానం పలికారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు ఆనందంగా విందు ఆరగించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, దేశంలోనే ఈ తరహా వినూతన కార్యక్రమం మొట్టమొదటిసారి ప్రారంభించినట్టు తెలిపారు….

Read More

రాష్ట్ర ఆక్వా సంఘ నూతన కార్యవర్గానికి ఘనసత్కారం

పాలకొల్లు: జూన్,8(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం ఇటీవల నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని. జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం, పాలకొల్లు క్షత్రియ సంక్షేమ పరిషత్,పాలకొల్లు కాస్మో క్లబ్, ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన అభినందన సభలో ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘ కార్యవర్గం, గౌరవ అధ్యక్షులు, కనుమూరి భాస్కర రాజు, (విజయవాడ) అధ్యక్షులు,గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు,…

Read More

యార్లగడ్డకు అమెరికాలో తెలుగులో పట్టా.

జనరల్ డెస్క్: జూన్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాజ్యసభ మాజీ సభ్యులు, జాతీయ హిందీ అకాడమీ మాజీ అధ్యక్షులు, ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాతృభాష పట్ల తన అభిమానాన్ని చాటు కొన్నారు. వారి కుమారులు యార్లగడ్డ శివరామ ప్రసాద్ చేత ఎం.ఏ తెలుగు చదివించారు. అమెరికాలోని ఆరియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఇటీవల జరిగిన విశ్వవిద్యాలయ స్నాతకోత్స కార్యక్రమంలో వారికి పట్టా అందజేశారు. ఈ సందర్భంగా, మాజీ డిప్యూటీ స్పీకర్, మండలి బుద్ధ ప్రసాద్,…

Read More

క్షీరా రామం మాడవీధులలో భక్తుల ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూన్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్ ) పాలకొల్లు పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వద్ద సోమవారం శ్రీ స్వామి వారి సప్త సోమవారాలు అనగా ఏడు ప్రదక్షిణాలు ఏడు మారేడు దళములతో మాడవీధులలో భక్తులు సుమారుగా 300 మంది ప్రదక్షిణములలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరిండెంట్ పి వాసు , ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి ( కిష్టప్ప…

Read More

నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి, లేదు విశ్రాంతి. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూన్, 7 (తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గ అభివృద్ధికి ప్రతిక్షణం పాటుపడుతున్నానని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో రూ. 2.35 కోట్లతో ప్రారంభించనున్న రోడ్లు,మురుగు కాలువల పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా, భగేశ్వరంలో ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడారు. ఎన్నికల్లో వచ్చి పోయే బాటసారి ని కాదని, నిరంతరం ప్రజల్లో మమేకమై ఉంటున్నానని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం నుంచి…

Read More

ఒకటవ తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగు, త్వరలో చట్టం. ఏడవ తెలుగు సాహితీ ప్రపంచ మహాసభలలో వెల్లడించిన చైతన్య రాజు. వైభవంగా ప్రారంభమైన తెలుగు సాహితీ సభలు.

రాజమహేంద్రవరం: జూన్, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఒకటవ తరగతి నుండి డిగ్రీ వరకు తెలుగు ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం చేయనున్నట్టు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ కులపతి, ఏడవ ప్రపంచ తెలుగు సాహిత్య సభల నిర్వహకులు, మాజీ ఎమ్మెల్సీ , కలిదిండి సత్యనారాయణ రాజు, చైతన్య రాజు వెల్లడించారు. మహాసభలను చైతన్య రాజు, గోదావరి యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్ర స్థాయిలో రాష్ట్రాల గవర్నర్ల…

Read More

శ్రామికులను సత్కరించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూన్,6(తెలుగు న్యూస్ పవర్. కామ్) గత 40 రోజులు గా మండుటెండలో పనిచేసిన ఉపాధి హామీ శ్రామికులకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు సత్కరించారు. ఈ సందర్భంగా, యోగ క్షేమాలు ప్రస్తావించారు. మంత్రి వారికి విందు ఏర్పాటు చేశారు. లాటరీ పద్ధతిలో వారికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. తన పిలుపుకు గౌరవం ఇచ్చి, పని చేసిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలియజేశారు….

Read More

ఓటర్ల జాబితా తణిఖీలో పార్టీ శ్రేణులది కీలక పాత్ర. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు; జూన్, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఓటర్ల జాబితా తణీఖీలో పార్టీ శ్రేణులది కీలక పాత్రని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పోడూరు, యలమంచిలి క్లస్టర్ ల పరిధిలో మంత్రి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 15 నుంచి, వచ్చే నెల 14 వరకు ఓటర్ల జాబితా తనిఖీ కార్యక్రమం అధికారులు చేపడతారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 75 శాతం,…

Read More

చవాకుల చారిటబుల్ ట్రస్ట్ కు అవార్డు.

పాలకొల్లు: జూన్, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పర్యావరణ దినోత్సవం సందర్భంగా, హైదరాబాదులోని తెలుగు వర్సిటీ, ఎన్టీఆర్ ఆడిటోరియంలోని పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవ అవార్డుల కార్యక్రమం అత్యంత ఘనంగా శనివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ అత్యంత అవశ్యమని, ప్రకృతిని కాపాడుకునే పరిస్థితి ఆసన్నమైందని , ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని…

Read More

శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో యోగ శిక్షణ.

భీమవరం: జూన్, 6 (తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానము వద్ద ఈనెల 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవము నిర్వహిస్తారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి గణేష్ శనివారం తెలిపారు. ప్రభుత్వం, దేవదాయ శాఖ ఆదేశముల మేరకు యోగ శిక్షణ తరగతులు ఈనెల 8 నుంచి 21 వరకు జరుగుతాయి. ప్రతి రోజు సాయంత్రం 5…

Read More