Skip to main content

Telugu News Power

Blog

శ్రీ తలుపులమ్మ తల్లిని దర్శించుకున్న హోం మంత్రి అనిత.

తుని:ఆగస్టు,7( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆషాఢ మాసం సందర్భంగా కాకినాడ జిల్లా తుని సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తలుపులమ్మ లోవ లో వేంచేసి ఉన్న శ్రీ తలుపులమ్మ తల్లిని రాష్ట్ర హోంశాఖ మంత్రి గుడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా, అమ్మవారికి చీర సమర్పించారు. దేవస్థానం అర్చకులు, అధికారులు మర్యాదలతో మంత్రికి ఘనస్వాగతం పలికారు. అర్చకులు, మంత్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి విధులు చేసే భాగ్యం కలిగిందని మంత్రి భక్తి భావాన్ని వ్యక్తం చేశారు….

Read More

ఎల్ నినో వాతావరణ ప్రభావం పై రైతులకు అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు: ఆగస్టు,7( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక తిల్లపూడి గ్రామం లో శుక్రవారం పాక్స్ సొసైటీ వద్ద ఎల్ నీనో ప్రభావం వల్ల వరి పంట ఫై జరిగే మార్పులు మీద రైతులకు అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిది జే డి ఏ , జడ్ .వెంకటేశ్వరావు మాట్లాడుతూ, రైతులు నత్రజని ఎరువులు ఎక్కువగా భూమిలో వేయడం ద్వారా వెలువడే ఉద్గార వాయువులు, వరి పంట పండించడం వలన వచ్చే…

Read More

జాతీయ చేనేతదినోత్సవంలో ఆర్డీవో దాసిరాజు.

పాలకొల్లు: ఆగస్టు,7( తెలుగు న్యూ స్ పవర్. కామ్) స్థానిక వివర్స్ కాలనీలో ఉన్న సంఘ భవనంలో జాతీయ చేనేత దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ .సందర్భంగా ఏర్పాటుచేసిన చేనేత వస్త్రాల అమ్మకం దుకాణాల సముదాయం నరసాపురం ఆర్డీవో దాసిరాజు, శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంస్కృతి సాంప్రదాయాలకు చేనేత వస్త్రాలు ప్రతీకగా నిలుస్తాయన్నారు. చేనేత వస్త్రాలు ధరించడం ద్వారా మనవరానికి తగినట్టుగా, సౌఖ్యంగా ఉంటుందన్నారు. ఉష్ణోగ్రతలు శరీరానికి చల్లదనం కలిగిస్తుందని తెలిపారు. కూటమి…

Read More

శ్రీ మావుళ్ళ కు నంద్యాల వాసి, యాసం కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళం.

భీమవరం: ఆగస్టు, 7( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు,ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నదాన వితరణకి నంద్యాలకు చెందిన యాసం వెంకటేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు యాసం వీరారెడ్డి పెద్ద వీరమ్మ జ్ఞాపకార్థం రూ.1,00,116 లు విరాళంగా శుక్రవారం సమర్పించారు.వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి శేషవస్త్రం, ఆలయ…

Read More

వైద్య విద్యార్థులకు ఉపకారవేతనాల ఒప్పందం. -మంత్రి ఎస్. కే . యాదవ్.

అమరావతి:ఆగష్టు,6(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర సచివాలయంలో ఫీనిక్స్ ఫౌండేషన్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మధ్య అవగాహన ఒప్పందం (ఎం ఓ యూ) కుదిరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్ గురువారం వెల్లడించారు.ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన ఎంబీబీఎస్ విద్యార్థులకు ఉన్నత విద్యలో ప్రోత్సాహం అందించడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని వివరించారు.దీని ద్వారా వార్షిక కుటుంబ ఆదాయం రూ.5 లక్షలకు మించని ప్రతిభావంతులైన ఎంబీబీఎస్ విద్యార్థులకు ప్రతి…

Read More

అమరావతి చిత్రకళ వీధి భారీ ప్రదర్శన. గుంటూరులో ఈనెల 8, 9 రెండు రోజులు.

విజయవాడ: ఆగస్టు, 6( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి కమిషన్ ఆధ్వర్యంలో ఈనెల 8, 9 తేదీల్లో గుంటూరులో “అమరావతి చిత్రకళా వీధి” నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మాత్యులు కందుల దుర్గేష్ గురువారం తెలిపారు. రాష్ట్రంలోనే అతిపెద్ద కళా ఉత్సవంగా నిర్వహిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన గోడ పత్రికను విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. మన రాష్ట్ర కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ…

Read More

రాష్ట్రానికి రూ. 1,000 కోట్లతో పకృతి ఆసుపత్రి. -ఆరోగ్య శాఖామాత్యులు ఎస్. కే. యాదవ్ వెల్లడి.

విజయవాడ: ఆగస్టు6( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన ఆయుష్ శిక్షణ కార్యక్రమం –2026లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఆయుష్ మినిరల్స్, మెటీరియల్స్ ఎక్సపో, హెర్బల్ ఎక్సపోప్రదర్శనలను, వివిధ ఔషధ మొక్కలు, ఆయుష్ ఉత్పత్తుల స్టాల్స్‌ను పరిశీలించారు.రాష్ట్రంలో గత రెండేళ్లలోనే నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా రూ.426 కోట్ల నిధులు సాధించి, 4 కొత్త ఆయుష్ మెడికల్ కాలేజీలు,…

Read More

శ్రీ ఏ యస్ యన్ యం ప్రభుత్వ కళాశాల లో డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం.

పాలకొల్లు: ఆగస్టు, 6( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల(స్వయంప్రతిపత్తి) లో డిగ్రీ కోర్సులలో ఆన్ లైన్ లో ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ డా కె రత్న మాణిక్యం గురువారం వెల్లడించారు.ఈ సందర్భంగా అడ్మిషన్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఇంటర్ పూర్తిచేసుకున్న విద్యార్ధులు ప్రభుత్వ కళాశాలలో చేరితే ప్రభుత్వం నుంచి అందే వివిధ పథకాలతో పాటు,కళాశాలలో అందిస్తున్న కోర్సుల వివరాలు ,దూర ప్రాంత విద్యార్ధులకు ప్రభుత్వంచే నడపబడుతున్న హాస్టల్ సౌకర్యాలగూర్చి వివరించారు.అద్దేపల్లి…

Read More

స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి. బిజెపి శ్రేణులకు పిలుపు.

పాలకొల్లు: ఆగస్టు, 6( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ జనతా పార్టీ భవిష్యత్తును, పార్టీ ప్రతిష్టను పెంచే, స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సమాయత్తం కావాలని, జిల్లా బిజెపి అధ్యక్షురాలు, అయినంపూడి శ్రీదేవి పిలుపునిచ్చారు. స్థానిక ఎలక్ట్రీషియన్స్ సంఘం భవనంలో గురువారం పట్టణ అధ్యక్షులు కొల్లికొండ ప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రత్యేక హోటల్లో సమగ్ర సవరణ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క ఓటు నమోదయ్యాలా శ్రద్ధ వహించాలని కోరారు. కార్యకర్తలు తమకు పార్టీ…

Read More

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వైసీపీ పార్టీ నిరసన దీక్షలు ప్రారంభం.

పాలకొల్లు: ఆగస్టు,6( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, ముఖ్యంగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలపై పార్టీ అధ్యక్షులు, వై. యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు, అధ్యక్షతన పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ గాంధీ బొమ్మల సెంటర్ వద్ద రిలే నిరహార దీక్ష కార్యక్రమం జరిగింది. రిలే…

Read More