Skip to main content

Telugu News Power

Blog

అబ్జెక్షన్ యువరానార్!

సీజేఐ, సూర్యకాంత్‌ను వ్యతిరేకిస్తున్న నల్సార్, న్యాయ విద్యార్థుల. హైదరాబాద్:ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్) జాతీయ న్యాయ అధ్యయనాలు, పరిశోధనా విద్యాలయం (నల్సార్)లో విద్యార్థుల నిరసన ఉధృతమవుతోంది. స్నాతకోత్సవానికి (కాన్వొకేషన్) భారత ప్రధాన న్యాయమూర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించే సాంప్రదాయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం, ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలన్న ఏర్పాట్లను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏడాది పట్టభద్రులు కాబోతున్న విద్యార్థులు 450 మందికి పైగా తమ వైస్…

Read More

సనాతన ధర్మాన్ని ముందు తరాలకు అందించాలి. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్.కామ్) కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తలుగా అద్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతమని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక బి.ఆర్.ఎం.బి బాలికల పాఠశాల వద్ద గల శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి నిమ్మల ముఖ్యఅతిథిగా ఆదివారం హాజరయ్యారు. మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలను నూతన…

Read More

క్షీరా రామంలో కళస పూజ.

పాలకొల్లు: ఆగస్టు,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో గత నెల 31 నుంచి జరుగుతున్న జలాభిషేకం పూజలు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి పూజ, రక్షాబంధన పూజ,సర్వత భద్రతా మండపారాధన, కలసస్థాపన (108 కలశములతో) మహన్యాసం పూజలు, రుద్రాభిషేకములు మొదలగు పూజలు నిర్వహించారు. అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న,మద్దూరు సూరిబాబు, సుబ్బయ్య, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్,…

Read More

వైసీపీ దీక్షలు విజయవంతం. -ఇంచార్జ్ గుడాల గోపి

పాలకొల్లు: ఆగస్టు, 8( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో పాలకొల్లు నియోజకవర్గం లో గత మూడు రోజులుగా పాలకొల్లు పట్టణం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుచున్న రిలే నిరాహార దీక్షలు విజయవంతం అయ్యాయని పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్ శనివారం తెలిపారు. డీఎస్ స్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని,…

Read More

5 ఎకరాల ఆదాయం, పింఛను దారులకు కూటమి ప్రభుత్వ వరం. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: ఆగస్టు, 8( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.48 వేలు ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా అందజేస్తుందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. నియోజకవర్గంలో రూ.1.95 కోట్ల నిధులతో ప్రారంభించనున్న అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, రామానాయుడు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వెలివిలి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంటు రోడ్డు, డ్రైన్ పనులకుశంకుస్థాపన అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, వృద్ధులు వికలాంగులకు ఏ…

Read More

వైసిపి పార్టీకి జగన్ రాజీనామా చేసి రోడ్డెక్కాలి. -మంత్రి నిమ్మల డిమాండ్

పాలకొల్లు: ఆగస్టు,8( తెలుగు న్యూస్ పవర్. కామ్) జగన్ పాదయాత్రలో, డీఎస్సీ,మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, ఒక్క పోస్ట్ కూడా వేయకుండా మాట తప్పి, మడం తిప్పి, నిరుద్యోగులను మోసం చేసినందుకు ముందుగా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, నూటికితే ప్రజలు కొంతైనా క్షమిస్తారని మంత్రి నిమ్మల డిమాండ్ చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, వైసిపి పార్టీ డీఎస్సీ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు….

Read More

ఆంధ్రభోజునికి ఆత్మీయ పట్టాభిషేకం, అభినవ ఆంధ్రభోజునికి నీరాజనం.

పాలకొల్లు: ఆగస్టు,7( తెలుగు న్యూస్ పవర్. కామ్) విజయనగర సామ్రాజ్య సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల పాలన ఏడు ప్రాకారాల్లో సాగిందని ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్తుల అధ్యక్షులు, బుద్ధాల వెంకట రామారావు వెల్లడించారు. స్థానిక శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో, శుక్రవారం రాత్రి, స్థానిక త్సవటపల్లి సత్యవతి లయన్స్ కమ్యూనిటీ హాల్ లో శ్రీకృష్ణదేవరాయల 518వ ఆత్మీయ పట్టాభిషేక కార్యక్రమం, దివిసీమ గాంధీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు సంయుక్తంగా,…

Read More

నిరసన దీక్షలో రెండో రోజు పాల్గొన్న యలమంచిలి వైసిపి పార్టీ నాయకులు.

పాలకొల్లు: ఆగస్టు,7( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై రిలే నిరాహార దీక్షల నిరసన కార్యక్రమం చేస్తున్న, వైసీపీ పార్టీ శిబిరంలో శుక్రవారం యలమంచిలి వైసిపి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. యలమంచిలి మండల అధ్యక్షురాలు, వినుకొండ ధనలక్ష్మి, మండల వైసిపి అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు, వినుకొండ రవికుమార్, పాలకొల్లు పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, వైసీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు యడ్ల తాతాజీ,…

Read More

కరుణ చూపిన కారుణ్య ట్రస్ట్, ఐఐటీ విద్యార్థికి ఆర్థిక సాయం.

యలమంచిలి:ఆగస్టు,7 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కారుణ్య ట్రస్ట్, వ్యవస్థాపకులు దొంగ నాగేశ్వరావు పాలకొల్లుకు చెందిన ఐఐటి విద్యార్థి, మండెల శ్రీరామ్ కు రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. మద్రాస్ ఐఐటీకి ఎంపికైన శ్రీరామ్ ఇంటర్న్ షిప్ కు వెళ్ళవలసి ఉంది. ఇందుకు అవసరమైన సొమ్ము కోసం తండ్రి వెంకట సుబ్బారావు పలువురు పాలకొల్లు ప్రముఖులను కలిశారు. అయితే ఎక్కడ వారికి ఒక్క రూపాయి కూడా సాయం సొమ్ము పుట్టలేదు. దీంతో ఈ…

Read More

చెట్ల కింద చదువులకు చెక్ పెట్టిన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం.

ఏలూరు: ఆగస్టు, 7( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్, ఏలూరు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నిధులు మంజూరు చేయించినందుకు, ఏలూరు నగర ప్రజలు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఇటీవల ఉపముఖ్యమంత్రిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కలిశారు. ఈ సందర్భంగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల దుస్థితిని సచిత్రంగా సెల్ ఫోన్ లో చూపించారు. అది చూసిన ఉపముఖ్యమంత్రి ఆశ్చర్యానికి లోనయ్యారు. పరిస్థితి ఇంత దారుణంగా…

Read More