వెనిజులా-జపాన్ భూకంపాలు: శిథిలాల నుంచి సజీవంగా 14 ఏళ్ల బాలిక వెలికితీత జపాన్‌లోనూ భారీ నష్టం
కారకాస్/టోక్యో: వెనిజులాను బుధవారం కుదిపేసిన శక్తివంతమైన జంట భూకంపాల అనంతరం సహాయక బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి. రాజధాని కారకాస్‌లోని శాన్ బెర్నార్డినో ప్రాంతంలోని ఓ పారిష్ భవనం శిథిలాల కింద చిక్కుకున్న 14 ఏళ్ల బాలికను గంటలపాటు సాగిన సహాయక చర్యల అనంతరం సజీవంగా బయటకు తీశారు. సహాయక సిబ్బంది, స్థానిక ప్రజలు ఆమెను చప్పట్లతో అభినందిస్తూ ఆసుపత్రికి తరలించారు. వెనిజులాలో సంభవించిన 7.2, 7.5 తీవ్రతల వరుస భూకంపాల కారణంగా అనేక భవనాలు కుప్పకూలాయి….