Skip to main content

Telugu News Power

పాలకొల్లు నియోజకవర్గం లో 110 కోట్లతో మంచినీటికి మహర్దశ.

పాలకొల్లు: ఫిబ్రవరి, 7(తెలుగు న్యూస్ పవర్) నియోజకవర్గ ఆడపడచులు రక్షిత మంచినీటి కోసం అడిగే వారిని, వారి ఆశీర్వచనంతో, అధికారంలోకి వచ్చిన, కూటమి ప్రభుత్వం, ఆ కల నెరవేర్చబోతుందని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నా రు. పోడూరు మండలం,వేడంగి గ్రామంలో 62.35 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రక్షిత మంచినీటి పథకానికి, మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, ఏ విధమైన కలుషితం చేరకుండా,…

Read More

వి బి- జి రామ్ జి పనులతో గ్రామాలకు మేలు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 7(తెలుగు న్యూస్ పవర్) గ్రామీణ ఉపాధి, స్వయం సమృద్ధి లక్ష్యంగా వి.బి- జి రామ్ జి పథకం అమలు జరుగుతుందని, బిజెపి రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి, స్థానిక మార్కెట్ కమిటీ, మాజీ చైర్మన్ ఉన్నమట్ల కపర్థి, శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ పథకం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40, నిధులతో పనులు చేయబడతారని తెలిపారు. రైతు, కూలీలు ఇరువురికి ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో,…

Read More

గురుకుల పాఠశాల ప్రవేశానికి దరఖాస్తులు.

భీమవరం: ఫిబ్రవరి, 7(తెలుగు న్యూస్ పవర్) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఒక ప్రకటనలో కోరారు. ఈ విద్యా సంవత్సరం,(26-27) ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఈనెల 19 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తుదారులు100 రూపాయల ఫీజు చెల్లించాలి. గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం ఖాళీ ఉన్న 6 నుంచి 10 తరగతులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని,ఆ ప్రకటనలు…

Read More

మంత్రి దృష్టికి ఉద్యోగుల సమస్యలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,7(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, క్యాంప్ కార్యాలయం వద్ద శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం,నాయకుల ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, మధ్యంతర భృతి, వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, సిపిఎస్ రద్దు వంటి ముఖ్య విషయాల పరిష్కారానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఎందుకు సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు ఈ విషయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని హామీ…

Read More

9 కోట్ల బహుమతితో, విశ్వ గురు స్థానానికి ఇండియా ఉపాధ్యాయిని రౌబుల్ నాగి.

దుబాయ్: ఫిబ్రవరి, 6(తెలుగు pi న్యూస్ పవర్) దేశం గర్వించదగ్గ, భారతీయ విద్యావేత్త రౌబుల్ నాగి, విద్యారంగానికి సంబంధించి నోబెల్ బహుమతిగా భావించే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ టీచర్ అవార్డు-2026 అందుకున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ ఆల్ ముక్తుమ్, జమ్స్ ఎడ్యుకేషన్, లండన్ కు చెందిన వేర్కి సంయుక్తంగా అవార్డు అందజేస్తున్నాయి. అవార్డు కింద 9 కోట్ల నగదు అందజేశారు. దుబాయిలో , వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లో అవార్డు…

Read More

యూత్ క్లబ్ కొంతేరు పరిషత్ కు ఎంపికైన ఏడు నాటికలు.

యలమంచిలి: ఫిబ్రవరి,6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక కొంతేరు యూత్ క్లబ్ తరపున గత 44 ఏళ్లుగా నాటకపరిషత్ నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న నాటకోత్సవాల ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ పరిషత్తులో ప్రదర్శించడానికి ఏడు నాటికలు అర్హత పొందాయి. నాటికలు ఈ ఏడాది మే నెల 1 నుంచి 3 వరకు, మూడు రోజులపాటు నిర్వహించనున్నట్టు, క్లబ్ అధ్యక్షులు అంబటి మురళీకృష్ణ వెల్లడించారు. 1.తితిక్ష బి వి కె క్రియేషన్స్, కాకినాడ, రచన: డి ఉమాశంకర్, దర్శకత్వం…

Read More

కృత్రిమ మేధా సదస్సుకు అమలాపురం వాసులకు ఆహ్వానం.

అమలాపురం: ఫిబ్రవరి, 6(తెలుగు న్యూస్ పవర్) దేశ రాజధాని, ఢిల్లీలో నిర్వహించనున్న, కృత్రిమ మేధా, శిఖరాగ్ర సమావేశానికి, అమలాపురం శాస్త్రవేత్తలకు ఆహ్వానం అందింది. “ఇండియా ఏ ఐ ఇంపాక్ట్-2026′, ఈ నెల19-20 వరకు జరుగుతుంది. ఈ సదస్సులో, కృత్రిమ మేధకు సంబంధించి, పరిణామక్రమాన్ని, భవిష్యత్తును చర్చిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ, బిల్ గేట్స్, సుందర్ పిచ్చాయ్, ముఖేష్ అంబానీ, వివిధ దేశాల నుంచి వందకు పైగా గ్లోబల్ సీఈఓ లు, సీటీవోలు ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు….

Read More

మిర్చి యార్డ్ ఉపాధ్యక్షురాలిగా జనసేన వీర మహిళ.

గుంటూరు: ఫిబ్రవరి, 6 (తెలుగు న్యూస్ పవర్) ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైన గుంటూరు మిర్చి యార్డు, ఉపాధ్యక్ష పదవికి, బిట్రగుంట మల్లిక ఎంపికయ్యారు. గతంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్, జనసేన పార్టీలో అనేక పార్టీ పదవులలో పనిచేశారు. గుంటూరులో కార్పొరేటర్ గా జనసేన తరఫున పోటీ చేశారు. వీరి ఎంపిక పట్ల జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పలువురు జనసేన నాయకులు మల్లికను అభినందించారు.

Read More

మానవత కెరీర్ గైడెన్స్ .

పాలకొల్లు: ఫిబ్రవరి,6 (తెలుగు న్యూస్ పవర్) దిగమర్రు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సందర్భంగా, వారి ప్రతినిధులు పాల్గొని, విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ గురించి వివరించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి, తమ కలలు నిజం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిభావంతులైన 8,9,10 విద్యార్థులకు మానవతా సంస్థ వారు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కోట శ్రీనివాస్, చాముకూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Read More

9వ తరగతికి,మార్చి 12 నుంచి పదవ తరగతి పాఠాలు.

అమరావతి: ఫిబ్రవరి, 6(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలోని అన్ని ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 12 తర్వాత 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పాఠ్యాంశాల బోధన ప్రారంభిస్తారు. ఈ మేరకు శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ అధికారుల మధ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విద్యాసంబంధ విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో చర్చలు ఫలించి, తొమ్మిదో తరగతి విద్యార్థులకు, మార్చి 12 నుంచి 10వ తరగతి పాఠాలు నేర్పించడానికి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. నో…

Read More