Telugu News Power

గోదావరి మోక్షధామానికి రూ.3 కోట్లు

పెనుగొండ: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్). స్థానిక సిద్ధాంతం ఘాట్ వద్ద గలశ్రీ కేదారేశ్వర స్వామి ఆలయానికి ఆనుకుని ఉన్న స్మశాన వాటికలో “గోదావరి మోక్ష దామం” నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం భూమి పూజ చేశారు. ఈ ప్రాజెక్ట్ సుమారు ₹3 కోట్ల వ్యయంతో, 62 సెంట్ల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఈ మోక్ష దామం ద్వారా స్థానిక ప్రజలకు అంత్యక్రియలు నిర్వహించడానికి శుభ్రమైన, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. కార్యక్రమంలో భాగంగా,…

Read More

ఇన్ఫోసిస్ లో ఛాంబర్స్ విద్యార్థులకు ఉద్యోగాలు.

పాలకొల్లు: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక బిఆర్ఆర్ అండ్ జికేఆర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఇద్దరు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కే చార్మిలత మరియు పి. రేణుక లక్ష్మి లకు ఇన్ఫోసిస్ లొ ఉద్యోగాలు వచ్చినవి అని కళాశాల చైర్మన్ కె వి ర్ నరసింహ రావు తెలియజేశారు. కళాశాల చైర్మన్, కెవిఆర్ నరసింహారావు మాట్లాడుతూ, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజాల కంపెనీలో ఉద్యోగం లభించడం,కళాశాలలో అందించే అత్యుత్తమ విద్యా బోధనయే కారణమని, కళాశాలలో…

Read More

అఖండ జ్ఞానజ్యోతి అస్తమయం, మాడభూషి మరణం పట్ల పలువురి దిగ్భ్రాంతి.

పాలకొల్లు: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) అఖండ జ్ఞాన నిధి, సాహితీ స్రష్ట మాడభూషి కృష్ణ ప్రసాద్ (72) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వారు ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స పొందుతున్నారు. వీరి భార్య జయంతి, యలమంచిలి మండలం, అడవిపాలెం లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వీరి మరణ వార్త పాలకొల్లులో విషాదం నింపింది. కృష్ణ ప్రసాద్ సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని చేశారు. పోడూరు మండలం, గుమ్ములూరులో, పాఠశాల సహాయకులు,…

Read More

ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం.

భీమవరం: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్.కాం) స్థానిక కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం మంగళవారం జరిగింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని శాఖల సమన్వయం పనిచేయాలని సూచించారు. కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతుల ప్రక్రియ, రుణాలు మంజూరు వేగవంతంగా చేయాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపన కోసం ఇప్పుటి వరకు అందిన 1,727 దరఖాస్తుల్లో 1,707 యూనిట్లకు ఆమోదం తెలిపారు. మరో…

Read More

సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమీక్ష.

పాలకొల్లు: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) జల వనరులపై ప్రభుత్వం ప్రకటించిన వందరోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా, మంగళవారం స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ పెనుమత్స రామభద్ర రాజు అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి. మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామభద్రరాజు మాట్లాడుతూ, రాష్ట్ర జలవణుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు మురుగు కాలువల ప్రక్షాళన చేపట్టాలని…

Read More

అన్నవరం, ద్వారకాతిరుమల ఆలయాలకు ట్రస్ట్ బోర్డ్ ల నియామకం.

అమరావతి: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ దేవాలయాలైన అన్నవరం, ఆలయానికి,ద్వారకాతిరుమలకు దేవాదాయ శాఖ ట్రస్ట్ బోర్డు నియమకం మంగళవారం ప్రకటించింది. కాకినాడ జిల్లా అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం చైర్మన్‌గా, ఇనుగంటి వెంకట రోహిత్ పాటు 16 మంది ట్రస్ట్ బోర్డు సభ్యుల నియమితులయ్యారు. ద్వారకా తిరుమల ఆలయానికి చైర్మన్ గా, ఎన్ వి సుధాకరావుతో పాటు ధర్మకర్తలు నియమితులయ్యారు.13మంది టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీ పార్టీల…

Read More

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్.

తాడేపల్లి: ఏప్రిల్, 7 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ఏసీబీ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణపై ఏకకాలంలో నాలుగు చోట్ల ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా పలుచోట్ల ఖరీదైన భవనాలు, బంగారం, వెండి నగదు ఇబ్బడి ముబ్బడిగా కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అధికారిక ఫార్మాలిటీస్ పూర్తిచేసిన తరువాత, రాత్రికి ఆమె అరెస్టు చూపించారు. అత్యంత వివాదాస్పద…

Read More

ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలకు నాక్ ‘ఏ’ గ్రేడ్.

పాలకొల్లు: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో గత రెండు రోజులుగా నిర్వహించిన వార్షిక అకడమిక్ ఆడిట్ మంగళవారంతో ముగిసింది. ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు, కళాశాలలోని విద్యా ప్రమాణాలు, రికార్డుల నిర్వహణ, మౌలిక సదుపాయాలు పరిశీలించడానికి పిఠాపురం మహారాజా ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, కాకినాడ నుండి విచ్చేసిన అకాడమిక్ అడ్వైజర్స్ బి. చక్రవర్తి, డా. పి. హరి రామ ప్రసాద్, పి.విజయ్ కుమార్ ఈ ఆడిట్…

Read More

పాలకొల్లు,పశ్చిమ గోదావరి జిల్లా

స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో డ్రోన్ టెక్నాలజీ స్కిల్ కోర్స్ కు సంబంధించిన కొత్త డ్రోన్ అకడమిక్ అడ్వైజర్స్ కాకినాడ పి.ఆర్. గవర్నమెంట్ స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి డాక్టర్ బి. చక్రవర్తి , డాక్టర్ హరి రామ్ ప్రసాద్, పి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి గారు డ్రోన్‌ను ఎగరవేసి మంగళవారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అడ్వైజర్స్ మాట్లాడుతూ, కళాశాలలో విద్యార్థులకు నైపుణ్యత కలిగిన…

Read More

భారత్ కు రెండు వంటగ్యాస్ నౌకల రాక.

న్యూఢిల్లీ: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్.కాం)ఇరాన్ యుద్ధ పద్మవ్యూహంలో చిక్కుకున్న హార్ముజ్ జలసంధిని దాటి రెండు భారత వంట గ్యాస్ ట్యాంకర్ నౌకలు సురక్షితంగా, భారతీయ ఓడరేవుల వైపు పయనం అయ్యాయి.ఇందుకు సంబంధించిన మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. అయితే, పర్షియన్ గల్ఫ్‌లో 16 ఇతర వాహనాలు ఇంకా చిక్కుకుని ఉన్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధంతో హార్ముజ్ జలసంధిలో సముద్ర ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది. ఈ సన్నని జలమార్గం పర్షియన్ గల్ఫ్‌ను ఒమాన్ గల్ఫ్‌తో ముడిపెడుతుంది….

Read More