హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జడ్ ప్లస్ భద్రత. గ్రీన్ ఛానల్ ఏర్పాటు. -సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ నిర్ణయం
అమరావతి: మే,13(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆమెకు ‘జడ్ ప్లస్’ కేటగిరీ భద్రత కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లీసా గిల్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారం, సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆయన…