
కొన్ని గంటల్లోనే రూ.31. 79 కోట్లతో 31పనులకు శంకుస్థాపనలు.
పాలకొల్లు:సెప్టెంబర్,20
(తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గంలో నిరంతరం పరుగులు పెట్టిస్తున్న అభివృద్ధి పనుల వెనక ఉన్న, తాను పడుతున్న కష్టాన్ని, శ్రమను ప్రజలు గుర్తించాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు కోరారు. పట్టణంలో రూ. 3.79 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న 31 పనులకు మంత్రి ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన 26 వార్డు సభలో మంత్రి మాట్లాడుతూ, వారం వారం కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చడం కోసం, ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయో తెలుసుకొని,ఎక్కే గడప దిగే గడప అన్నట్టు, ఆయా శాఖల మంత్రులు, అధికారులను కలిసి నిధులు రాబడుతున్నట్టు వెల్లడించారు. ఎప్పుడు వినని ఏపీయూ ఎఫ్ఐడిసి, ఎ.లు.డా, రాజీవ్ స్వగృహ వంటి శాఖల నుంచి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు. పట్టణానికి ముఖ్యమైన, తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 200 కోట్లు నిధులు మంజూరు చేయిస్తే, అధికారంలోకి వచ్చిన గొడ్డలి పార్టీ వేటుపడి ఆ నిధులు మునిగిపోయాయని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఆ పనులు పునరుద్ధరించినట్టు తెలిపారు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కు అరబస్తా సిమెంట్ పని కూడా చేయకుండా రూ. 160 కోట్ల రూపాయలు దోచుకున్న దుర్మార్గాన్ని మంత్రి గుర్తు చేశారు. వచ్చే రెండు నెలలు ఇళ్లన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వైసీపీ నాయకులు రౌడీలు, గుండాల్లా వ్యవహరిస్తున్నారని మంత్రి ఆరోపించారు. మహిళలను కించపరిచే విధంగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేయటం పట్ల మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలు, అవాస్తవాలతో కాలం గడుపుతున్న వైసీపీ నాయకులను మహిళలు నిలదీయాలని కోరారు. కూటమి ప్రభుత్వం మహిళలను గౌరవించే పార్టీగా పేర్కొన్నారు. మంత్రి సుడిగాలి పర్యటనలో పట్టణం లోని వార్డులలో సిమెంట్ రోడ్లు, డ్రైన్ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా అవార్డుల్లో మహిళలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రి వారిని ఆత్మీయంగా పలకరించి, అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో, టిడిపి నాయకులు పెచ్చెట్టి బాబు, కర్నేని గౌరు నాయుడు, గండేటి వెంకటేశ్వరరావు, వల్లభు శ్రీనివాసరావు, పెండ్యాల భవాని, చీరా సత్తిబాబు, వరద శేషు, పొట్నూరి శ్రీనివాస్, బిరుదుకోట శేఖర్, శిడగం సురేంద్ర, ధనాని శ్రీరామ్ మూర్తి, బిజెపి నాయకులు ఉన్న మట్ల కపర్ది, జనసేన నాయకులు బోనం చినబాబు, తులా రామలింగేశ్వర రావు, పినిశెట్టి చిన్ని, కొమ్ముల మురళి కృష్ణ, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.