అభివృద్ధి పనుల వేగం పెంచాలి. -మంత్రి నిమ్మల ఆదేశాలు.
పాలకొల్లు: మే 30(తెలుగు మూవీస్ పవర్. కామ్) నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, నిమ్మల రామానాయుడు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనంపై శనివారం పర్యటించారు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. నర్సాపురం ప్రధాన కాలువపై లారీ స్టాండ్ సమీపంలో పాలకొల్లు- మార్టేరు ఆర్ అండ్ బి…