పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మల్లికార్జున స్వామి వారికి ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి సత్యవాణి పూజలు.
భీమవరం : జులై,13( తెలుగు న్యూస్ పవర్. కామ్) డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కుదటపడి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సతీమణి సత్యవాణి ప్రత్యేక పూజలను నిర్వహించారు. చిన గొల్లపాలెంలోని శ్రీపార్వతీ సమేత మల్లికార్జున స్వామివారికి ఆలయ అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలను నిర్వహించారు. అందరి శ్రేయస్సు కోరే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు.