పదో తరగతి ఫలితాల్లో జేయశ్రీ జయకేతనం.
యలమంచిలి: ఏప్రిల్, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్) మట్లపాలెం హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న అంబటి జయశ్రీ యుటిఎఫ్ నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించింది. ఆనాడే ఆమె ప్రతిభ కనబరిచింది. ఈరోజు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు గాను592 మార్కులు సాధించింది. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు సొంతం చేసుకుంది. తెలుగులో 99, ఆంగ్లంలో 98, హిందీలో 95 మార్కులు వచ్చాయి….