Skip to main content

Telugu News Power

Blog

ఏ ఎన్ యు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా తులసి రామచంద్ర ప్రభు నియామకం.

గుంటూరు: ఆగస్టు,1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) విద్యాదాత, తులసి సీడ్స్ అధినేత, తులసి రామచంద్ర ప్రభు నుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గా నియమించిన ఉత్తర్వులు శనివారం విడుదలయ్యాయి. ఎంతోమంది విద్యార్థులకు కోట్ల రూపాయలు ఉపకార వేతనాలుగా అందించిన మహానుభావులు, దాత తులసి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత తులసి రామచంద్ర ప్రభుకు పలువురు శుభాభినందనలు తెలిపారు.

Read More

శ్రీ మావుళ్ళమ్మకు అఖండ ఆషాడమాస సరె. పులకించిన భక్తకోటి.

భీమవరం: ఆగస్టు,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి భీమవరం, పరిసర గ్రామాల భక్తులు నిరంతరం అమ్మవారి సేవలో పాల్గొన్నారు. మహిళా భక్తులు సుమారు 2000 మంది పైగా పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 కేజీలు పైగా మిఠాయిలు, పండ్లు, చలివిడి తదితరాలు సమర్పించారని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్…

Read More

ఏ ఎస్ ఎన్ కళాశాల లో ప్రపంచ వెబ్ దినోత్సవం. విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు: ఆగస్టు,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ వెబ్ దినోత్సవం సందర్భంగా, స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నమాణిక్యం అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న వీరవల్లి ఎం.కె ప్రసాద్ ప్రపంచ వ్యాప్త వెబ్ ఆవిర్భావం, ఇంటర్నెట్ సాంకేతికత అభివృద్ధిలో వెబ్ పాత్ర, డిజిటల్ యుగంలో…

Read More

నిత్యాన్నదాన పధకానికి పళ్ళాలు, కుక్కర్ బహుకరణ.

పాలకొల్లు:ఆగష్టు,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వారు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పధకంలో భక్తులు భోజనము చేయుటకు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి అన్నదాన కమిటీకి చెందిన కుంచె సూరిబాబు, 270 స్టీల్ ప్లేట్లు దేవస్థానమునకు అందజేసారు. నిత్యఅన్నదానం తయారు చేయుట లో ఉపయోగించుటకు 20 లీటర్ల ప్రెస్టేజ్ కుక్కర్ సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు సభ్యులు, జక్కంపూడి కుమార్ దేవస్థానము నకు అందజేసారు. ఈ…

Read More

నిత్య అన్నదాన పధకానికి బెంగళూరు వాసులు రూ. లక్ష విరాళం.

పాలకొల్లు: ఆగస్టు,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వారు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పధకానికి, బెంగళూరు వాస్తవ్యులు, చిరంజీవి ధీరవ్ పౌలుక తిప్పారెడ్డి, చిరంజీవి రిషి పౌలుక తిప్పారెడ్డి ఒక లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. వీరు శ్రీ స్వామివారిని శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా, వారికి దేవస్థానం తరఫున శేష వస్త్రం,శ్రీ స్వామి వారి చిత్రపటం అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ…

Read More

శ్రీ క్షీరా మలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో రెండవ రోజు జలాభిషేకం పూజలు.

పాలకొల్లు:ఆగష్టు,1(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక శ్రీ క్షీరా మలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో రాష్ట్రంలో వర్షాలు సంవృద్దిగా కురవడానికి, లోక కళ్యాణార్ధం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రెండవ రోజు,శనివారం, ఉదయం 7.00 గంటల నుంచి జలాభిషేకం పూజలు ప్రారంభించారు. శ్రీ స్వామివారికి వరుణ జపాలు, జలాభిషేకాలు 11 రోజుల సందర్భంగా, వరుణ జపాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అభిషేకం పూజలు అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న, మద్దూరి సూరిబాబు, ప్రధాన అర్చకులు కృష్ణప్ప, అనిల్ అభిషేకం పూజలు…

Read More

పొలాలకు జాలాభిషేకం పవన్ కు పాలాభిషేకం. పిఠాపురం రైతుల హర్షతిరేకం.

పిఠాపురం:జులై, 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతులు పంట విరామం ప్రకటించాలని అధికారుల హుకుం జారీచేయడం తో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గ రైతులు ఆందోళనతో డిలాపడ్డారు. అప్పటికే ఉపముఖ్యమంత్రి ఫై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందులో రాజకియ కుట్ర కూడా ఉందని, పవన్ ను రాజకీయంగా బలహీన పరచడానికి, కూటమి లోని కొందరు నాయకులు ఈ అంశాన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స తర్వాత, విశ్రాంతి తీసుకోవాలని…

Read More

అల్లు రామలింగయ్యకు నివాళులర్పిస్తున్న అభిమానులు

పాలకొల్లు ముద్దుబిడ్డ స్వర్గీయ పద్మశ్రీ అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్బంగా టాక్సీ స్టాండ్ వద్ద ఆయన కాంశ్య విగ్రహం వద్ద తులా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అల్లు రామలింగయ్య నాటక రంగం నుంచి సినీ రంగానికి వెళ్లి తొలినాళ్లలోనే మద్రాసు పరిశ్రమలో పాలకొల్లు ఖ్యాతిని చాటారని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని, జైలు కూడా వెళ్లారని వెల్లడించారు. హోమియో వైద్యునిగా అనేక మందికి సేవలందించారనిసీ వెల్లడించారు.ఆయన పరిశ్రమకు మెగా ప్రొడ్యూసర్…

Read More

పెట్రోలు డీలర్ల కమిషన్ పెంపుకు మంత్రి హామీ.

న్యూఢిల్లీ: జులై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిశారు.దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ రిటైల్ అవుట్‌లెట్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డీలర్ల మార్జిన్‌లో 2017 నుంచి ఎలాంటి పెంపు లేకపోవడంతో పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, ఉద్యోగుల వేతనాలు, విద్యుత్ ఛార్జీలు, బ్యాంకు వడ్డీలు, ఇతర చట్టబద్ధ ఖర్చుల కారణంగా డీలర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు…

Read More

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు వచ్చాయని సీజెపి అభిజీత్ దీప్కే ఆరోపణ.

న్యూఢిల్లీ: జులై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) బొద్ధింకల జనతా పార్టీ (సీజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తనకు బీజేపీలో చేరాలని బెదిరింపులు వచ్చాయని శుక్రవారం ఆరోపించారు. “మీకు, మీ కుటుంబానికి మేలు కావాలంటే బీజేపీలో చేరండి” అనే తరహా హెచ్చరికలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇది శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న యువతపై ఒత్తిడి తెచ్చే విధానమని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అగ్ర నాయకులు యువత సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి,…

Read More