Telugu News Power

ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ కు చికిత్స.

భీమవరం: మే, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. కలెక్టర్ కాలు బెణకడం వల్ల, ఒక సామాన్య వ్యక్తిగా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్లారు. ఓపిలో పేరు నమోదు చేసుకున్నారు. ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు ఆమెకు ఎక్స్ రే తీసి చికిత్స అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యశాల గురించి అడిగి తెలుసుకుని…

Read More

క్షీరా రామంలో సప్తప్రదక్షణలు

స్థానిక పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం ఏడు మారేడు దళములతో మాడ వీధులలో భక్తులు సప్త ప్రదక్షిణాలు చేశారు. ప్రదక్షిణలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు,ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప, సూపరిండెంట్ పి. వాసు , ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.రాత్రి దూప సేవ, శ్రీ స్వామి వారి పంచాహారతుల సేవ జరిగింది. కార్యనిర్వాహణాధికారి ముచ్చెర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో…

Read More

పనిచేసే నాయకుడికి, ప్రభుత్వానికి ఇచ్చే మద్దతే అభివృద్ధి శ్రీరామరక్ష. -మంత్రి నిమ్మల రామానాయుడు.

యలమంచిలి:మే, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) పనిచేసే నాయకుడికి, ప్రభుత్వానికి ఇచ్చే మద్దతు అభివృద్ధికి శ్రీరామరక్షని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మండలంలోని, అడవి పాలెం, కొంతేరు, కాజ పడమర, చించినాడ, కలగంపూడి, బాడవ గ్రామాల్లో రూ. 5.62 కోట్ల నిధులతో ప్రారంభించబోయే పలు అభివృద్ధి పనులకు మంత్రి ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా, బడవలో జరిగిన శంకుస్థాపన సభలో మంత్రి మాట్లాడుతూ, అవిశ్రాంతంగా పని చేస్తున్న తనకంటే…

Read More

వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న, ప్రధాన ఎన్నికల అధికారి.

తిరుపతి: మే, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్, భార్య అనురాధ తో కలిసి సతీసమేతంగా ఆదివారం తిరుమల లోని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇటీవల దేశంలో మినీ ఎన్నికల మాదిరి జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్ల దగ్గర నుంచి ఫలితాలు విరోధించే వరకు ఎలక్షన్ కమిషన్ ఎన్నో ఆటుపోట్లకు గురైంది. అయినప్పటికీ అత్యంత సమర్థవంతంగా ఎన్నికల విధులు ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్లో…

Read More

మత్తు మందులపై ఆబ్కారిశాఖ అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు: మే, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) సెలవు రోజుల్లో యువత, విద్యార్థులు పెడదారి పట్టకుండా, స్థానిక ఆబ్కారి శాఖ శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. గంజాయి, సారా, మత్తుమందుల వచ్చే ప్రమాదాలను వివరిస్తూ, వాటి బారిన పడకుండా కాపాడుకునేలా ఈ అవగాహన కార్యక్రమంలో వివరించారు. స్థానిక టిడ్కో గృహసముదాయం వద్ద, పట్టణ ముఖ్య ప్రదేశాల్లో ఈ అవగాహన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఫ్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎస్ ఐ మహేష్ ఆధ్వర్యంలో వారి సిబ్బందితో…

Read More

రాష్ట్రస్థాయిలో జిల్లాకు3వ స్థానం

అమరావతి:మే,9(తెలుగు న్యూస్ పవర్. కామ్) సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, రెండు రోజులపాటు జరిగిన కలెక్టర్ల సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సేవలపై జరిగిన సమీక్షలో జిల్లా నాల్గవ త్రైమాసికంలో 75.9 శాతం స్కోరు సాధించి రాష్ట్రంలో మూడో స్థానం దక్కించుకుంది. ఐ వి ఆర్ ఎస్, సర్వేలో అన్నా క్యాంటీన్లు, ఏపీఎస్ఆర్టీసీ సేవలు, ఆరోగ్య సేవలు, పింఛన్లు, పారిశుధ్యం, విద్యుత్ సేవలు వంటి అనేక రంగాల్లో…

Read More

ఫలించిన మంత్రి మంత్రాంగం, శ్రామికుల సేవలో పార్టీ యంత్రాంగం.

పాలకొల్లు: మే, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) మండే ఎండల్లో, పనిచేస్తున్న ఉపాధి హామీ శ్రామికులకు మజ్జిగ చలివేంద్రాలు వారి కార్యక్షేత్రాల్లోనే ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవల శాఖామాత్యులు ఇచ్చిన పిలుపుమేరకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యసాధనలో ముందుకురికాయి. వీరికి దాతలు సౌజన్యం అందజేస్తున్నారు. నియోజకవర్గంలోని పాలకొల్లు రూరల్, లంకల కోడేరు, తిల్లపూడి, పాలమూరు, బల్లిపాడు,వాలమర్రు, తదితర గ్రామాలు, యలమంచిలి మండలం, కంఛుస్తంభంపాలెం, బూరుగుపల్లి, మట్లపాలెం, లక్ష్మీ పాలెం, పోడూరు మండలం మట్టపర్రు వేడంగి,…

Read More

నా నియోజకవర్గమే, నా కుటుంబం.-మంత్రి నిమ్మల ఉవాచ

పాలకొల్లు: మే,9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) నా నియోజకవర్గమే, నా కుటుంబం అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక నియోజకవర్గంలో, రూ. 8.25 కోట్ల 14అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా, గోరింటాడలో నిర్వహించిన శంకుస్థాపన సభలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ, జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా కేంద్ర మార్కెటింగ్ సొసైటీ,టీటీడీ ట్రస్ట్ బోర్డ్…

Read More

జాతీయ, విదేశీ విద్యకు పావలా వడ్డీకే రుణాలు. -కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రకటన.

అమరావతి: మే, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) జాతీయ, విదేశీ విద్య అభ్యసించడానికి పావలా వడ్డీ రుణపథకం ప్రారంభించనున్నట్టు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏడాది ఐఐటి, ఎన్ఐటి, ఐ ఐ ఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఈ ఏడాది సాధించిన 150-200 సీట్లు 500 లకు పెంచాలని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. ఇందుకు గాను, కలెక్టర్లు ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యార్థులను ఉన్నత…

Read More

బిజెపి విజయవాడలో విజయోత్సవ సంబరాలు.

విజయవాడ: మే ,8 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఇటీవల దేశంలో జరిగిన మినీ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భంగా, బిజెపి పార్టీ నాయకులు, శ్రేణులు దేశవ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నాయి. బిజెపి రాష్ట్ర కార్యాలయం,విజయవాడలో రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ గారి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నరసాపురం లోక్ సభ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటీవల మూడు…

Read More