Skip to main content

Telugu News Power

క్షీరా రామంలో లీలా కళ్యాణం.

పాలకొల్లు: జూలై,12( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. రుద్ర హోమం నిర్వహించారు. రాత్రి స్వామివారి సన్నిధిలో గల కళ్యాణమండపం లో లీలా కళ్యాణం నిర్వహించారు. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఈ కార్యక్రమాలు జరిపించారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు వివేక్షణలో భక్తులు రుద్ర హోమం, లీలా కళ్యాణం పూజలు…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రూ. లక్ష విరాళం.

భీమవరం: జూలై,12(తెలుగు న్యూస్ పవర్.కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి భీమవరం కి చెందిన జక్కంశెట్టి హరీష్, కొంకిపూడి కిరణ్ లక్ష రూపాయలు విరాళం గా అందజే సారు. దాతలకు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ ధర్మకర్తలు ఉదీశి మీనాక్షి, పాపోలు ఏడుకొండలు…

Read More

జగనన్న బహిరంగ సభ విజయవంతం చేయాలి. శ్రేణులకు ముదునూరి పిలుపు.

పాలకొల్లు: జూలై, 11( తెలుగు న్యూస్ పవర్. కామ్) వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ ముదునూరి ప్రసాద రాజు పిలుపునిచ్చారు. శ్రేణులను సన్నద్ధపరిచే కార్యక్రమంలో భాగంగా స్థానిక కళ్యాణ మండపంలో శనివారం జరిగిన సమావేశంలో ప్రసాద్ రాజు ప్రసంగించారు. జిల్లాలో ఉన్న ఆక్వా రైతుల కష్టాలు చూసి చెలించిపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కళ్ళు తెరిపించడానికి…

Read More

చందు కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కులు అందజేసిన ఎమ్మెల్సీ గోపి మూర్తి.

యలమంచిలి: జూలై,11( తెలుగు న్యూస్ పవర్. కామ్)యుటిఎఫ్ కుటుంబ సంక్షేమ సంఘం తరపున వడ్డీ లంక, జే. గుణదీప్ చందు కుటుంబానికి చెక్కు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి గోపి మూర్తి, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్ విజయరామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి క్రాంతి కుమార్, కుటుంబ సంక్షేమ సంఘం డైరెక్టర్స్ హాజరయ్యారు.

Read More

క్షీరా రామం దర్శించుకున్న డిఎం రాంప్రసాద్ గుప్తా.

పాలకొల్లు: జూలై, 11( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని, డీఎం రాంప్రసాద్ గుప్తా, ఐ. ఆర్. ఏ ఎస్. దంపతులు, విశాఖపట్నం వారు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి, పార్వతి దేవి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణప్ప, వీరబాబు వారికి ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, సూపరింటెండెంట్…

Read More

కుళాయి చెరువు నిర్మాత చెరుకూరి లక్ష్మణరావు విగ్రహావిష్కరణ లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు.

నర్సాపురం: జూలై, 11 (తెలుగు న్యూస్ పవర్.కాం) నర్సాపురం పట్టణ ప్రజల దాహార్తిని తీర్చిన కుళాయి చెరువు నిర్మాత, కీర్తిశేషులు చెరుకూరి లక్ష్మణరావు నిలువెత్తు విగ్రహానికి శనివారం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు పొంగూరి నారాయణ, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి,…

Read More

పేదల కోసం వైద్య పథకాలు అమలు చేస్తున్న ప్రధాని మోడీ. -ముళ్ళపూడి రేణుక

స్వచ్ఛ సేవ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం. పాలకొల్లు: జూలై,11( తెలుగు న్యూస్ పవర్. కామ్) పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడీ వైద్య పథకాలు అమలులోకి తెచ్చారని రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక పేర్కొన్నారు. స్థానిక శ్రీ ముఖదారమ్మ ఆలయం వద్ద శనివారం నిర్వహించిన వైద్య శిబిరం ప్రారంభించిన సందర్భంగా రేణుక మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదలకు ఐదు లక్షల వరకు ఏ ఆసుపత్రిలోనైనా వైద్యచికిత్సలు అందజేయడానికి…

Read More

గోదావరి పుష్కరాల నిధులకు మంత్రి నారాయణ హామీ.

నర్సాపురం: జూలై 11,( తెలుగు న్యూస్ పవర్. కామ్) గోదావరి పుష్కరాల నాటికి నరసాపురం పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో శనివారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగురునారాయణ మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కరాల ప్రధాన ఘాట్లు నరసాపురం మున్సిపల్ పరిధిలో ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, పట్టణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి…

Read More

ఆటో బోల్తా, ఉద్యోగి మృతి. కుమార్తెను చూసి వస్తూ తిరిగిరాని లోకాలకు…

పాలకొల్లు: జులై, 10( తెలుగు న్యూస్ పవర్. కామ్) వ్యవసాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న గుబ్బల సత్యనారాయణ(57) శుక్రవారం జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందారు. వీరు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందినవారు. ముమ్మిడివరంలో వ్యవసాయశాఖ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు. భార్య రాజేశ్వరితో కలిసి హైదరాబాదులో ఉన్న తమ కుమార్తె కుటుంబాన్ని చూసి తిరిగి వస్తున్నారు. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో వచ్చిన వీరు పాలకొల్లు రైల్వే స్టేషన్ లో దిగి రాజోలు…

Read More

ఆక్వారంగంపై కేంద్రమంత్రి, అధికారులతో సమీక్ష.

భీమవరం:జూలై, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రంగంపై స్థానిక లోక్ సభ సభ్యులు, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తన కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపెడ, మత్స శాఖ అధికారులు ఈ సమీక్ష దేశంలో పాల్గొన్నారు .ఆక్వా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలు తీరును సమీక్షించి, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పి ఎమ్ ఎమ్ ఎస్ వై ) ద్వారా…

Read More