Skip to main content

Telugu News Power

ఉభయగోదావరి జిల్లాల్లో ఇళ్లల్లో ఈగల మోత. బయటకు రాని విషపు ఈగల బాధితుల వివరాలు.

జనరల్ డస్క్: జూన్,26( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాలానుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వివిధ రకాల వ్యాధులు రావటం సహజం. వీటితోపాటు కొన్ని రకాల కీటకాల కూడా ఉద్భవించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే వీటి గురించి బయట ప్రపంచానికి తెలియ రావడం లేదు. బాధితులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం దృష్టికి రాక నివారణ చర్యలు ఇంతవరకు ప్రారంభం కాలేదని బాధితులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో యాసిడ్ పురుగు, బీటిల్ బగ్…

Read More

ఘనంగా డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ ఆవిర్భావ దినోత్సవం.

తాడేపల్లిగూడెం: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్ ) పశ్చిమ గోదావరి జిల్లా, వెంకటరామన్నగూడెం, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.విశ్వవిద్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపకులపతి డాక్టర్ కె. ధనుంజయరావు అధ్యక్షత వహించారు. అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన పరిశోధన, విద్యా రంగాల్లో విశ్వవిద్యాలయం సాధించిన…

Read More

ఘనంగా గజమాలయాత్ర బండి ముత్యాలమ్మ ఆలయం నుంచి అప్పనపల్లి బాలాజీ సన్నిధికి.

మొగల్తూరు: జూన్,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, అప్పనపల్లి లో వేంచేసియున్న శ్రీ బాలాజీ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం మహా గజమాల యాత్ర భారీ భారీగా సాగింది. స్థానిక ముత్యాలపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ బండి ముత్యాలమ్మ ఆలయం వద్ద నుంచి గురువారం ఉదయం ఈ యాత్ర ప్రారంభం అయింది. నరసాపురం నియోజకవర్గం శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో అత్యంత…

Read More

వెనిజులా-జపాన్ భూకంపాలు: శిథిలాల నుంచి సజీవంగా 14 ఏళ్ల బాలిక వెలికితీత జపాన్‌లోనూ భారీ నష్టం

కారకాస్/టోక్యో: వెనిజులాను బుధవారం కుదిపేసిన శక్తివంతమైన జంట భూకంపాల అనంతరం సహాయక బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి. రాజధాని కారకాస్‌లోని శాన్ బెర్నార్డినో ప్రాంతంలోని ఓ పారిష్ భవనం శిథిలాల కింద చిక్కుకున్న 14 ఏళ్ల బాలికను గంటలపాటు సాగిన సహాయక చర్యల అనంతరం సజీవంగా బయటకు తీశారు. సహాయక సిబ్బంది, స్థానిక ప్రజలు ఆమెను చప్పట్లతో అభినందిస్తూ ఆసుపత్రికి తరలించారు. వెనిజులాలో సంభవించిన 7.2, 7.5 తీవ్రతల వరుస భూకంపాల కారణంగా అనేక భవనాలు కుప్పకూలాయి….

Read More

సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కి ఎట్టకేలకు పదవి. గౌరవప్రదంగా సాగనంపుతున్న కూటమి ప్రభుత్వం.

అమరావతి: జూన్, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని కూటమి ప్రభుత్వం నియమించింది. శ్రీలక్ష్మి 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. ఈమెను సాధారణ పరిపాలన శాఖకు ( జి ఏ డి ) స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.​ సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ సాధారణ పరిపాలన శాఖ ( జి ఏ డి ) పరిధిలోని పాలనా…

Read More

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. -కలెక్టర్ పిలుపు.

భీమవరం: జూన్, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 0-5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేస్తారు. ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 1,151 పోలియో చుక్కలు వేసే కేంద్రలు ఏర్పాటు చేసారు. జిల్లాలో 1.74 లక్షలకుపైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసే లక్ష్యంతో ప్రత్యేక చర్యలు చేపట్టామని కలెక్టర్…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణమయ నిధి ప్రత్యేక కౌంటర్ ప్రారంభం. విరివిగా భక్తుల విరాళాలు.

భీమవరం: జూన్, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం లో అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయ ప్రాజెక్ట్ ప్రత్యేక కౌంటర్ గురువారం ప్రారంభించారు. భక్తుల నుండి బంగారం విరాళం గా సేకరించే కార్యక్రమం నిమిత్తం దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను స్థానిక శాసన సభ్యులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, సత్యవాణి దంపతులు ప్రారంభించి,…

Read More

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జేష్టమాస దీక్ష.

మంగళగిరి: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం మంగళగిరిలో శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించి దీక్ష చేపట్టారు. ఏటా జ్యేష్ఠ మాసంలో ప్రారంభించి, కార్తీక మాసంలో దీక్ష విరమిస్తారు. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం ఈ దీక్ష క్రమం తప్పకుండా ప్రతి ఏటా చేస్తున్నారు. నియమితమైన జీవనంతోపాటు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలు ధరిస్తారు. ఎక్కువగా…

Read More

నేడే గజమాల యాత్ర మహోత్సవం ప్రారంభం.

మొగల్తూరు: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముత్యాలపల్లి లో ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ బండిముత్యాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి గురువారం ఉదయం 9:00 గంటల నుంచి గజమాల యాత్ర ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. శ్రీ బాల తిరుపతిగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ లోని అప్పనపల్లి దేవస్థానం చైర్మన్ మొల్లేటి చక్రపాణి అప్పనపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మాత శ్రీ శ్రీ మొల్లేటి రామస్వామి పుణ్య దంపతులు అప్పనపల్లికి పేరు రావడానికి…

Read More

వైభవంగా శ్రీవారి కల్యాణ వేడుకలు.

పాలకొల్లు: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బాలికల పాఠశాల వద్ద గల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. శేషాద్రి హాస్పిటల్ అధినేతలు, ప్రముఖ వైద్యులు గుణ్ణం నారాయణరావు, సుజయ శ్రీ ఆధ్వర్యంలో ఘనంగా కళ్యాణం నిర్వహించారు. పురోహితులు శశికాంత్ (తణుకు), కృష్ణ చైతన్య తదితరులు స్వామివారి కల్యాణోత్సవం జరిపించారు. ఈ కళ్యాణోత్సవానికి పలువురు దంపతులు, భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఆలయ ఈవో…

Read More