Skip to main content

Telugu News Power

Telugu News Power

పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావుకుశ్రద్ధాంజలి.

రాజమహేంద్రవరం: జూలై,20 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు జీఎస్ రావుకు పార్టీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. స్వస్థలం పెద్దేవం గ్రామం సోమవారం, ఆయన నివాసానికి చేరుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. జీఎస్ రావు సతీమణి, కుమారుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడును ఓదార్చి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. రాష్ట్ర సమన్వయకర్త…

Read More

శ్రీలంకలో జయశ్రీ మహాబోధి టెంపుల్ సందర్శించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్.

శ్రీలంక తెలుగు కాంగ్రెస్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటిస్తున్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం అనురాధపురలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రం “జయశ్రీ మహాబోధి టెంపుల్” సందర్శించారు. ఈ బౌద్ధక్షేత్రం ప్రపంచంలో అత్యంత పవిత్రమైన బౌద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఉన్న బోధివృక్షం భారతదేశంలోని బోధ్‌గయలో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన మహాబోధి వృక్షానికి చెందిన కొమ్మ నుండి పెంచబడినదిగా బౌద్ధ సంప్రదాయం చెబుతుంది. ఈ మహావృక్షాన్ని బంగారు కడ్డీలతో సంరక్షిస్తున్నారు. క్రీ.పూ. 3వ శతాబ్దంలో చక్రవర్తి…

Read More

రిజిస్ట్రేషన్ శాఖలో ప్రైవేటీకరణ లేదు. -స్పష్టం చేసిన ప్రభుత్వం

అమరావతి: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరిస్తున్నట్టు వైసిపి పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రజలకు మరింత చేరువగా రిజిస్ట్రేషన్ శాఖ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి సేవా కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. చట్టబద్ధ అధికారాలన్నీ రిజిస్ట్రేషన్ శాఖ తన వద్ద ఉంచుకుందని స్పష్టం చేసింది. పాస్ పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సత్వర సేవలు అందుతున్నందున, అదే తరహాలో…

Read More

చిన్నారికి పునర్జన్మనిచ్చిన సీఎం సహాయనిధి. -మంత్రి నిమ్మల వ్యక్తిగత శ్రద్ధ

పాలకొల్లు/ యలమంచిలి: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు మానవీయ శ్రద్ధ, సేవల వల్ల ఓ బాలిక పునర్జన్మ ఎత్తింది. బాలిక నిండు నూరేళ్ల జీవితం మొగ్గలోనే రాలిపోకుండా, నిమ్మల అమృత హస్తాలు ఆదుకొని, ఆ కుటుంబంలో నెలకొన్న విషాద చీకట్లను తొలగించి, సంతోషాల వెలుగులు నింపింది. యలమంచిలి మండలం, కనకాయ లంకకు చెందిన బాలిక కొల్లు అనూష గుండెకు రంధ్రం ఉండటంతో జీవితం ప్రమాదంలో…

Read More

దస్తావేజులేఖర్ల పెన్ డౌన్ నిరసన ప్రారంభం.

పాలకొల్లు: జూలై,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక సబ్-రిజిస్టార్ కార్యాలయం వద్ద సోమవారం దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ నిరసన కార్యక్రమం శిబిరాన్ని సంఘ అధ్యక్షులు తాళ్లూరు వెంకటేశ్వరరావు ప్రారంభించారు. వేలాదిమంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ప్రస్తుత వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా, లేకర్ల పొట్ట పొట్టే విధంగా ప్రభుత్వం తీసుకు వస్తున్న 396 జీవో వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేఖర్లతో పాటు డిటిపి ఆపరేటర్లు, పరోక్షంగా ఇంకా ఎందరో ఈ వృత్తిపై ఆధారపడి…

Read More

రక్షణ చట్టాలపై బాలికలకు అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు:జూలై, 20( తెలుగు పవర్ డాట్.కామ్) పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోలా రజనీకుమార్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బివిఆర్ఎం బాలికల ఉన్నత పాఠశాలలో బాలికలకు, మహిళా ఉపాధ్యాయులకు, సిబ్బందికి మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటి నియంత్రణపై, మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సిఐ రజినీకుమార్ సదస్సులో వివరించారు. మహిళ భద్రతలో భాగంగా బాల్య వివాహాల నిషేధ చట్టం, భారతీయ న్యాయ సంహిత ( బి.ఎన్.ఎస్)…

Read More

క్షీరా రామం మాడవీధుల్లో భక్తుల ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూలై, 20( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పంచారామ శిరోభాగ క్షేత్ర, శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ మాడవీధుల్లో సోమవారం భక్తులు సప్త ప్రదక్షిణలలో భారీగా పాల్గొన్నారు. సప్త మారేడు దళములు, సప్త ప్రదక్షణ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఆలయ పర్యవేక్షకులు పి వాసుతో కలిసి పట్టణ ఎస్సై రజిని కుమార్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. లోక కళ్యాణార్థం, వర్షాల రాక కోసం, రాత్రి పంచ హారతులు…

Read More

జపాన్ ఓపెన్ సూపర్ 750 విజేతగా చరిత్ర సృష్టించిన పీవీ సింధు. పవన్ కళ్యాణ్ అభినందనలు.జపాన్ ఓపెన్ సూపర్ 750 విజేతగా చరిత్ర సృష్టించిన పీవీ సింధు. పవన్ కళ్యాణ్ అభినందనలు.

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అద్భుత విజయం సాధించి, చరిత్ర సృష్టించింది. జపాన్‌కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి అకానే యమగుచిని, ఆమె సొంతగడ్డపై ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచింది. ఈ ఘనతపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా, ప్రధాని మోడీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి…

Read More

సాహితీవేత్త అప్పాజోష్యులకు రసధుని పురస్కారం.

పాలకొల్లు: జూలై, 19( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రసధుని సాహిత్య సంస్థ, గత 32 ఏళ్లగా అందిస్తున్న పెద్దభోట్ల బ్రహ్మయ్య స్మారక పురస్కారానికి, ఈ ఏడాది ప్రముఖ సాహితీ వేత్త, విశ్రాంత ఆచార్యులు, అప్పాజోష్యుల సత్యనారాయణ ను ఎంపిక చేసింది. ఈ నెల 26న స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాలులో ఉదయం 10 గంటలకు ఈ పురస్కార కార్యక్రమం జరుగుతుందని అధ్యక్షులు కొట్టి భాస్కరరావు తెలిపారు. ఈ పత్రిక సమావేశంలో కార్యదర్శి వెంకటరత్నం, కోశాధికారి,…

Read More

ఈ దేశానికి నేనేమిచ్చాను. దాత కాశీ విశ్వనాధ రాజు ఫై కథనం.

భీమవరం: జూలై,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ దేశం నాకేమిచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేనేమిచ్చానని ఆలోచించే అత్యున్నత భావాలు కల వ్యక్తి ఉద్దరాజు కాశీ విశ్వనాథ రాజు. స్థానిక ప్రజలకు దాతగా సుపరిచితులు విశ్వనాథరాజు. సంపదను కూడబెట్టడమే గొప్పతనంగా భావించే ఈ రోజుల్లో, ఉద్దరాజు కాశీ విశ్వనాధ రాజు,సేవ, కరుణ, సామాజిక ప్రభావం అనే ప్రమాణాల గుర్తింపు పొందారు. మహాభారతంలోని దానకర్ణుడి పేరు తలపించేలా, ఆయనను అభిమానులు “అపార దాన కర్ణ”గా అభివర్ణిస్తారు….

Read More