Telugu News Power

Telugu News Power

పదో తరగతి ప్రతిభావంతులకు సత్కారం.

యలమంచిలి:మే,3(తెలుగు న్యూస్ పవర్. కామ్) బుంగ తాతబ్బాయ్ ఫౌండేషన్ చైర్మన్, సీనియర్ జర్నలిస్టు బిఇ తిరుమల రాజు చేస్తున్న సమాజ సేవా కార్యక్రమాలు అభినందనీయం అని మట్లపాలెం సర్పంచ్ చల్లా విశ్వేశ్వరరావు అభినందించారు. చదువుకునే విద్యార్థులు అంటే తిరుమల రాజు కి ఏంతో ఇష్టమని అందుకే ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన విద్యార్థులకు, విద్యా సామాగ్రి అందజేసి ప్రోత్సాహిస్తారని కొనియాడారు. మట్లపాలెం ఉన్నత పాఠశాల లో చదివి పదవతరగతి పరీక్షలలో జిల్లా టాప్ ర్యాంకర్ గా నిలిచిన అంబటి…

Read More

చెరువు భూమిలో అక్రమ ఇళ్ల తొలగింపు . అర్హులకు ప్రభుత్వ ఇళ్ళు -కలెక్టర్ భరోసా.

వీరవాసరం: మే ,2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మత్స్యపురి గ్రామం చెరువు పోరంబోకు భూమిలో అక్రమంగా నిర్మించిన ఇళ్ల తొలగింపు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి బాధితులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. తొలగించిన ఇళ్లలో అర్హత కలిగిన 16 మందిని గుర్తించి, వారికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి రుణాలు కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. డ్వాక్రా…

Read More

జలవనరుల శాఖకు రూ. 397 కోట్ల నిధులు. నామినేషన్ పై రూ. 10 లక్షల లోపు పనులు. -మంత్రి నిమ్మల వెల్లడి.

పాలకొల్లు: మే,3(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర జలవనరుల శాఖకు రూ.397 కోట్ల నిధులు మంజూరైనట్టు రాష్ట్ర జనవరిలో శాఖ మాత్యులు, పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం వెల్లడించారు. జల వనరుల శాఖ తరపున ముఖ్యమంత్రి కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో చివరి ఎకరం వరకు నీటి సరఫరా జరగాలని లక్ష్యంతో, రైతులకు, వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ, ఇప్పటివరకు సుమారు రూ.1100 కోట్ల నిధులు కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు. అత్యవసరంగా అవసరమైన, కాలువలు,చెరువులు,…

Read More

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.

పాలకొల్లు: మే,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం ఆర్ఎఫ్) చెక్కులు, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు తన క్యాంపు కార్యాలయం వద్ద శనివారం రాత్రి పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య కారణాల వల్ల చికిత్సకు అర్హులైన 97 మందికి రూ. 40.92 లక్షల విలువైన చెక్కులు లబ్ధిదారులకుౠ అందజేశారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెచ్చెట్టి బాబు, వెంకటేశ్వరరావు, ధనాని సూర్యప్రకాష్,, బిట్ట లక్ష్మీనారాయణ, చిలుకూరు బాలాజి,…

Read More

కొంతేరు యూత్ క్గబ్ నాటికోత్సవాలు ప్రారంభించిన మంత్రి నిమ్మల.

యలమంచిలి: మే, (తెలుగు న్యూస్ పవర్. కామ్) కొంతేరు యూత్ క్లబ్, నాటికోత్సవాలు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలపరుల శాఖామాత్యులు శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభకు అధ్యక్షులు అంబటి మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. ఉపాధ్యక్షులు బోనం రవి సభకు స్వాగతం పలికారు. జాతీయస్థాయి గుర్తింపు కలిగిన ప్రతిష్టాత్మక కొంతేరు యూత్ క్లబ్ సేవలను మంత్రి ప్రశంసించారు. ఈ సందర్భంగా, మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రముఖ టీవీ, సినీ నటులు, నిర్మాత, స్థానికులు ఖండవల్లి అనిల్ అర్క…

Read More

రైతు విశ్రాంతిభవనం ప్రారంభించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మే, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఆవరణలో ఉన్న రైతు విశ్రాంతిభవము స్థానానికి శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు శనివారం ప్రారంభించారు. రైతు విశ్రాంతి భవనాన్ని రూ. 42 లక్షల నిధులతో ఆధునికీకరించారు. ఈ సందర్భంగా, ఏఎంసీ చైర్మన్, కోడి విజయభాస్కర్, వైస్ చైర్మన్ దాసరి రత్నం రాజు తమ డైరెక్టర్ల బృందంతో కలిసి పలువురిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్…

Read More

అటవీ శాఖ అధికారిపై హైకోర్టు ఆగ్రహం. ఎఫ్ ఆర్ ఓ జి. శ్రీరాములపై సస్పెన్షన్ వేటు

అమరావతి: మే,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ ఉద్యోగులు దైవాంశ సంభూతులు కాదని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారులు ప్రజా సేవకులు మాత్రమేనని గుర్తు చేసింది.హైకోర్టు హాల్లో న్యాయమూర్తి ఎదుట బాధ్యతారాహిత్యంగా, గర్వంగా ప్రవర్తించిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. శ్రీరాములు పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ అటవీ దళాల అధిపతి డాక్టర్ పి.వి. చలపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు.సూర్య…

Read More

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కు పరామర్శ

హైదరాబాద్: మే,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ నివాసానికి శనివారం వెళ్లి కలుసుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్, శ్వాస ఇబ్బంది కారణంగా ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈసందర్భంగా,పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజినోవా ఆత్మీయస్వాగతం పలికారు.

Read More

కష్టపడి పనిచేసే వారికి ఓటెయ్యండి, వైసీపీకి ఒక్క ఓటు వేసిన నష్టమే

యలమంచిలి: మే, 2(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పని చేసే కూటమి ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఓటు వేయాలని, స్థానిక శాసనసభ్యులు, మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మండలంలోని ఆరు గ్రామాలలో, రూ. 7.60 కోట్ల తో ప్రారంభించనున్న, 10 పనులకు శనివారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు అయిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రాన్ని 14 లక్షల కోట్ల రూపాయల అప్పులతో, 20 ఏళ్ళ వెనక్కు…

Read More

యమంచిలిలో మేడే వేడుకలు

యలమంచిలి: మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ కార్మిక దినోత్సవం, మే డే సందర్భంగా యూటీఎఫ్, సిఐటియు యలమంచిలి మండల శాఖల ఆధ్వర్యంలో మండల కేంద్రం వద్ద యుటిఎఫ్, సిఐటియు పతాకావిష్కరణల కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి యుటిఎఫ్ యలమంచిలి మండలాధ్యక్షులు గుత్తిందీవి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన యుటిఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి క్రాంతికుమార్ మేడే సందర్భంగా, యుటిఎఫ్ పతాకాన్ని, సిఐటియు పతాకాన్ని మండల అధ్యక్షురాలు కె. శ్రీ…

Read More