Skip to main content

Telugu News Power

Telugu News Power

మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం. నలుగురిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు.

జనరల్ డెస్క్: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా బడ్నగర్‌లో మొహర్రం ఊరేగింపు సందర్భంగా బాణాసంచాతో నింపిన వాహనాన్ని క్రేన్‌తో సుమారు 40 అడుగుల ఎత్తుకు ఎత్తి పేల్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో శుక్రవారం వైరల్ అయింది.ఈ ఘటనపై పోలీసులు నిర్వాహకుడు షోయబ్ ఖాన్‌తో పాటు ఈ ఫీట్ లో పాల్గొన్న మరో ఇద్దరు వ్యక్తులు, క్రేన్ యజమానిపై కేసు నమోదు చేశారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే…

Read More

భద్రతపై జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సులు.

భీమవరం: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్ కామ్) పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఆదేశాల మేరకు, మహిళలు, చిన్నారుల భద్రతను పోలీసులు నిరంతర ప్రత్యేక కార్యాచరణను చేపట్టింది. ఇందులో భాగంగా, జిల్లావ్యాప్తంగా నియమించబడిన ‘శక్తి టీమ్స్’ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు భీమవరం వన్ టౌన్ పరిధిలోని ఆర్టీసి బస్ స్టాండ్, పాలకోడేరు లోని జెడ్పీ హై స్కూల్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సదస్సుల్లో పాల్గొన్న పోలీసు అధికారులు,…

Read More

ఉపాధి శ్రామికులకు సత్కరానికి మంత్రి నిమ్మల సైకిల్ యాత్ర.

యలమంచిలి/ పాలకొల్లు: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జనవణంలో శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు మేడపాడు గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ శ్రామికులకు వస్త్రాలు బహుకరించి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ సమయంలో సహకరించిన దాతలకు, స్థానిక నాయకులు నరేంద్ర రాజాలకు కృతజ్ఞతలు తెలిపారు. స్వగ్రామం ఆగర్తిపాలెంలో జరిగిన ఉపాధి శ్రామికుల సత్కార కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. వారే స్వయంగా విందు భోజనాలు…

Read More

తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం మహోత్సవం.

తిరుమల: జూన్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి జ్యేష్ఠాభిషేకం తిరుమలలో జరిగే అత్యంత విశిష్టమైన ఉత్సవాల్లో ఒకటి.ఈ ఉత్సవాన్ని “అభిదేయక అభిషేకం” అని కూడా పిలుస్తారు.అభిదేయకం అంటే రక్షణ కవచం అని అర్థం. గ్రీష్మతాపం తగ్గి, సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీమహావిష్ణువు కలియుగంలో వేంకటేశ్వర స్వామిగా అవతరించినప్పుడు తన దివ్యాయుధాలతో అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. స్వామివారి ఆయుధాల తేజస్సు,…

Read More

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమం చేపట్టిన పోలీసు,ఎక్సైజ్ శాఖలు

పాలకొల్లు: జూన్,26 (తెలుగు న్యూస్ పవర్.కామ్) అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రఖ్యాత హాస్య నటులు అల్లు అల్లు రామలింగయ్య విగ్రహం కూడలి వద్ద విస్తృతస్థాయిలో పోలీసుల అవగాహన సదస్సు నిర్వహించారు.యువతను, సమాజాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద మహమ్మారి గంజాయి, డ్రగ్స్ మహమ్మారి అని, వీటి బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పాలకొల్లు పట్టణ పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖల అధికారులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని…

Read More

ఈ నెల 30న రొయ్యల మేత షాపుల బంద్. రాష్ట్ర ఆక్వా రైతు సంఘం పిలుపు.

పాలకొల్లు: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏ విధమైన నియమ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా రొయ్యల మేత తయారీ ఫ్యాక్టరీలు భారీగా పెంచిన ధరలు తగ్గించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమైనట్టు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు శుక్రవారం జరిగిన సమావేశంలో తెలిపారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 30న మేత దుకాణాలన్నీ బంధు పాటించాలని పిలుపునిచ్చారు. ఆక్వా రైతులకు మద్దతుగా మేత షాపుల నిర్వాహకులు…

Read More

ఉభయగోదావరి జిల్లాల్లో ఇళ్లల్లో ఈగల మోత. బయటకు రాని విషపు ఈగల బాధితుల వివరాలు.

జనరల్ డస్క్: జూన్,26( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాలానుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వివిధ రకాల వ్యాధులు రావటం సహజం. వీటితోపాటు కొన్ని రకాల కీటకాల కూడా ఉద్భవించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే వీటి గురించి బయట ప్రపంచానికి తెలియ రావడం లేదు. బాధితులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం దృష్టికి రాక నివారణ చర్యలు ఇంతవరకు ప్రారంభం కాలేదని బాధితులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో యాసిడ్ పురుగు, బీటిల్ బగ్…

Read More

ఘనంగా డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ ఆవిర్భావ దినోత్సవం.

తాడేపల్లిగూడెం: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్ ) పశ్చిమ గోదావరి జిల్లా, వెంకటరామన్నగూడెం, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.విశ్వవిద్యాలయం ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపకులపతి డాక్టర్ కె. ధనుంజయరావు అధ్యక్షత వహించారు. అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన పరిశోధన, విద్యా రంగాల్లో విశ్వవిద్యాలయం సాధించిన…

Read More

ఘనంగా గజమాలయాత్ర బండి ముత్యాలమ్మ ఆలయం నుంచి అప్పనపల్లి బాలాజీ సన్నిధికి.

మొగల్తూరు: జూన్,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, అప్పనపల్లి లో వేంచేసియున్న శ్రీ బాలాజీ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం మహా గజమాల యాత్ర భారీ భారీగా సాగింది. స్థానిక ముత్యాలపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ బండి ముత్యాలమ్మ ఆలయం వద్ద నుంచి గురువారం ఉదయం ఈ యాత్ర ప్రారంభం అయింది. నరసాపురం నియోజకవర్గం శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో అత్యంత…

Read More

వెనిజులా-జపాన్ భూకంపాలు: శిథిలాల నుంచి సజీవంగా 14 ఏళ్ల బాలిక వెలికితీత జపాన్‌లోనూ భారీ నష్టం

కారకాస్/టోక్యో: వెనిజులాను బుధవారం కుదిపేసిన శక్తివంతమైన జంట భూకంపాల అనంతరం సహాయక బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి. రాజధాని కారకాస్‌లోని శాన్ బెర్నార్డినో ప్రాంతంలోని ఓ పారిష్ భవనం శిథిలాల కింద చిక్కుకున్న 14 ఏళ్ల బాలికను గంటలపాటు సాగిన సహాయక చర్యల అనంతరం సజీవంగా బయటకు తీశారు. సహాయక సిబ్బంది, స్థానిక ప్రజలు ఆమెను చప్పట్లతో అభినందిస్తూ ఆసుపత్రికి తరలించారు. వెనిజులాలో సంభవించిన 7.2, 7.5 తీవ్రతల వరుస భూకంపాల కారణంగా అనేక భవనాలు కుప్పకూలాయి….

Read More