Skip to main content

Telugu News Power

Telugu News Power

పంచారామంలో చండీ హోమం.

పాలకొల్లు: జూన్, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో సోమవారం పౌర్ణమి సందర్భంగా, కళ్యాణ మండపంలో చండీ హోమం జరిగింది. పూజలు,హోమములు 23 మంది పుణ్యదంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అభిషేక పండితులు బమిడి పాటి వెంకన్న భక్తులు తరఫున పూజలు జరిపించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి…

Read More

పంచారామం, క్షీరా రామ క్షేత్రం వద్ద భక్తుల ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూన్,29( తెలుగు న్యూస్ పవర్. కామ్)పంచరామ క్షేత్రం పాలకొల్లులో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము వద్ద సోమవారం సాయంత్రం శ్రీ స్వామి వారి సప్త సోమవారాలు సప్త ప్రదక్షిణాలు, ఏడు మారేడు దళములతో మాడవీధులలో భక్తులు సుమారుగా 450మంది ప్రదక్షిణములలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, పర్యవేక్షకులు పి వాసు , ఆలయ ప్రధాన అర్చకుడు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి, కిష్టప్ప , ఆలయ సిబ్బంది…

Read More

క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్ జగన్. -మంత్రి నిమ్మల ఆరోపణ.

పాలకొల్లు: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) క్రెడిట్ చోరీ గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకులను పాలకొల్లు శాసనసభ్యులు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. మంత్రి ఆదివారం పత్రిక సమావేశంలో మాట్లాడుతూ, అసలు క్రెడిటే లేని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీకి నేరాలు ఘోరాలు చేయటంలో ఎంతో క్రెడిట్ ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు 40 రకాల తో సారె సమర్పణ.

భీమవరం: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు,, తెలుగు ప్రజలు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి పట్టణానికి చెందిన కందకట్ల నాగేశ్వరావు, వారి కుటుంబ సభ్యులు, భీమవరం వైభవ్ శారీస్ అండ్ రేడిమెడ్స్ వారు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి . సుమారు 40 రకాల సారె సమర్పించారు. దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ…

Read More

నేడే శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానంలో చండీ హోమం. రైతులకు అమ్మవారు అనుగ్రహించిన విత్తనాల పంపిణీ.

భీమవరం: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణ ఇలవేలుపు, తెలుగు ప్రజలు ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో అమ్మవారి అనుగ్రహం కటాక్షం ప్రతి పౌర్ణమి నాడు జరిపే చండీ హోమం దేవస్థానం అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఉదయం 7 గంటలకు నిర్వహిస్తారు. నాట్లు వేసుకునే వ్యవసాయం సమయం, ఆషాడ మాస ఆరంభాన్ని సూచించే జ్యేష్ట పౌర్ణమి సందర్బంగా ఏరువాక పున్నమి సందర్బంగా రైతు సోదర, సోదరీమణులకు, భక్తులకు శ్రీ…

Read More

సరదాగా మొదలై, సోషల్ మీడియా ఊబిలో కూరుకు పోతున్న మహిళలు.

నర్సాపురం: జూన్,28 తెలుగు న్యూస్ పవర్. కామ్) సైబర్ నేరాలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఎంత చెప్పినా వినకుండా మహిళలు కాలక్షేపానికి సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నారు. కొంతమందికి అది వ్యసనంగా కూడా మారిపోతుంది. ఏదో బలహీన క్షణంలో తన గుట్టు అపరిచిత వ్యక్తులకు వెల్లడించడం పెనుముప్పుగా పరిణమిస్తున్నది. ఇలాంటి సంఘటన నర్సాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ కీలకమైన సైబర్ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. పోలీసులు తెలిపిన కేసు…

Read More

పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా కాపు సంఘాల సమావేశం.

విజయవాడ: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు చైతన్య రథం పేరిట రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కాపు నాయకులు ఆదివారం అమరావతి ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించారు.గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాపు సమాజంలో చీలిక తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు కాపు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి అండగా నిలవాలని కాపు యువత, కుల సంఘాల నాయకులు స్వచ్ఛందంగా…

Read More

టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్. సాయి శ్రీనివాస్ ను ప్రకటించిన రాష్ట్ర కౌన్సిల్

అమరావతి: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లంకలపల్లి సాయి శ్రీనివాస్ ను రాష్ట్ర కౌన్సిల్ ఆదివారం ప్రకటించింది. పోటీ చేయడానికి కలిసివచ్చే ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతుతో ప్రస్తుత స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్ టి యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో చైర్మన్ గా లంకలపల్లి సాయి శ్రీనివాస్ పదవులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కౌన్సిల్ తీర్మానం మేరకు సాయి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు.లంకలపల్లి సాయి శ్రీనివాస్…

Read More

సంచలనాలు సృష్టిస్తున్న కేతన్ అగర్వాల్ హత్య కేసు. వంచనతో ఓడిపోయిన ప్రేమ కథ.

పుణె: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రేమ పేరుతో వంచించి చివరకు హత్య కేసు గా మలుపు తిరిగిన ఘోర సంఘటన. సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన నేరపూరిత కుట్ర, లోహగడ్ కోటలో నేర పునర్నిర్మాణంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్‌ను పోలీసులు లోహగడ్ కోటకు తీసుకెళ్లి నేర పునర్నిర్మాణం…

Read More

సమాజాన్ని చైతన్య పరిచేవారు జర్నలిస్టులు. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన వృత్తి జర్నలిజమని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవలన శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక కిరాణం మర్చంట్ అసోసియేషన్ హాల్లో జరిగిన రెండు రోజుల పాత్రికేయుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజానికి స్ఫూర్తిని ఇవ్వడం కోసం, చైతన్య పరచడానికి జర్నలిస్టులు నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంతో పనిచేస్తారని తన అనుభవం అని…

Read More