Telugu News Power

Telugu News Power

క్షీరా రామలింగేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు.

పాలకొల్లు: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయం హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ హుండీని 105 రోజులకు లెక్కించారు. హుండి ఆదాయం రూ.18,97,247/- లు వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారులు, క్షీరపురి అన్నదాన సమాజం, ఎన్ రంగరాజన్, సలాది వారి సత్రం, వి. నాగజ్యోతి, చిన్న గోపురం, శంకర్, క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం, ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి…

Read More

కొత్త పామాయిల్ మిల్లులతో నూనె దిగుబడి పెంచాలి. -ఎంపీ పురందరేశ్వరి.

న్యూఢిల్లీ: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) పామాయిల్ మిల్లులను ఆధునీకరించాలని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పార్లమెంట్లో డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌, భారతదేశంలోనే అత్యధిక పామ్ ఆయిల్ సాగు విస్తీర్ణం కలిగి ఉందన్నారు. ఈ పంట సుమారు 2.49 లక్షల హెక్టార్ల సాగవుతుందని తెలిపారు. దాదాపు 1.97 లక్షల మంది రైతులకు జీవనాధారంగా ఉందన్నారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పామ్ ఆయిల్ పంట దేశీయ ఉత్పత్తి పెంపు, దిగుమతుల తగ్గింపు లక్ష్యంగా జాతీయ…

Read More

రోటరీ జిల్లా గవర్నర్ గా ముచ్చర్ల సంజయ్.

విజయవాడ/పాలకొల్లు: ప్రతిష్టాత్మకంగా జరిగిన రోటరీ జిల్లా గవర్నర్ కు జరిగిన ఎన్నికల్లో స్థానిక ప్రముఖ దంత వైద్యులు ముచ్చర్ల సంజయ్ సోమవారం రాత్రి ఎన్నికయ్యారు. తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రెవిన్యూ జిల్లాలు ఒక రోటరీ జిల్లాగా పరిగణిస్తారు. ఈ రోటరీ జిల్లాలో 74 క్లబ్బులు ఉన్నట్టు సంజయ్ తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తన విజయం సభ్యులందరి సమిష్టి విజయం గా అభివర్ణించారు….

Read More

మంత్రి నిమ్మల రామానాయుడు రూ 5 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన .

భీమవరం : మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో సుమారు రూ 5.50 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి రామానాయుడు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సోమవారం శంకుస్థాపన చేశారు. రూ 2.50 కోట్లతో ఆర్ అండ్ బి రోడ్డు, రూ 3 కోట్లతో…

Read More

రోగులకు మెరుగైన సేవలు -వైద్యాధికారిణి డాక్టర్ మాధురి

పాలకొల్లు: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక ఏరియా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి చీఫ్ సూపరిండెంట్ డాక్టర్ యర్రా మాధురి సోమవారం వెల్లడించారు. తన నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో రోగులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఆసుపత్రిలో, డాక్టర్లు25 మంది, స్టాఫ్ నర్స్ లు 24 మంది, హెడ్ నర్సులు…

Read More

ప్రధాని నరేంద్ర మోదీ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు.

విజయవాడ: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధాని నరేంద్ర మోడీ సృష్టించిన అరుదైన రికార్డ్ పట్ల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సోమవారం స్పందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఈ అపూర్వ ఘట్టం సందర్భంగా, అభినందనలు తెలిపారు. భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగిన నేతగా మోదీ ఈ రికార్డు సృష్టించారు. మునుపటి సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ సృష్టించిన 8,930 రోజుల రికార్డును అధిగమించి, మోదీ 8,931 రోజులపాటు దాటీ…

Read More

నర్సాపురం తాలూకా జేఏసీ ఏర్పాటు.

నర్సాపురం: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) నరసాపురంలో ఏపీ జేఏసీ నరసాపురం తాలూకా నిర్మాణం సోమవారం జరిగింది. యలమంచిలి, మొగల్తూరు నరసాపురం టౌన్, నర్సాపురం రూరల్ మండలాలు ఈ తాలూకాలో ఉన్నాయి. నరసాపురం తాలూకా జేఏసీ జాయింట్ సెక్రటరీ గా యలమంచిలి మండలం మండలం, పంతం రామమూర్తి నాయుడు, ఈసీ మెంబర్లుగా దండు పద్మావతి, గుత్తిందీవి శ్రీనివాసరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి ఎస్ విజయరామరాజు ప్రధాన కార్యదర్శి పి…

Read More

ఉక్కు పరిశ్రమతో లక్ష మందికి ఉద్యోగాలు.

అనకాపల్లి: మార్చి, (తెలుగు న్యూస్ పవర్. కామ్) అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండలం లో దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇది చారిత్రాత్మక ఘట్టం. పారిశ్రామిక రంగంలో కీలక మైలురాయిగా నిలిచే మరో భారీ ప్రాజెక్ట్‌కు అనకాపల్లి వేదికైంది. దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగడం రాష్ట్రానికి గర్వకారణం. ప్రముఖ ఉక్కు సంస్థ అర్సలార్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా చేపడుతున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ దేశ…

Read More

కనకయలంక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనుల్లో కదలిక.

యలమంచిలి: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) తరచూ, వరదలు వల్ల ఇబ్బందులు పడుతున్న కనకాయలంక ప్రజలకు శాశ్వత విముక్తి కోసం ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి నీటిపారుదల శాఖ ఇంజనీర్లు సోమవారం, ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించారు. ఈ పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తారని, పెదలంక సర్పంచ్ తాళ్ల నాగరాజు తెలిపారు.

Read More

వారం రోజులు ముందే టిడిపి జెండా పండుగ.

భీమవరం: మార్చి, 23(తెలుగు న్యూస్ పవర్.కామ్) తెలుగుదేశం పార్టీ, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, వారం రోజులు ముందు నుంచే వాడు వాడల జెండా పండుగ నిర్వహిస్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ప్రజా ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు, జయంతి సందర్బంగా,మార్చి,29న ప్రారంభం కావలసిన వాడవాడలా టిడిపి జెండా పండగ, భీమవరంలో వారం రోజులు ముందే రాజ్యసభ మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి సోమవారం ప్రారంభించారు. పట్టణంలోని 1 వార్డు మెంటేవారితోటలో…

Read More