Skip to main content

Telugu News Power

Telugu News Power

డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్ట్ లు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మే, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలమూరు శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, మంగళవారం తన క్యాంపు కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలకు ఎగ్ కార్ట్ లు పంపిణీ చేశారు. జాతీయ గుడ్ల సమన్వయ కమిటీ (ఎన్ ఇ సి సి) వారి సౌజన్యంతో 50 వేల రూపాయల విలువైన, వ్యాపారానికి అవసరమైన బండి కుర్చీలు, ఇతర సమస్త సామాగ్రి ఉచితంగా అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళల కోసం డ్వాక్రా పథకం తీసుకువచ్చారన్నారు….

Read More

ఒక్క పూట మాత్రమే కుళాయినీరు. -పురప్రజలు సహకరించాలి కమిషనర్ విజయ సారధి.

పాలకొల్లు: మే, (తెలుగు న్యూస్ పవర్. కామ్). ఈనెల 8 నుంచి ఒక్క పూట మాత్రమే రక్షిత మంచినీరు సరఫరా జరుగుతుందని పొరపాలక సంఘ కమిషనర్ విజయ సారథి మంగళవారం ప్రకటించారు. ప్రతిరోజు ఉదయం గం. 6 నుంచి గం.7 వరకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. సాయంత్రం పూట నీటి సరఫరా జరగదని వెల్లడించారు. రైతులకు అవసర మైన సాగునీటి సరఫరా కోసం కాలువల తవ్వకం, వంతెనల నిర్మాణం వంటి పనుల వల్ల కాలువలకు నీటి సరఫరా…

Read More

పంచారామ క్షేత్రం క్షీరా రామంలో గణపతి హోమం

పాలకొల్లు: మే,5 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానములో మంగళవారం సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి హోమమం నిర్వహించారు. ఈ పూజలో 17 మంది దంపతులు పాల్గొన్నారు. శ్రీ స్వామి వారి కళ్యాణ మండపం వద్ద భక్తులచే అభిషేక పండితులు భమిడి పాటి వెంకన్న పూజలు జరిపించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. వీరికి దేవస్థానం కార్యనిర్వాణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు…

Read More

అధికార మార్పిడితో మారిన భారత రాజకీయ ముఖచిత్రం.

జనరల్ డెస్క్: ఏప్రిల్,4(తెలుగు న్యూస్ పవర్. కాం) ఈ ఏడాది, ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల చారిత్రాత్మక ఫలితాలు భారతదేశ రాజకీయ భవిష్యత్ చిత్రాన్ని ఆవిష్కరింపచేసాయి. బెంగాల్‌లో బీజేపీ చరిత్ర సృష్టించింది, తమిళనాడులో టీవీకే షాక్ ఇచ్చింది, కేరళలో ఎర్రజెండా అధికారం పోగొట్టుకొని, దేశంలో కమ్యూనిస్టులకు ఉన్న ఒకే ఒక్క అధికార పీఠం 50 ఏళ్ల తరువాత కుప్పకూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికారం చేపట్టి, తన ఉనికిని కాపాడుకుంది. పుదుచ్చేరి ఎన్నికల్లో మళ్లీ అధికారం…

Read More

గ్రంథాలయ శిబిరాలలో బాలల సెలవులు సద్వినియోగం చేసుకోవాలి. -కలెక్టర్ నాగరాణి పిలుపు.

మవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) బాలల భవిష్యత్తు కోసం, స్థానిక గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న 31 శిక్షణా శిబిరాల్లో పాల్గొని, సెలవులు సద్వినియోగం చేసుకోవాలని, కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. స్థానిక వీరమ్మ చెరువు పార్క్ వద్ద గల, గ్రేడ్ వన్ గ్రంధాలయాన్ని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు సోమవారం సందర్శించారు. వేసవిలో నిర్వహిస్తున్న విజ్ఞాన శిక్షణ తరగతులు జాతుల భావి జీవితానికి ఎంతగానో తోడ్పడతాయన్నారు. ఇష్టమైన…

Read More

కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయుష్ సేవలు ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి.

భీమవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ఆయుర్వేద వైద్య సేవల శిబిరం కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్ చదలవాడ నాగరాణి, సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. దేశీయ ఆయుర్వేదం పట్ల ప్రజలు అనిపించుకోవాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్,బీపీ, చర్మరోగాలకు కీళ్లవ్యాధులకు ఉచితంగా మందులు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఈ వైద్య సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అందిస్తున్న సేవలు గురించి కలెక్టర్ కు డాక్టర్…

Read More

బిజెపి విజయోత్సవం.

యలమంచిలి: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్)దేశంలో మినీ ఎన్నికలుగా భావించిన, ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో, భారతీయ జనతా పార్టీ, మూడు రాష్ట్రాల్లో అఖండ విజయం సాధించటంతో యలమంచిలి మండల భారతీయ జనతా పార్టీ సంబరాలు చేసుకుంది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి మేడపాడు సెంటర్లో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వల్లభు దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి నంబూరి రంగారావు, జడ్డు రామకృష్ణ కుక్కల కేశవరావు, దివి నరసింహారావు, పోతు మహేష్, పతంజలి,,వీర…

Read More

మహా మౌనసంకల్పనికి, శిరస్సు వంచిన ఎవరెస్టు శిఖరం!!!

జనరల్ డస్క్: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఈ భూమి మీద పడ్డ ప్రతి జీవికి, పరమార్థం నిర్దేశించి పంపుతాడు దేవుడు. దైవం కూడా మానవుడిలా అప్పుడప్పుడు, తప్పులు చేయడం సహజంమేనేమో! ఆ తప్పును దిద్దుకోవటానికి, మరో రూపంలో శక్తియుక్తులు ప్రసాదించటం కూడా విధి లీల. అలాంటి, వరం అందుకున్న, అన్నమనీడి దైవ వెంకట సత్యనారాయణ కథే ఇది. చూపులకు ఎక్కడ కనపడని లోపం, మనసు నిండా వజ్ర సంకల్పం, గుండె నిండా నింపుకొన్న ధైర్యం ఉన్న…

Read More

ప్రపంచ తెలుగు ఖ్యాతికి ప్రతీక దాసరి. -మంత్రి నిమ్మల రామానాయుడు.

పాలకొల్లు: ఏప్రిల్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ తెలుగు ఖ్యాతికి దాసరి నారాయణరావు ప్రతీకని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దాసరి నారాయణరావు 79వ జన్మదినోత్సవం సందర్భంగా, సోమవారం, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర గల దాసరి నారాయణరావు కాంస్య విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. వంగ నరసింహారావు,యర్రం శెట్టి వెంకటరత్నం, మేడికొండ శ్రీనివాస్ చౌదరి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,…

Read More

శ్రీ మావుళ్ళమ్మ వారి నిత్యాన్నదానానికి లక్ష రూపాయల విరాళం.

భీమవరం: ఏప్రిల్, 4(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన్నప్రసాద వితరణ కు భీమవరం, చినఅమిరం కు చెందిన భక్తులు,కోరాడ శ్రీనివాస్ కీర్తి దంపతులు ఒక లక్ష నూట పదహారు రూపాయల విరాళం సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వచన పూజలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ ధర్మకర్త రామాయణం…

Read More