Skip to main content

Telugu News Power

బాంబే స్వీట్స్ అధినేత బాపిరాజుకు మండలి చైర్మన్ మోషేన్ రాజు పరామర్శ.

భీమవరం: సెప్టెంబర్,2 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ వ్యాపారవేత్త, స్థానిక బాంబే స్వీట్స్ అధినేత పొత్తూరి బాపి రాజు, మాతృమూర్తి ఇటీవల స్వర్గస్తులయ్యా. వారి కుటుంబాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, యలమంచిలి మండల పరిషత్ అధ్యక్షురాలు, వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, ఉచ్చుల స్టాలిన్ బాబు, చించినాడ మాజీ సర్పంచ్ దంగేటి రాజమణి, పొత్తూరి రంగరాజు,ఏ . ఏస్ . రాజు,తదితరులు బుధవారం పరామర్శించి, సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read More

పిఠాపురంలో ఘనంగా జనసేన యువజన విభాగం‘జై కొట్టు’ ఆవిష్కరణ కార్యక్రమం.

ప్రత్యేక ఆకర్షణగా.. వేలాది బైకులతో ర్యాలీ జై జనసేన నినాదాలతో మారుమోగిన పిఠాపురం వేడుకలకు ప్రత్యేక శోభ తీసుకొచ్చిన ప్రత్యేక గీతం, ఏవీలు. వైభవంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కేక్ కటింగ్ జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ స్థానం పిఠాపురం వేదికగా పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ ఆవిష్కార సభ బుధవారం జరిగింది. జన…

Read More

జననేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.

యలమంచిలి: సెప్టెంబర్,2( తెలుగు న్యూస్ పవర్. కామ్.) మండలం లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 17 వ వర్ధంతి సందర్భంగా, నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో, మండల పరిషత్ కార్యాలయం వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణారాజు, సీఇసీ సభ్యులు గుణ్ణం నాగబాబు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు…

Read More

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారా? నీ ఇల్లు బంగారం కాను.

తిరుపతి: సెప్టెంబర్, 2( తెలుగు న్యూస్ పవర్. కామ్) అవినీతిపరులైన తిరుమల తిరుపతి అధికారుల ఇళ్లపై ఏసీబీ కొరడా ఝలిపించింది. అవినీతి నిరోధక శాఖ అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీఈవో లోకనాథం ఇంటిపై బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగిపోయే అంత పని అయింది. లోకనాథం ఇల్లంతా వారికి కొత్తబంగారు లోకంలా కనిపించింది. బంగారు,వెండి ఆభరణాలు భారీగా స్వాధీనం చేసుకుంటున్నారు. లాకర్లలోను, బంధువు ఇళ్లలోనూ ఇంకెంతుందో చూడ వలసి ఉందని…

Read More

ఘనంగా వైఎస్ 17వ వర్ధంతి

పాలకొల్లు: సెప్టెంబర్, 2( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణం లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 17 వ వర్ధంతి సందర్భంగా బుధవారం నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో పట్టణ గాంధీ బొమ్మల సెంటర్ వద్ద రాజశేఖర్ రెడ్డి విగ్రహనికి ఘన నివాళులు అర్పించారు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గుణ్ణం నాగబాబు, ఎస్ సీ కమిషన్ మాజీ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్, మండల జడ్పీటీసీ నడపన గోవిందరాజు నాయుడు,…

Read More

ఆర్థిక అసమానతలు లేని సమ సమాజం రావాలి. -మొగల్తూరు సభలో ముఖ్యమంత్రి ఆకాంక్ష

దేశంలోనే నెంబర్ వన్ ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు, మినీ హార్బర్ నిర్మాణం, కాళీపట్నం భూములకు పట్టాలు మహిళల ఉచిత ఏసి బస్సులు -సీఎం హామీలు. నర్సాపురం / మొగల్తూరు: సెప్టెంబర్,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆర్థిక అసమానతలు లేని సమ సమాజం రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. పేదల సేవలో, ప్రజా వేదిక కార్యక్రమంలో మంగళవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సభకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, బొమ్మిడి నారాయణ నాయకర్ అధ్యక్షత వహించారు….

Read More

గోదావరి తీరాన ఉరకలేస్తున్న అభివృద్ధి. పట్టణాలకు ధీటుగా పల్లెలకూ పుష్కర శోభ.

మరో రూ.100 కోట్లు మంజూరు చేయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ రహదారులు, తాగు నీటి సదుపాయాల కల్పనకు నిధులు పంచాయతీరాజ్ నిధులు రూ.90 కోట్లతో 7 నియోజకవర్గాల్లో రహదారుల అభివృద్ధి తాగు నీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి మరో రూ.10 కోట్లు ఇప్పటికే ఏపీపీసీబీ ద్వారా రూ.100 కోట్లు కేటాయించిన ఉప ముఖ్యమంత్రివర్యులు అమరావతి:సెప్టెంబర్,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ అనే థీమ్‌తో గోదావరి నది…

Read More

ముఖ్యమంత్రి సభ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నాయకర్ పిలుపు.

నర్సాపురం: ఆగస్టు,31( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు జరిపే పర్యటనకు సర్వం సన్నద్ధం చేశారు. సీఎం పర్యటనకు సంబంధించిన హెలిప్యాడ్, సభా ప్రాంగణం, విందు ఏర్పాట్లను ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ , ఏపీఐఐసీ చైర్మన్, జిల్లా టిడిపి అధ్యక్షులు మంతెన రామరాజుపాల్గొన్నారు. అధికారులతో పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకుంటూ, ఈ పర్యటనను కనీవిని ఎరుగని…

Read More

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద పెనుగొండ వాసికి ప్రమాదం. ఆసుపత్రిలో తుమ్మలపల్లి మృతి.

హైదరాబాద్/ పెనుగొండ: ఆగస్టు,31( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసి తుమ్మలపల్లి రామచంద్రరావు(70) మృతి చెందారు. వీరి మేనల్లుడు సాయి కుమార్ ఇంటికి రామచంద్రరావు సతీసమేతంగా వైద్య పరీక్షల కోసం వెళ్లారు. ఈ సందర్భంగా, సాయి కొత్త కారు పూజ నిమిత్తం కూలీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయానికి తీసుకువెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. కారు తీయవాసం పొరపాటున ఎక్సలరేటర్ తొక్కటంతో కారు హఠాత్తుగా ముందుకు దూసుకు…

Read More

ప్రధాని మోదీ రాసిన హిందీ కవితలను ఆలపించిన ఉజ్బెకిస్థాన్ విద్యార్థులు.

ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లో ఉన్న ‘మహాత్మా గాంధీ సెంటర్’ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ ఉజ్బెకిస్తాన్ విద్యార్థులు ప్రధాని మోదీ స్వయంగా రాసిన హిందీ కవితలను ఎంతో చక్కగా ఆలపించారు. మోదీ భావోద్వేగం హిందీ ఆ విద్యార్థులకు మాతృభాష కాకపోయినా, ఆయన రాసిన కవితలోని భావాలను తమ హృదయాల్లో అనుభూతి చెంది సరిగ్గా అదే భావాలతో చదవడం చూసి ప్రధాని నరేంద్ర మోదీ చాలా భావోద్వేగానికి గురయ్యారు. ఆ కవిత…

Read More