Skip to main content

Telugu News Power

ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాలు పరిశీలించిన ప్రోగ్రాం కమిటీ చైర్మన్ పెందుర్తి.

నరసాపురం: ఆగస్టు, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్)రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంగళవారం నరసాపురం నియోజకవర్గంలో పర్యటనకు సంబంధించి వివిధ ప్రదేశాలను సీఎం ప్రోగ్రాం కమిటీ పెందుర్తి వెంకటేశ్వరరావు సోమవారం పరిశీలించారు. ఈ పర్యటనలో సీఎం కు స్వాగతం పలికే హెలిపాడ్, ప్రజా వేదిక, కార్యకర్తల సమావేశం నిర్వహించే ప్రదేశాలను పెందుర్తి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పెందుర్తి పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో టిడిపి ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు, నీ వర్గ…

Read More

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట పోలీసు బందోబస్తు.

పోలీసు అదికారులు మరియు సిబ్బందికి దిశానిర్దేశం చేసిన ఏలూరు రేంజ్ ఐజీ జి.వి.జి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు పశ్చిమగోదావరి జిల్లా, నర్సాపురం, మొగల్తూరు గ్రామంలో నిర్వహించనున్న “పేదల సేవలో పెన్షన్ల పంపిణీ, ప్రజా వేదిక” కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీసు అధికారులు సోమవారం తెలిపారు….

Read More

వినాయక చవితికి విత్తన గణేశుడిని పూజిద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం! -మెగాస్టార్ చిరంజీవి పిలుపు.

హైదరాబాద్: ఆగస్టు,31( తెలుగు న్యూస్ పవర్.కామ్) రాబోయే వినాయక చవితికి విత్తన గణేశుడిని మెగాస్టార్ చిరంజీవి సోమవారం, ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అభినందనలు తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని పర్యావరణహితంగా జరుపుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా రూపొందించిన విత్తన గణేశుడి ప్రతిమలను ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. విత్తన గణేశుడు అంటే ఏమిటి?…

Read More

మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటన. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా భారత్–ఉజ్బెకిస్థాన్ బంధం. మోడీకి ఘన స్వాగతం. సాంస్కృతిక, యోగా కార్యక్రమాలు.

తాష్కెంట్, ఆగస్టు 30: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటనతో భారత్–ఉజ్బెకిస్థాన్ సంబంధాల్లో కీలక ముందడుగు పడింది. ఆగస్టు 29–30 తేదీల్లో ఉజ్బెకిస్థాన్‌లో అధికారిక పర్యటన చేపట్టిన ప్రధాని మోదీ.. అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్‌తో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను ఇకపై “సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి తీసుకెళ్లాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. వాణిజ్యం, పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి భారత్–ఉజ్బెకిస్థాన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని…

Read More

విదేశీ రక్షక బృందాలకు నేపాల్ తిరస్కరణ ఆర్థిక, మానవతా సాయానికి మాత్రం ఆమోదం.

యూఏఈ నుంచి 10 మిలియన్ డాలర్ల అత్యవసర సాయం ఖాఠ్మాండు: ఆగస్టు, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) హిమాలయ పర్వత ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన భారీ వరదలు, ఆకస్మిక వరదలతో నేపాల్ తీవ్ర విషాదంలో చిక్కుకుంది. నేపాల్–చైనా సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన ఈ విపత్తులో మృతుల సంఖ్య 469కు చేరగా.. ఇరుదేశాల పరిధిలో 1,468 మంది గల్లంతైనట్లు తాజా సమాచారం. ఈ సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు.భారీగా కొట్టుకుపోయిన రహదారులు, వంతెనలు, మౌలిక వసతుల కారణంగా…

Read More

కూటమిది చెట్లు నరికే సంస్కృతి కాదు. మొక్కలు నాటే సంస్కృతి. -ఏ. పి. గ్రీన్ చైర్మన్ నాగబాబు.

మంగళగిరి,: ఆగస్టు,29( తెలుగు న్యూస్ పవర్. కామ్)హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ పచ్చదనం పెంపునకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కృషి చేయాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ శ్రీ కొణిదెల నాగబాబు గారు పిలుపునిచ్చారు. మంగళగిరి అరణ్యారామం నందవనంలో సాంప్రదాయ రావి–వేప మొక్కల నాటే కార్యక్రమంలో నాగబాబు గారు, సతీమణి పద్మజ శనివారం కలిసి పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నాగబాబు దంపతులు…

Read More

తెలుగుకు గొడుగు, వ్యవహారిక భాషా పితామహుడు ‘గిడిగు’

విద్యాశాఖ, రసధుని ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు. పాలకొల్లు:ఆగష్టు, 29(తెలుగు న్యూస్ పవర్.కామ్) తెలుగుభాషా దినోత్సవం సందర్బంగా, స్థానిక బి. ఆర్. ఎమ్. వి. ఉన్నత పాఠశాల వారి సహకారంతో, ప్రఖ్యాత సాహితీ సంస్థ,రసధుని, మండల విద్యాశాఖ సంయుక్త ఆధ్యర్యంలో, తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు, గిడుగు వెంకట రామూర్తి పంతులు జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. గిడుగు జయంతి సందర్బంగా,మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు, సీనియర్ విభాగంలో 8,9 తరగతులకు “తెలుగుభాషా మాధుర్యం”, జూనియర్…

Read More

10 కే రన్ విజయవంతం చేయాలి. -కాస్మో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు భగవాన్ రాజు పిలుపు.

పాలకొల్లు: ఆగస్టు,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) అక్టోబర్, 25న పాలకొల్లులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 10కే పరుగు కార్యక్రమం విజయవంతం చేయాలని, స్థానిక కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు, రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కలు గాంధీ భగవాన్ రాజు పిలుపునిచ్చారు, స్థానిక కాస్మో క్లబ్ కళావేదిక పై “టెన్ కే రన్” గోడ పత్రిక శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా, గాంధీ రాజు మాట్లాడుతూ, విశాఖపట్నం వంటి మహానగరాలకు మాత్రమే పరిమితమైన…

Read More

ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా కొణిదెల నాగబాబు

ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా తనపై నమ్మకం ఉంచి ఈ కీలకమైన బాధ్యతలను అప్పగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు , ఉప ముఖ్యమంత్రి, మా నాయకుడు పవన్ కళ్యాణ్ కు నాగబాబు కృతజ్ఞతలు. గ్రీనరీ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచి, ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, అభిమానులకు నా ధన్యవాదాలు…

Read More

అమ్మానాన్నల ఆత్మహత్య అనాధగా చించినాడ బ్రిడ్జిపై మూడేళ్ల బాలుడు రోదన.

యలమంచిలి: ఆగస్టు, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పశ్చిమగోదావరి జిల్లా చించినాడ- అంబేద్కర్ కోనసీమ జిల్లా దిండి మధ్య 216 ఉన్న జాతీయ రహదారిపై ఉన్న వంతెనపై గురువారం మరో ఆత్మహత్య సంఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల పసిబిడ్డ ను యాక్టీవా బండిపై వదిలి దంపతులు గోదావరి నదిలో దూకి గల్లంతైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గల్లంతైన వారిని దొడ్డా సాయి (29), శిరీష (28)గా గుర్తించారు. మీరు వేల్పూరుకు చెందినవారుగా తెలిసింది. ఘటనపై…

Read More