పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు సత్కారం.
భీమవరం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్)జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా, జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ అధికారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ పంచాయతీలకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా విస్తృత అధికారాలు లభించాయని, స్థానిక వనరులను సమర్థంగా వినియోగించి గ్రామాభివృద్ధి సాధించవచ్చని కలెక్టర్ గారు పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో మౌలిక వసతులు,…