Telugu News Power

రాజేష్ పార్థివ శరీరం డామ్ పేట రాక.

పాలకొల్లు: మార్చి, 21 (తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక డామ్ పేటకు చెందిన కందికట్ల రాజేష్ (26) పార్థివ శరీరం స్వగ్రామం శనివారం చేరుకుంది. రాజేష్ ఉపాధి నిమిత్తం కువైట్లో పనిచేస్తున్నారు. ఈనెల 1న అనారోగ్యంతో కన్నుమూశారు. యుద్ద నేపద్యంలో 20 రోజుల పాటు కుటుంబ సభ్యులు ఎదురు చూడవలసి వచ్చింది. కుటుంబ సభ్యులు కన్నీరు మునిరయ్యారు.మంచి మనిషి, యువకుడు మరణం పట్ల స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజేష్ (ఫైల్ ఫోటో)

Read More

కార్మిక మంత్రి కాపవరం పర్యటన.

పాలకొల్లు: మార్చి, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ శనివారం స్థానిక కాపవరం గ్రామంలో పర్యటించారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, అంగర రామ్మోహన్రావు స్వగ్రామంలో నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవ సందర్భంగా, మంత్రి సుభాష్ విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ ,టిడిపి రాష్ట్ర కార్యదర్శి, పెచ్చెట్టి బాబు, సర్పంచ్ కోలాటి రాధా, అంగర చిన్న, గూడూరి శ్రీరామ్మూర్తి తదితర గ్రామ పెద్దలు…

Read More

ప్రజలకు మేలు చేయటమే కూటమి ప్రభుత్వ విధానం.

యలమంచిలి: మార్చి,21(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రజలకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ విధానమని, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, స్థానిక శాసన సభ్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక మండలంలో, రూ. 3.48’కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న, 12 అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి, గుంపర్రు లో జరిగిన సభలో మాట్లాడుతూ, గత ప్రభుత్వం ప్రజా వేదిక కూల్చడంతో విధ్వంస పాలన మొదలు పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం, పింఛను…

Read More

ఛాంబర్స్ కళాశాలలో ఈనెల 26న మెగా జాబ్ మేళా. -గోడ పత్రిక ఆవిష్కరించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మార్చి ,20 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ నెల 26న స్థానిక ఛాంబర్స్ కళాశాలలో జరగనున్న, మెగా ఉద్యోగమేళా గోడపత్రికను స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్న ఛాంబర్స్ కళాశాల యాజమాన్యాన్ని, ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు అభినందించారు. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడంలో ఏ విధమైన సహాయం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నట్టు మంత్రి నిమ్మల ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య…

Read More

యువతకు కొలువులతో, కూటమి ప్రభుత్వం మేలుకొలుపు. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మార్చి,20(తెలుగు న్యూస్ పవర్. కాం) కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో శుక్రవారం మంత్రి మీడియా ప్రనిధులతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి, మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రం నుంచి 400 కంపెనీలనుభయపెట్టి తరిమేసిందన్నారు. నాడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు…

Read More

నాటి ప్రభుత్వం చేసిన అప్పులు, నేటి ప్రభుత్వానికి తిప్పలు. -మంత్రి నిమ్మల విమర్శ

శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి నిర్మల యలమంచిలి, మార్చి, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) గత ప్రభుత్వం చేసిన 14 లక్షల కోట్ల అప్పుల వల్ల, నేడు అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు వెల్లడించారు. మంత్రి మండలంలో, రోడ్లు భవనాల శాఖ రూ.2.70 కోట్ల రూపాయల నిధులతో వేయనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన శుక్రవారం చేశారు. ఈ సందర్భంగా కాజ తూర్పులో జరిగిన సభలో మంత్రి…

Read More

మావుళ్ళమ్మ వారి స్వర్ణ నిధికి రూ.2 లక్షల బంగారం కానుక.

భీమవరం: మార్చి,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం, స్వర్ణ నిధికి భీమవరం కి చెందిన భక్తులు తాడి రమేష్ కుమార్, కరిష్మ పుణ్య దంపతులు సుమారు రెండు లక్షల ఇరవై వేలు విలువైన 16 గ్రాముల బంగారం సమర్పించారు, వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ…

Read More

ఓడ నిండా గ్యాస్ వస్తుంది, కొరత లేదు. -పౌరసరఫారాల మంత్రి మనోహర్

అమరావతి: మార్చి ,20 (తెలుగు న్యూస్ పవర్ కాం) గ్యాస్ సరఫరా పై వస్తున్న అపోహలు నమ్మవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. మంత్రి కీలక వివరాలు శుక్రవారం వెల్లడించారు. ఇప్పటివరకు 2.96 లక్షల బుకింగ్స్ గాను 2.78 లక్షల సిలిండర్లు అందజేసినట్టు తెలిపారు. సోషల్ మీడియా అపోహలు సృష్టించడం వల్ల వినియోగదారులు గ్యాస్ కోసం ఎగబడుతున్నారన్నారు. ఈనెల 26న విశాఖకు ఎల్పిజి గ్యాస్ నౌక చేరుకుంటుందని, ఇందువల్లసరఫరా మరింత…

Read More

దొడ్డిపట్లలో గ్రామ దేవత జాతర

యలమంచిలి: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక దొడ్డిపట్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ, గ్రామ దేవత మాణిక్యాలమ్మ, అమ్మవారి జాతర ఉత్సవాలు ఉగాది రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. పి ఆలయానికి సుమారు 700 ఏళ్ల ఘన చరిత్ర ఉందని భక్తులు భావిస్తారు. గ్రామ దేవతల పట్ల గ్రామస్తులు ఎంతో విశ్వాసం చూపుతారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రముఖులు, మహిళలు విశేషంగా పాల్గొన్నారు. దొడ్డిపట్ల జాతర ఉత్సవం కనకదుర్గమ్మ మాణిక్యం దేవతా మూర్తులు…

Read More

ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తున్నాను. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కాం) ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తున్నానని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా, ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనకున్న అవకాశాలన్నీ, వ్యక్తిగత స్వార్థానికి వాడుకోకుండా ప్రజల కోసమే వినియోగిస్తున్నానని మంత్రి నిమ్మల వెల్లడించారు. స్థానిక బి.ఆర్.అంబే బాలికలు, ఎంఎంకెఎన్ఎమ్ విద్యార్థులకు 250 సైకిళ్ళు ఉగాది రోజున ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి…

Read More