Skip to main content

Telugu News Power

నేడు కైకలూరులో జనసేన ఆత్మీయ సమావేశం.

భీమవరం: జూలై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో, తొలి సమావేశాన్ని కైకలూరు నియోజకవర్గంలో నిర్వహించనున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు గారు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఆత్మీయ సమావేశం బుధవారం ఉదయం 9:30 గంటలకు కైకలూరులోని సీఎన్ ఆర్ గార్డెన్స్…

Read More

దిగమర్రు లో రైతుబడి కార్యక్రమం.

పాలకొల్లు: జులై, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పొలం పిలుస్తుంది కార్యక్రమo దిగమర్రులో మంగళవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్, కౌరు సందీప్, తమ్మినీడి చంద్రశేఖరు, మాజీ సర్పంచ్ రాపాక నగేష్ కరుణాకరన్, రైతులు పాల్గొన్నారు సహాయ సంచాలకు పి మురళీకృష్ణ మాట్లాడుతూ, పంట పొలాలకు నీటి సరఫరా సవ్యంగా జరుగుతుందని రైతులు ఎటువంటి కంగారు పడవద్దని ధైర్యం చెప్పారు. యూరియా, డిఏపి కావాల్సినంత ఎరువు మన మండలంలో అందుబాటులో ఉన్నదని ఎవరో ఇబ్బంది పడవద్దని…

Read More

రైతు సేవ కేంద్రం ఇంచార్జ్ లకు శిక్షణ.

పాలకొల్లు: జూలై 14, (తెలుగు న్యూస్ పవర్. కామ్) సహాయ వ్యవసాయ సంచాలకులు పి. మురళీకృష్ణ, పాలకొల్లు వారి అధ్యక్షతన రైతు సేవ కేంద్రం ఇన్చార్జులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ సహదేవరెడ్డి ప్రధాన శాస్త్రవేత్త మార్టేరు వరి పరిశోధన స్థానం,డాక్టర్ మల్లికార్జున రావు కృషి విజ్ఞాన కేంద్రం, ఉండి అధిపతి హాజరయ్యారు. డాక్టర్ సహదేవరెడ్డి ఇన్చార్జి ఏడిఆర్ మార్టేరు వరి పరిశోధన స్థానం వారు…

Read More

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించిన మంత్రి కందుల, ఎమ్మెల్యే పంతం.

ముంబయి: జులై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే 19 నానాజీ విడివిడిగా మంగళవారం కోకిల బెన్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఇటీవల కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలను పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, ప్రజాసేవ, పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయి సమస్యల…

Read More

కలెక్టరేట్ ముట్టడి విజయవంతం -ఫ్యాప్టో

భీమవరం: జూలై, 14 ( తెలుగు న్యూస్ పవర్. కామ్)ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12 వ పిఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్ డిఏ లను, ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి భారీ సంఖ్యలో హాజరైన ఉపాధ్యాయులతో కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సహకారం తో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పై ఉద్యోగులు…

Read More

శ్రీ మావుళ్ళమ్మలు దర్శించుకున్న సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ.

భీమవరం: జూలై 14, ( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ప్రఖ్యాత తెలుగు సినీ నటులు సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయ కృష్ణ మంగళవారం దర్శించుకున్నారు.ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో చండీ హోమం.

భీమవరం: జూలై, 14 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం నందు అమావాస్య సందర్భంగా, మంగళవారం చండీహోమం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, వేదపండితులు నిర్వహించారు,90 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధమహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం…

Read More

మాస శివరాత్రికి, మహాశివరాత్రిలా పోటెత్తిన భక్తులు.

పాలకొల్లు: జులై,13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) మాస శివరాత్రి సందర్భంగా, స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దర్శనం కోసం సోమవారం భక్తులు పోటెత్తారు. అధికారుల అంచనాలకు అందనంతగా, వేల సంఖ్యలో పంచారామ క్షేత్ర దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. రాత్రి 8:30 గంటల వరకు కూడా ప్రత్యేక దర్శనం టికెట్లు కోసం భక్తులు బారులు తీరారు. నిత్య అన్నదాన పథకంలో భాగంగా సుమారు 1500 మంది భక్తులు…

Read More

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మల్లికార్జున స్వామి వారికి ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి సత్యవాణి పూజలు.

భీమవరం : జులై,13( తెలుగు న్యూస్ పవర్. కామ్) డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కుదటపడి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సతీమణి సత్యవాణి ప్రత్యేక పూజలను నిర్వహించారు. చిన గొల్లపాలెంలోని శ్రీపార్వతీ సమేత మల్లికార్జున స్వామివారికి ఆలయ అర్చకులు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలను నిర్వహించారు. అందరి శ్రేయస్సు కోరే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు.

Read More

శ్రీ మావుళ్ళమ్మకు ఊయల సేవ.

భీమవరం: జూలై, 13( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జేష్ఠమాస మహోత్సవాలు ముగింపు రోజు సందర్భంగా, సోమవారం శ్రీ అమ్మవారికి ఉయ్యాల సేవ కార్యక్రమం తెల్లవారుజామున 5 గంటల నుంచి వైభవంగా జరిగింది.దేవస్థానం సంప్రదాయం ప్రకారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు కి పుట్టింటి,అత్తింటివారు గా వ్యవహరించే అల్లూరి వారు, మెంటే వారి వంశస్థులచే విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు….

Read More