ఈనెల 20న మందుల షాపులు బంద్.
పాలకొల్లు: మే,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20న దేశవ్యాప్తంగా జరిగే బందుకు ప్రజలు సహకరించాలని పశ్చిమగోదావరి జిల్లా సంఘ అధ్యక్షులు తట్టవర్తి కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ భవనంలో శనివారం జరిగిన సమావేశంలో ప్రతినిధులు మాట్లాడారు. మందుల షాపుల యజమానులు, సిబ్బంది ఈ ఆందోళన కార్యక్రమంలో తప్పక పాల్గొని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా బంద్ రోజు కొన్ని మందుల షాపులు తెరిచి ఉంచుతామని భరోసా…