Skip to main content

Telugu News Power

ముగ్గురు తెలుగు వారికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు.

జనరల్ డెస్క్ : ఆగస్టు,24( తెలుగు న్యూస్ పవర్. కామ్) జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ముగ్గురు తెలుగు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. రాష్ట్రంలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చనుమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని మాయాబందర్‌ పీఎంశ్రీ జీఎంఎస్‌ఎస్‌ఎస్‌ పాఠశాలలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(ఆంగ్లము)గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి జెల్లి ప్రకాశ్‌రావు, తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు బొంపెల్లి భవానిలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు….

Read More

శ్రీ అద్దేపల్లి కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం.

పాలకొల్లు: ఆగస్టు, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ అద్దేపల్లి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం సోమవారం నిర్వాహంచారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రత్నమాణిక్యం అధ్యక్షతన భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, 2023 ఆగస్టు 23న భారతదేశం చంద్రయాన్–3 ద్వారా చంద్రునిపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్…

Read More

ఏ ఎస్ ఎన్ ఎమ్ కళాశాలలో ప్రపంచ వ్యవస్థాపక దినోత్సవం.

పాలకొల్లు: ఆగస్టు,20( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల,అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ వ్యవస్థాపక దినోత్సవాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. రత్నమాణిక్యం అధ్యక్షతన గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయ ల్యాబ్ అధినేత, కొమ్ముల మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిజిటల్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీ నిర్వహించారు. విద్యార్థులు వ్యవస్థాపకత, నూతన ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలు, స్వయం ఉపాధి, దేశ ఆర్థికాభివృద్ధిలో పారిశ్రామికవేత్తల…

Read More

అద్దేపల్లి కళాశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పాలకొల్లు: ఆగస్టు 15( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆగస్టు 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కడలి రత్నమాణిక్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్ కౌన్సిల్, ఎన్ ఎస్ ఎస్ యూనిట్లు 1, 2, కల్చరల్ కమిటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ సాంస్కృతిక, క్రీడా,…

Read More

ఛాంబర్స్ కళాశాలలో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

పాలకొల్లు: ఆగస్టు,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఛాంబర్స్ కళాశాలల ఆధ్వర్యంలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా శనివారం నిర్వహించారు. కళాశాల చైర్మన్ కె.వి నరసింహారావు, కళాశాల సెక్రటరీ కే సీతారామరాజు, జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలు వేసి, జండా ఆవిష్కరణ చేశారు. ఎన్ . సి.సి నావెల్ విద్యార్థులు త్రివర్ణ పతాకానికి మార్చ్ ఫాస్ట్ వందనం చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు మాట్లాడుతూ, 1947 నాటి పరిస్థితులకు…

Read More

ఏఎస్ఎన్ కళాశాలలో ఘనంగా వనమహోత్సవం.

పాలకొల్లు: ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో శుక్రవారం వనమహోత్సవ కార్యక్రమం జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం అధ్యక్షతన, ఏకో క్లబ్, ఎన్.ఎస్.ఎస్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ పచ్చదనం పండుగ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బి ఐ) పాలకొల్లు మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఆర్ చంద్రకృష్ణ రిటైర్డ్ మేనేజర్ డాకె సుధీర్…

Read More

ఛాంబర్స్ విద్యార్థులచే “హర్ ఘర్ క తిరంగా” భారీ ర్యాలీ

పాలకొల్లు:ఆగస్టు,14( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ఛాంబర్స్ కళాశాలల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశానుసారం శుక్రవారం పురవీధులలో ఘనంగా “హర్ ఘర్ క తిరంగా” భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చాంబర్స్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో పాలకొల్లు పురవీధులలో ఉన్న ప్రతి షాపుకు జెండాలు ఉచితంగా 400 పంచారు. భారతమాతకి జై నినాదాలతో జాతీయ స్ఫూర్తిని నింపుతూ ఈ భారీ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కళాశాల చైర్మన్ శ్రీ…

Read More

చాంబర్స్ కళాశాలలో అంతర్జాతీయ వాణిజ్య దినోత్సవం.

పాలకొల్లు: ఆగస్టు, 3( తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతర్జాతీయ వాణిజ్య దినోత్సవం సందర్భంగా స్థానిక డి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాల లో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కామర్స్ డే సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఓసూరి శ్రీదేవి ఫ్యాకల్టీ ఆఫ్ ఎంబీఏ స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విచ్చేశారు. వారు మాట్లాడుతూ, చాంబర్స్…

Read More

ఏ ఎస్ ఎన్ కళాశాల లో ప్రపంచ వెబ్ దినోత్సవం. విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.

పాలకొల్లు: ఆగస్టు,1( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ వెబ్ దినోత్సవం సందర్భంగా, స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నమాణిక్యం అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న వీరవల్లి ఎం.కె ప్రసాద్ ప్రపంచ వ్యాప్త వెబ్ ఆవిర్భావం, ఇంటర్నెట్ సాంకేతికత అభివృద్ధిలో వెబ్ పాత్ర, డిజిటల్ యుగంలో…

Read More

శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాలలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం.

పాలకొల్లు: జూలై,28( తెలుగు న్యూస్ పవర్.కామ్) శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ I, II యూనిట్లు, ఎకో క్లబ్ ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం మంగళవారం జరిగింది.. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. కె. రత్నమాణిక్యం అధ్యక్షత వహించి కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ, ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి వ్యక్తి కనీసం…

Read More