జీవిత రంగస్థలం నుంచి నిష్క్రమించిన ప్రముఖ నటి లక్ష్మి.
భీమవరం: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ రంగస్థలం నటి, ముమ్మారు నంది అవార్డు గ్రహీత బొండాడ (భీమవరం) లక్ష్మి (61) తన జీవిత రంగస్థలం నుంచి ఆదివారం రాత్రి తన పాత్ర ముగించి, రంగస్థలం నుంచి కూడా నిష్క్రమించారు. ఈమె భర్త టైలరింగ్ చేస్తారు. కుమారుడు మధు డాన్స్ ఈవెంట్లు నిర్వహిస్తారు. భీమవరానికి చెందిన లక్ష్మీ నాలుగున్నర దశాబ్దాల రంగస్థల చరిత్రలో బహుముఖ పాత్రలు పోషించి, నాటక సామ్రాజ్నిగా వెలుగొందారు. ఆమె నాటిక, నాటకం,…