Skip to main content

Telugu News Power

Telugu News Power

తాగుబోతు పై కేసు నమోదు.

పాలకొల్లు: జూన్,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎక్సైజ్ పోలీసులు విధి నిర్వహణలో భాగంగా చేపట్టిన తణిఖీల్లో మద్యం సేవించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తుండగా ఎస్. జాన్సన్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ మద్దాల శ్రీనివాస్ పత్రికలకు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధించారని, బెల్ట్ షాపులు నిర్వహించరాదని, ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు పెడతారని తెలిపారు.

Read More

పాలకొల్లులో 12వ ప్రపంచ యోగా దినోత్సవం.

పాలకొల్లు: జూన్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బిజెపి ఆధ్వర్యంలో 12వ ప్రపంచ యోగా దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాలకొల్లు పట్టణ బిజెపి అధ్యక్షులు కొల్లి కొండ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. యోగ ప్రపంచానికి భారతీయులు అందించిన గొప్ప వరమని కొండ ప్రసాద్ తన ప్రారంభోత్సవం పలుకుల్లో తెలిపారు. యోగ వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి మూలమన్నారు. యోగ ఒక జీవన విధానం అని, ప్రపంచమంతా…

Read More

ప్రగతి పట్టాలపై పరుగులు పెడుతున్న అభివృద్ధి. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: జూన్, 21( తెలుగు న్యూస్ పవర్.కాం) నియోజకవర్గంలో ప్రగతి పట్టాలపై అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నట్టు మంత్రి నిమ్మల పేర్కొన్నారు. స్థానిక 18 వ వార్డు నుంచి 31 వ వార్డు వరకు రూ 3.75 కోట్ల అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆదివారం కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్ ఆఫీస్ సమీపంలో ఏర్పాటు అయిన సభలో మంత్రి మాట్లాడారు. పట్టణ…

Read More

శ్రీ మావుళ్ళమ్మ సన్నిధిలో సంగీత విద్వాంసులకు, యోగా గురువులకు సత్కారం.

భీమవరం : జూన్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) యోగ దినోత్సవం – ప్రపంచ సంగీత దినోత్సవం వేడుకలు మావుళ్లమ్మ దేవస్థానంలో ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా భీమవరంలోని శ్రీ మావుళ్లమ్మవారి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ఎంపికైన సంగీత విద్వాంసులను, దేవస్థానం ఆస్థాన విద్వాంసులను ఘనంగా సత్కరించారు. విజ్ఞాన సమితి అధ్యక్షులు చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు లక్షన్నర రూపాయలు బంగారం కానుక.

భీమవరం: జూన్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణమయ అలంకరణ కొరకు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు కి చెందిన రంగిశెట్టి జగదీష్ బాబు, సుభాషిణి దంపతులు సుమారు లక్ష ఏబై వేలు రూపాయలు విలువ గల పది గ్రాముల బంగారం విరాళంగా అందచేసారు.ఆలయ అర్చకులు వీరికి పూజలు,ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్…

Read More

అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూన్, 20( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణ పరిధిలో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు సుడిగాలి పర్యటనలో పరిశీలించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పక్కనపెట్టి, అరాచక పాలన సాగించటం వల్ల ప్రగతి ఆగిపోయిందని మంత్రి నిమ్మల ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో 900 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు చేపట్టినట్టు వెల్లడించారు. టిడ్కో ఇళ్ళు తమ హయాంలోనే నిర్మాణం జరిగిందని, కనీసం 30…

Read More

రైతే రాజు, కూటమి ప్రభుత్వ తీరు. -మంత్రి నిమ్మల.

యలమంచిలి, జూన్,20( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతే రాజుగా భావించి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకంలో ఈ ఏడాది తొలి విడత నిధులు శనివారం కొంతేరు గ్రామంలో యూత్ క్లబ్ వేదిక వద్ద జరిగిన రైతు సభలో విడుదల చేశారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలోని 14,458 మంది రైతులకు రూ.9.40 కోట్ల నిధులు నమూనా…

Read More

అంబేద్కర్ సేవా సమితి నోటు పుస్తకాల పంపిణీ.

యలమంచిలి: జూన్, 19( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఆర్య పేట విద్యార్థులకు శుక్రవారం ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పాలకొల్లు లాకుపేటకు చెందిన అంబేద్కర్ సేవా సమితి వారు తమ సౌజన్యంతో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మండపాక రాంబాబు, సేవా సమితి సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు

Read More

విద్యార్థుల భవిష్యత్తుకు యడ్ల గణేశ్వర రావు ఫౌండేషన్ వెలుగు బాట.

పాలకొల్లు: జూన్, 19( తెలుగు న్యూస్ పవర్. కామ్) వైసిపి పార్టీ సీనియర్ నాయకులు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ యడ్ల తాతాజీ కుటుంబం నిర్వహిస్తున్న యడ్ల గణేశ్వర రావు ఫౌండేషన్ మరో మానవీయ కార్యక్రమం చేపట్టి, శుక్రవారం పూర్తి చేసింది. యలమంచిలి మండలం అడవిపాలెం కు చెందిన బుంగ ప్రసాద్ ఇంటికి వెలుగులు ప్రసాదించింది. గ్రామ వైసిపి అధ్యక్షులు సిర్ర నాగరాజు, బుంగ జయరాజు స్థానిక బుంగ ప్రసాద్ కుటుంబ దయనీయ…

Read More

మత్స్యకారులకు రూ.3 కోట్లతో నైపుణ్య శిక్షణ భవనం శంకుస్థాపన.

యలమంచిలి: జూన్, 19( తెలుగు న్యూస్ పవర్. కామ్) వెనుకబడిన వర్గాల వారికి 34 శాతం రిజర్వేషన్ ఇచ్చి దేశంలో చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక కుందేరు గ్రామంలో మూడు కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న మత్స్యకార నైపుణ్య శిక్షణ భవనానికి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే బీసీలని, పార్టీ ఎప్పటికీ వారికి అండగా నిలుస్తుంది…

Read More