సంజీవని ప్రాజెక్టు’ ను జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. పేదలకు చేరువ కానున్న వైద్య సేవలు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు.
అమరావతి: ఆగస్టు,26( తెలుగు న్యూస్ పవర్. కామ్)వైద్య ఆరోగ్య సేవలు సమర్ధంగా అందించేందుకు చేపట్టిన ‘సంజీవని ప్రాజెక్టు’ ను జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించవచ్చన్నారు. వైద్య సేవల్లో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా ‘సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని సూచించారు. సంజీవని ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా…