Skip to main content

Telugu News Power

Blog

ఈనెల 23న దివ్యాంగజన్ జాబ్ మేళా- కలెక్టర్ నాగరాణి.

వేదిక: దాసరి నారాయణరావు మహిళ కళాశాల, పాలకొల్లు. భీమవరం: జూలై 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగజన్ జాబ్ మేళా ఈ నెల 23న పాలకొల్లు డిఎన్ఆర్ మహిళ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రైవేట్ సంస్థలు పాల్గొంటున్నాయన్నారు. పదవ తరగతి ఇంటర్మీడి యట్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, అంతకంటే పై అర్హతలు కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు….

Read More

ఫ్రెంచ్ కాన్సులేట్ ప్రతినిధుల బృందం హైదరాబాద్ విశ్వవిద్యాలయ సందర్శన.

విద్య, పరిశోధన రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు. హైదరాబాద్:జూలై,17 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఫ్రాన్స్–భారత్ విద్యా, శాస్త్రీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా బెంగళూరులోని ఫ్రెంచ్ కాన్సులేట్ ప్రతినిధుల బృందం జూలై 16న హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్)ను సందర్శించింది. ఉన్నత విద్య, పరిశోధన, ఆవిష్కరణలతో పాటు ఆహార భద్రత, సహజ వనరుల నిర్వహణ రంగాల్లో సంయుక్త సహకార అవకాశాలపై ఇరు పక్షాలు విస్తృతంగా చర్చించాయి. ఫ్రెంచ్ ప్రతినిధుల బృందంలో శాస్త్రీయ, విద్యా సహకార…

Read More

దేశ రైల్వే చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన నీటి రైలు.

హర్యానా: జూలై, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్‌లో భారత తొలి హైడ్రోజన్‌-శక్తి రైలును ప్రారంభించారు. భారత రైల్వేలో హరిత విప్ల వానికి ప్రధాని నాంది పలికారు. ఇది స్వచ్ఛ ఇంధన ఆధారిత రవాణా దిశగా భారత రైల్వే చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతతో నడుస్తుంది, ఆపరేషన్ సమయంలో ప్రధానంగా నీటి ఆవిరి మాత్రమే విడుదల చేస్తుంది. జింద్–సోనిపత్ మార్గంలో…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రూ. లక్ష విరాళం.

భీమవరం: జూలై 17, ( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి పెన్నాడ కి చెందిన సోము స్వరూప్ కుమార్ వారి కుమార్తె చిరంజీవి. గీత సహస్ర పేరుమీద ఒక లక్ష నూట పదహారు రూపాయలు విరాళంగా అందజేశారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి…

Read More

కృత్రిమ మేధ సహకార సంస్థ ఏర్పాటుకు 29 దేశాలు ఒప్పందంపై సంతకం.

షాంఘై, చైనా: జూలై 16,( తెలుగు న్యూస్ పవర్. కామ్) షాంఘైలో ప్రపంచ కృత్రిమ మేధ సహకార సంస్థ (వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ – (డబ్ల్యూ ఏ ఐ సి ఓ) ఏర్పాటుకు సంబంధించి గురువారం రోజున 29 దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. ముఖ్యాంశాలు: ఈ ఒప్పందం ప్రకారం డబ్ల్యూ ఏ ఐ సి ఓ స్వతంత్ర అంతర్ ప్రభుత్వ అంతర్జాతీయ సంస్థగా షాంఘై కేంద్రంగా ఏర్పాటవుతుంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్…

Read More

రైతు సమస్యలు తెలుసుకుంటున్న ఎంపీ వర్మ

పోలవరం మండలం గూటాల గ్రామం లో ఎత్తిపోతల పంప్ హౌస్‌ను స్థానిక బీజేపీ నాయకులు కె.నాగరాజు, స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు, కేంద్రమంత్రి, ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ సందర్శించి పరిశీలించారు. గూటాల ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 2,400 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉండగా, మూడు పంపింగ్ మోటార్లలో ప్రస్తుతం ఒకటి మాత్రమే పనిచేస్తుండటంతో రైతులకు తగినంత సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను…

Read More

కొలువు దిగిన రోటరీ క్లబ్ కొత్త కార్యవర్గం.

పాలకొల్లు: జూలై, 16( తెలుగు న్యూస్ పవర్. కామ్) రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు నూతన కార్యవర్గం గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. స్థానిక అలయన్స్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఇన్స్టాలేషన్ అధికారిగా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ సి దామోదర్ రెడ్డి వ్యవహరించారు. అధ్యక్షులుగా గుడాల హరిబాబు, కార్యదర్శిగా ఎస్ ఎస్ ఆర్ నాగార్జున రావు, కోశాధికారిగా ఆరమిల్లి సురేష్, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రోటరీ క్లబ్ ప్రజలకు…

Read More

సిండికేట్ల గలాటా తో, రేవు పాట వాయిదాల పర్వం.

యలమంచిలి: జులై, 16( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అబ్బిరాజుపాలెం సోంపల్లి మధ్య గోదావరి నదిపై పై ఫంటు నడుపుకోవడానికి నిర్వహించ తలపెట్టిన వేలం పాట ప్రక్రియ గురువారం మరోసారి బెడిసికొట్టింది. అధికారులు ముచ్చటగా మూడోసారి వేలంపాట వాయిదా వేయగలిగారు. ప్రభుత్వం నీవు పాటకు రూ. 13 లక్షలు అప్సర్డ్ ప్రైస్ గా నిర్ణయించింది. పాటదారులు రూ. 7.50,8.10,10 లక్షల వరకు చెల్లించటానికి మూడు జరిగిన రేవు పాట సందర్భాల్లో ఆసక్తి చూపించారు. మండల అభివృద్ధి…

Read More

డిగ్రీ విద్యార్థులకు ఆనర్స్ డిగ్రీ కోర్సులపై అవగాహన సదస్సు.

పాలకొల్లు: జూలై,16( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బి ఆర్ఆర్ అండ్ జికేఆర్ ఛాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు హానర్స్ డిగ్రీ కోర్సులపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎం వి ఎన్, జే ఎస్ అండ్ ఆర్ వి ఆర్ డిగ్రీ కళాశాల, మలికిపురం, పొన్నపల్లి శ్రీరామారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీరు విద్యార్థుల నిర్దేశించి మాట్లాడుతూ, తమ లక్ష్యసాధనకు అంకుటిత దీక్షతో,…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు 4 గ్రాముల బంగారం కానుక.

భీమవరం: జూలై,16( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం నిధికి భీమవరం కి చెందిన భీమనాధం భాస్కరరావు జ్ఞాపకార్థం వారి భార్య జయలక్ష్మి నాలుగు గ్రాముల బంగారం విరాళంగా అందజేశారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,అతికెల్ ఆంజనేయ ప్రసాద్…

Read More