Skip to main content

Telugu News Power

గడువు కు ముందే కాలువలకు నీరు విడుదల చేయాలని మంత్రి ఆదేశాలు. తీరనున్న మంచినీటి సమస్య.

పాలకొల్లు: మే,29 (తెలుగు న్యూస్ పవర్. కామ్) గడువుకు ముందే కాలువ లకు నీటిని విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర జలవనురుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు వెల్లడించారు. మంత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణంలో ఒంటి పూట మంచినీరు సరఫరా ఎప్పటినుంచో ఉందన్నారు. కాలువలకు మరమ్మత్తులు చేయటం వల్ల కొంత తాత్కాలికంగా మంచినీటి సమస్య ఉత్పన్నమైనప్పటికీ, శాశ్వతంగా సాగునీరు, తాగునీరు నిరంతరం సరఫరా…

Read More

విద్యుత్ కోసం ఆక్వా రైతులు విలవిల. 216 హైవే దిగ్బంధం.

యలమంచిలి: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రోజున్నరపాటు చించినాడ ఇండస్ట్రియల్ ఫీడర్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో స్థానిక ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చించినాడ వద్ద జాతీయ రహదారి దిగ్బంధించి గురువారం తమ నిరసన తెలియజేశారు. ఇప్పటికే ఎంతో పెట్టుబడి పెట్టి, వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఆక్వా సాగు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్ పై నడపటానికి ఇబ్బందులు…

Read More

భారత సైన్యానికి ఆహారంగా రొయ్యలు. -ఎంపీ పాక ప్రతిపాదన.

భీమవరం: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత సైన్యానికి, మధ్యాహ్నం భోజనం లో రొయ్యలు ఆహారంగా ఇవ్వటానికి కృషి చేస్తానని, బీజేపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ తెలిపారు. రాజ్యసభ సభ్యులుగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా, పాలకొల్లుకు చెందిన బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్తి, కొల్లి కొండ ప్రసాద్, జక్కంపూడి కుమార్, వీరాజీ ఎంపీ ని కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రొయ్యల రైతులు తమ…

Read More

ఎన్టీఆర్ నంది పురస్కారం అందుకున్న మదీనా.

పాలకొల్లు: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక దగ్గులూరు కు చెందిన ఆల్ మదీనా మజీద్ అధ్యక్షులు హాజీ షేక్ ధరం మదీనా బుతవారం రాత్రి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన పురస్కార ప్రధాన ఉత్సవాల్లో నంది అవార్డు అందుకున్నారు. మదీనా సాంఘిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. హైదరాబాద్ యువ ఆర్ట్స్ థియేటర్స్ వారు త్యాగరాయ గ్రామ సభలో నిర్వహించిన కార్యక్రమంలో…

Read More

కొత్త తరహా మహానాడులో వెల్లువెత్తిన ఉత్సాహం. ముగిసిన రెండు రోజుల టిడిపి సంబరాలు.

పాలకొల్లు: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు గురువారం ఆయా క్లస్టర్లలో ఘనంగా జరిగాయి. వినూత్న విధానాల్లో, వికేంద్రీకరణ పద్ధతిలో తొలిసారి ప్రవేశపెట్టిన క్లస్టర్ స్థాయి మహానాడు రెండు రోజులపాటు ఘనంగా జరిగింది. వేడంగి కాలువ సమీపంలో, దొడ్డిపట్ల కాపు కళ్యాణ మండపంలో, యలమంచిలి ఉమా నరసింహ కళ్యాణ మండపంలో, పాలకొల్లు రామచంద్ర గార్డెన్స్ లో, లయన్స్ కమ్యూనిటీ…

Read More

ఘనంగా ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుక.

పాలకొల్లు: మే, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావు 103 జయంతి ఉత్సవాలు వాడవాడలా ఘనంగా జరిగాయి. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపుమేరకు, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పేద ప్రజల కోసం, మహిళల కోసం, బీసీ వర్గాల అభ్యున్నతికి ఆయన…

Read More

సూది మోపినంతనంత స్థలం ఉన్నా, మూడు కోట్ల స్థలం గిఫ్ట్ గా రాసిస్తా. అనంత శ్రీరామ్ కు సూర్యప్రకాశ్ సవాల్.

పాలకొల్లు:మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) చేగొండి అనంత శ్రీరామ్ స్థలం సూది మోపినంత ఆక్రమించినట్టు నిరూపించినా, తనకు అక్కడే ఉన్న మూడు కోట్ల స్థలాన్ని గిఫ్ట్ డీడ్ గా రాసి ఇస్తానని చేగొండి సూర్య ప్రకాష్ సవాల్ విసిరారు. ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్, జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తనపై ఇచ్చిన ఫిర్యాదు పై మాజీ మంత్రి, ఎంపీ హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్య ప్రకాష్ పత్రికా…

Read More

నా తల్లిదండ్రులను కాపాడండి. -సినీగేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు.

నాడు 5 ఊళ్ళ కోసం కురుక్షేత్రం, నేడు 5 సెంట్ల భూమి కోసం దాయాదుల పోరు. భీమవరం: మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ సినీ గేయ రచయిత చేగొండి అనంత శ్రీరామ్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు (పీజిఆర్ఎస్) తన తండ్రి , మాజీ ప్రిన్సిపల్ సి వి వి సత్యనారాయణమూర్తితో కలిసి వచ్చి ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలో తమ ఇంటి వద్ద గల…

Read More

కలిసే ఉన్నాం, కలహాలు ల్లేవ్ -మాజీ ఎమ్మెల్సీ అంగర

పాలకొల్లు: మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తన రాజకీయ ఎదుగుదలకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జన వనరుల శాఖామాత్యులు ఎంతగానో తోడ్పడ్డారని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు వెల్లడించారు. ఇటీవల వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును విమర్శిస్తూ, మాజీ ఎమ్మెల్సీ అంగన్ రామ్మోహన్రావు ఎదుగుదలకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా, స్థానిక మార్కెట్ యార్డ్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎమ్మెల్సీ…

Read More

మంత్రి శ్రమదానంతో రుద్రభూమి పరిశుభ్రం.

పాలకొల్లు: మే, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక భగ్గేశ్వరం, లంకలకోడేరు గ్రామాల్లో కైలాస వనం వసతుల కల్పనకు రూ.65 లక్షలతో ప్రారంభించనున్న పనులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు సోమవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామస్తులతో కలిసి లంకల కోడేరు స్మశాన వాటికను శ్రమదానం తో పరిశుభ్రం చేశారు. ప్రతి జీవికి ఆఖరి మజిలీ అయినా స్మశాన వాటిక ఆహ్లాదకరంగా ఉండటానికి సుందరీకరణ పనులు, సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కృషి…

Read More