బాలిక అబార్షన్ కేసుకు సంబంధించి ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్ పై విచారణ.
అమలాపురం: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అంబేద్కర్ కోనసీమ జిల్లాకలెక్టర్ ఆదేశాలతో, అమలాపురం, ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్లో మంగళవారం విచారణ జరిపారు. బాలిక గర్భవిఛ్ఛిత్తి కేసుకు సంబంధించి డాక్టర్ లంకె శిరీషను అధికారుల బృందం ప్రశ్నించారు. సంచలనం సృష్టించిన బాలిక అబార్షన్ విషయం జిల్లా యంత్రాంగం దృష్టికి రావడంతో, కలెక్టర్ ఆదేశాలతో ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్‌లో ప్రత్యేక విచారణ చేపట్టారు.విచారణ బృందంలో కొత్తపేట ఆర్డీవో మమ్మీ, డీఎంహెచ్‌వో దుర్గారావు,…