Skip to main content

Telugu News Power

డీఎస్సీ అక్రమాలపై విచారణ కోరుతూ, వైసిపి నిరసన ప్రదర్శన.

భీమవరం: జూలై, 28(తెలుగు న్యూస్ పవర్. కామ్) డీఎస్సీ పేపర్‌ లీకేజీ, స్పోర్ట్స్‌ కోటా పేరిట అన్యాయాలు… ఈ నేప‌థ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ జెన్-జడ్ ఆగ్రహావేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించింది. ప్రజలతో కలిసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు అన్నీ విజయవంతమయ్యాయి. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్‌ లీకేజీ నుంచి స్పోర్ట్స్‌…

Read More

శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాలలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం.

పాలకొల్లు: జూలై,28( తెలుగు న్యూస్ పవర్.కామ్) శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ I, II యూనిట్లు, ఎకో క్లబ్ ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం మంగళవారం జరిగింది.. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. కె. రత్నమాణిక్యం అధ్యక్షత వహించి కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ, ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి వ్యక్తి కనీసం…

Read More

స్పెయిన్‌ను చుట్టేస్తున్న దావానలం. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన.

మేడ్రిడ్: జూలై,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) పకృతిలో వచ్చే తీవ్ర మార్పుల వల్ల ఎల్నినో రంగ ప్రవేశం చేసింది. భూగోళం తీవ్ర ఉష్ణోగ్రతలతో కుత కుత ఉడికిపోతున్నది. మంచు దేశాల్లో మంటలు పుట్టిస్తున్నది. ప్రజలు తీవ్ర ఉష్ణోగ్రతలతో తట్టుకోలేక రోడ్ల మీదకు వచ్చి ఆహాకారాలు చేశారు. ఇప్పుడు ఈ తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల మరో ముప్పు ముంచుకొచ్చింది.స్పెయిన్‌లో కార్చిచ్చులు తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మాడ్రిడ్‌కు సమీపంలో, అవిలా ప్రాంతంలో దావానలాలు…

Read More

శక్తిశాట్ కు ఎంపికపై ప్రశంసల పరంపర. అంతరిక్షానికి నిచ్చెనలు వేస్తున్న జెస్సి మేథస్సు.

రాజమహేంద్రవరం: జూలై, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం కు చెందిన బాలిక కందుల జెస్సీకి ప్రశంసల పరంపర కొనసాగుతుంది. ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, సాంస్కృతిక శాఖామాత్యులు కందుల దుర్గేష్ ను కలుసుకున్న జెసికి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చారు. ఈమె ప్రస్తుతం ధవలేశ్వరంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి. అంతరిక్ష పరిశోధనకు సంబంధించి జెస్సి సాధించిన విజయం రాష్ట్రమంతటా,…

Read More

వచ్చే నెల 9న, క్షీరారామంలో మంత్రి నిమ్మల ఆధ్వర్యంలో వరుణ జ్వాలాభిషేకం.

పాలకొల్లు: జూలై, 28( తెలుగు న్యూస్ పవర్.కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము నందు,వచ్చేనెల 9న ఉదయం గం 9 గంటలకు 108 కలశములతో లోక కళ్యాణర్థము వరుణ జ్వాలాభిషేకం జరగనుంది. స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహిస్తున్నారు. దేవాదా య ధర్మాదాయ శాఖ వారి సూచనలు మేరకు, శ్రీ పార్వతి, క్షీరా రామలింగేశ్వర స్వామి వారికి జ్వాలాభిషేకం పూజలు డాక్టర్ నిమ్మల…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన్నదాన పధకానికి రూ. 3.15 లక్షల విరాళం.

భీమవరం: జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణకు భీమవరం బిల్డర్స్ అసోసియేషన్స్ గౌరవ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్, వడుపు గోపి, గ్రంధి రవితేజ, ఎర్రంశెట్టి నాగేశ్వరావు, లీలా కృష్ణ తదితర 23 మంది మిత్రబృందం రూ.3.15 లక్షలు విరాళంగా అందజే సారు. వీరికి విశేష పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్…

Read More

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు 29 నుంచి ప్రారంభం.

పాలకొల్లు: జూలై,27( తెలుగు న్యూస్ పవర్. కామ్) అమరావతి ఛాంపియన్షిప్, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఈనెల 29 నుంచి ప్రారంభం అవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు పూర్తి వివరాల కోసం బోనం రవిబాబు 9246043029, వై.సత్యనారాయణ9492728604 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. పాలకొల్లు, పూలపల్లి, లంకల కోడేరు, మేడపాడు ఉన్నత పాఠశా ల క్రీడా మైదానాల్లో వివిధ పోటీలు నిర్వహిస్తారు. అండర్ 17-24 పురుషులు మహిళలకు ఈ క్రీడలు నిర్వహిస్తారు.

Read More

విజయదశమికి మావుళ్ళమ్మ అమ్మవారికి రూ 35 కోట్లతో స్వర్ణ ఆభరణాలు తయారీ.

భీమవరం : జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) విజయదశమి నాటికి శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి సుమారు రూ 35 కోట్లు విలువ కలిగిన 23 కేజీల బంగారంతో స్వర్ణ ఆభరణాలు తయారీ చేయనున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సోమవారం తెలిపారు. శ్రీమావుళ్ళమ్మ అమ్మవారికి ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన 23 కేజీల బంగారాన్ని ఎమ్మెల్యే అంజిబాబు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, దేవస్థానం సభ్యుల సమక్షంలో స్వర్ణ…

Read More

ఆర్యవైశ్యుల దాతృత్వం, పాలకొల్లు అభివృద్ధికి వరం. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణలో విద్య, వైద్యరంగం అభివృద్ధికి,సత్రాల ఏర్పాట్ల వంటి దాతృత్వ కార్యక్రమాలకు శతాధిక సంవత్సరాలుగా ఆర్యవైశ్య సమాజం ఇతోధికంగా సేవలు అందిస్తున్నారని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నాయుడు కీర్తించారు. స్థానిక మన్యం జగ్గమ్మ సత్రం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి ఆదివారం రాత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మడుచు పట్టణాల్లోని అద్దేపల్లి, బొండాడ, సలాది, రేపాక, మన్యం తదితర ఆర్యవైశ్య కుటుంబాల వారు పా…

Read More

“ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం లో మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, స్థానిక లాకుల సమీపంలోని 21వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా, వార్డులోని ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అమ్మ తీరును తెలుసుకున్నారు. ఇద్దరికీ పింఛను వస్తున్నట్టు సంతృప్తి వ్యక్తం చేశారు. ఓ మహిళ తమ…

Read More