Skip to main content

Telugu News Power

ముఖ్యమంత్రి, మంత్రికి కర్ణాటక ఆహ్వానం.

అమరావతి: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర జలవనులను శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తో కర్ణాటక ప్రతినిధి బృందం సోమవారం సచివాలయంలో భేటీ అయింది. తుంగభద్ర ఆనకట్ట నూతన గేట్లు ఈనెల 25న ప్రారంభిస్తున్న సందర్భంగా వారు ఆహ్వానం అందజేశారు. కర్ణాటక చిన్న తరహా నీటిపారుదల శాఖ మాజీ మంత్రి ఎన్ ఎస్ బోసు రాజు, ఎమ్మెల్యే బసవరాజు రాయ్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవన్న గౌడ బదర్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు…

Read More

ఉభయగోదావరి జిల్లాలలో కలకలం రేపిన యువతి హత్య.

నర్సాపురం: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టపగలు జరిగిన యువతి హత్య పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సూళ్లూరుపేటలో ఏఎన్ఎం శిక్షణ పొందుతున్న జాలెం షైనీ రోజా రైలులో నరసాపురం సోమవారం చేరుకుంది. స్వగ్రామం అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి కార్లో ప్రయాణం అయింది. కారు సురేష్ నడుపుతున్నాడు. మార్గమధ్యలో మార్గాని రమేష్ కారులోకి ఎక్కాడు. స్థానిక పెట్రోల్ బంకు సమీపంలో మంచి నీటి కోసం కారు నడుపుతున్న సురేష్…

Read More

అనుమతులు లేని మంత్రి గారి బడి మూత.

భీమవరం: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నారాయణ స్కూల్‌ను విద్యాశాఖ అధికారులు సోమవారం మూసివేయించారు. ఎటువంటి అనుమతులు, లేకుండానే తరగతులు నిర్వహిస్తుండటంతో అధికారుల చర్యలు చేపట్టారు.స్కూల్ భవన నిర్మాణం పూర్తికాకుండానే క్లాసులు నడపడంపై ఎస్ఎఫ్ఐ నాయకుల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.నియమ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ ప్రాంగణంలోనే పుస్తకాలు, విద్యాసామాగ్రి విక్రయాలు జరపటం పట్ల వారు అభ్యంతరం తెలిపారు. మంత్రి నారాయణ పదవి వదిలి స్కూళ్లలో పుస్తకాలు, బ్యాగులు అమ్ముకోవాలంటూ ఎస్ఎఫ్ఐ మండిపడ్డారు.ఎటువంటి…

Read More

ఛాంబర్స్ కళాశాల ప్రాంగణ ఎంపికల్లో 40 మంది ఎంపిక.

పాలకొల్లు: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ) స్థానిక బి ఆర్ ఆర్, జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో సోమవారం దివిస్ లాబొరేటరీస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 40మంది అభ్యర్థులు ఎంపికైయ్యారు. వారిలో 12 మంది ఛాంబర్స్ విద్యార్థులని, కళాశాల చైర్మన్ కారుమూరి నరసింహ రావు తెలిపారు.ఈ ప్రాంగణం ఎంపికులకు వివిధ ప్రాంతాల నుండి 60 మంది అభ్యర్థుల హాజరైయ్యారు. ప్రిన్సిపల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు. సెక్రటరీ కె.వి సీతారామరాజు, ట్రెజరర్…

Read More

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ.

పాలకొల్లు: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గం లో నిరుపేద, మధ్యతరగతి వర్గాలకు వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 76 మందికి రూ. 66.42 లక్షలు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు సోమవారం రాత్రి తన క్యాంపు కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పరుగులు కూటమి నాయకులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Read More

పెద గోపురం మరమ్మతులకు ప్రయత్నం.

పాలకొల్లు: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) దేవతలు నిర్మించారని విశ్వసించే, శ్రీరాముడు ప్రతిష్టించిన క్షీరా రామలింగేశ్వరుని గాలిగోపురం చోళుల కాలంలో పునర్ నిర్మించినట్లు చెబుతారు. వేల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఆలయాన్ని రానున్న పుష్కరాల్లో లక్షలాదిమంది సందర్శిస్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, ఆలయానికి నాణ్యమైన రంగులు వేయాలనే స్థానిక భక్తుల కోరిక మేరకు, ధర్మకర్తల మండలి చర్యలు చేపట్టింది.గాలి గోపురాన్ని చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల…

Read More

పెద గోపురం వద్ద భక్తుల సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణములో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము మాడ వీధులలో శ్రీ స్వామి వారి సప్త సోమవారాల, ఏడు ప్రదక్షిణాలు ఏడు మారేడు దళములతో భక్తులు సుమారుగా 250 మంది ప్రదక్షిణములలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరిండెంట్ పి వాసు , ఆలయ ప్రధాన అర్చకుడు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి కిష్టప్ప, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి…

Read More

కొత్తవారిని పనిలో పెట్టుకోవద్దు. పోలీసుల హెచ్చరిక. ఆక్వా రైతు హత్య కేసును ఛేదించిన పోలీసులు

ముమ్మడివరం: జూన్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్ ) అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం కొత్తమురమళ్ల గ్రామంలో ఈ నెల 17న జరిగిన ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు (64) హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య అనంతరం మృతదేహానికి తాళ్లతో రాళ్లు కట్టి చెరువులో పడవేసిన ఈ సంచలన ఘటనలో నిందితులను శనివారం తెల్లవారుజామున కాకినాడలోని ఓ గదిలో ఉన్న సమయంలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ టి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ తెలిపారు.ఐ. పోలవరం పోలీస్…

Read More

​వైరల్ క్యాష్ వీడియో: త్రిపుర సెక్యూరిటీ ఫోర్సెస్‌లో పనిచేస్తున్న దంపతుల అరెస్ట్!

జనరల్ డెస్క్: జూన్,21( తెలుగు న్యూస్ పవర్. కామ్) సామాజిక మాధ్యమాలలో ఒక వైరల్ వీడియో సృష్టించిన సంచలనం చివరకు త్రిపుర రాష్ట్రంలో భద్రతా దళాలలో పనిచేస్తున్న ఒక దంపతుల అరెస్ట్‌కు దారితీసింది. గది నిండా గుట్టలుగా పోసి ఉన్న కరెన్సీ నోట్ల కట్టల వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మల్టీ క్రోర్ (కోట్లాది రూపాయల) ఆర్థిక స్కామ్‌తో ఈ నగదుకు సంబంధం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ​అసలేం…

Read More

జర్నలిస్టులు విశ్వసనీయత కాపాడుకోవాలి- ఐ.జే.యు. నేత డి. సోమసుందర్

తాడేపల్లిగూడెం: జూన్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్)నిష్పాక్షికంగా వార్తలు రాయటం ద్వారా జర్నలిస్టులు తమ విశ్వసనీయతను కాపాడుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ( ఐ.జే.యు.) సెక్రటరీ జనరల్ డి. సోమసుందర్ పిలుపునిచ్చారు. విధినిర్వహణలో పలురకాల ఒత్తిడులు ఎదుర్కుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వృత్తి ప్రమాణాలను పాటించడమే పాత్రికేయులకు తగురక్షణ కల్పిస్తుందని సోమసుందర్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం కడకట్ల రోడ్ లోని సోమసుందర్ గృహంలో ఏ.పి.యు.డబ్ల్యూ.జె. తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ…

Read More