Skip to main content

Telugu News Power

మంచినీటి సమస్యకు మూలం వైసీపీ నిర్లక్ష్యం. -మంత్రి నిమ్మల మరోసారి ఆరోపణ.

పాలకొల్లు: జూన్,9(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణ ప్రజల మంచినీటి కొరతకు మూలం, వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మంత్రి మంగళవారం అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, తాము ప్రతిపాదించిన విజ్జేశ్వరం నుంచి నేరుగా…

Read More

లింగమనేని రమేష్ రాజ్యసభకు నామినేషన్.

అమరావతి: జూన్,9(తెలుగు న్యూస్ పవర్.కామ్)రాజ్యసభకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ శనివారం దాఖలు చేశారు. రాష్ట్ర శాసన సభ కార్యాలయంలో, రిటర్నింగ్ అధికారి వనితా రాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ఎన్ ఈశ్వర రావు పాల్గొన్నారు. లింగమనేని రమేష్…

Read More

సంగీత దర్శకుడు రఘు కుంచే కు ఎస్పి బాలు అవార్డు.

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కామ్) కళా దర్బార్, అమరావతి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, గుంటూరు శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్పీ బాలు ఐకాన్ అవార్డ్స్ కార్యక్రమం గుంటూరులో వీటివల జరిగింది. సినీ రంగం నుంచి ప్రఖ్యాత సంగీత దర్శకుడు, దర్శకుడు, నటుడు రుఘు కుంచే ఈ ప్రతిష్టాత్మక అవార్డు శ్రీరంగం నుంచి అందుకున్నారు. ప్రముఖ నేపథ్య గాయని, ఎస్పీ బాలసుబ్రమణ్యం సోదరి ఎస్పీ శైలజ, ఇతర ప్రముఖులు రఘు కుంచెను ఘనంగా సత్కరించారు. ఈ…

Read More

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాధితులకు మంత్రుల పరామర్శ.

విశాఖపట్టణం: జూన్,9(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులను విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ ( కేజీహెచ్) వద్ద కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి మంగళవారం పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు మెరుగైన పరిహారం అందించడంతోపాటు, ఆ కుటుంబాలకు అన్ని విధాలా కూటమి (ఎన్డీఏ) ప్రభుత్వం…

Read More

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి నామినేషన్‌తిరస్కరణ

భోపాల్: జూన్, 9(తెలుగు న్యూస్ పవర్.కామ్) మధ్యప్రదేశ్‌లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్, నామినేషన్‌ను ఎన్నికల అధికారులు మంగళవారం తిరస్కరించారు. నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో ఒక న్యాయ వ్యవహారానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదనే అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని రిటర్నింగ్ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో విచారణ చేపట్టిన అధికారులు…

Read More

ఉక్కు కర్మాగార ప్రమాదం పై కమిటీతో సమావేశం జరిపిన కేంద్ర సహాయ మంత్రి.

విశాఖపట్నం: జూన్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి, భూపతి రాజు శ్రీనివాస వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నియమించిన ఉన్నత స్థాయి ముగ్గురు సభ్యుల కమిటీతో మంగళవారం విశాఖపట్నంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) నిపుణులు ప్రియరంజన్, బొకారో ఉక్కు ఫ్యాక్టరీ ఇంచార్జ్ డైరెక్టర్, చీఫ్ జనరల్ మేనేజర్,…

Read More

శ్రీ మావుళ్ళమ్మకు రూ.61 లక్షల హుండీ ఆదాయం. బంగారం గ్రా 76.700లు, వెండి గ్రా315లు.

భీమవరం: జూన్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా ,భీమవరంపట్టణం లోని ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు మంగళవారం తెరిచారు. హుండీ లెక్కింపు 75 రోజుల కాలపరిమితి. నగదు రూపంలో రూ.61 లక్షల6వేల458లు భక్తులు సమర్పించారు. బంగారం 76.700 మిల్లీగ్రాములు, వెండీ 315 గ్రాములు శ్రీ అమ్మవారికి హుండీలో భక్తులు కానుకగా వేశారు. కాకినాడ పట్టణం ఎం.ఎస్.ఎన్ చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్…

Read More

గాంధీ భగవాన్ రాజును అభినందించిన ఛాంబర్స్ కళాశాల బృందం.

పాలకొల్లు: జూన్, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం, అధ్యక్షులు, గాంధీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కాస్మో కల్చరల్ క్లబ్ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా,ఛాంబర్స్ విద్యా సంస్థల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు, కార్యదర్శి కె.వి సీతారామరాజు మంగళవారం భగవాన్ రాజు కార్యాలయంలో కలిసి…

Read More

శైలీ సింగ్ లాంగ్ జంప్ కు బంగారం.

జనరల్ డెస్క్: జూన్, 8 (తెలుగు న్యూస్ పవర్. కామ్) శైలీ సింగ్ 6.24 మీటర్ల లాంగ్ జంప్‌తో న్యూ తైపే సిటీ ఔపెన్ 2026లో స్వర్ణం పథకం కైవసం చేసుకున్నారు. తేజస్ శిర్సే ప్రభుత్వం దక్కించుకున్నారు. స్వర్ణపథకంతో ఈమె ఆట ప్రారంభించారు. శైలీ ఈ టోర్నమెంట్లో కనబరిచిన మెరుపు ప్రదర్శనలో 6.24 మీటర్ల లాంగ్ జంప్ ఫైనల్లో స్వర్ణ పతకం సాధించారు. ఈ విజయం భారత ఎథ్లెటిక్స్‌లోకి కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరిన్ని భారతీయ విజయలకు…

Read More

‘మానవత’ నూతన అధ్యక్షునిగా ముత్యాల రామారావు ఏకగ్రీవం.

పాలకొల్లు: జూన్, 8 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల మానవత శాఖకు నూతన అధ్యక్షుడిగా(2026-27) ముత్యాల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించి మండల సర్వసభ్య సమావేశం సోమవారం రాత్రి జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. పాలకొల్లు మండలశాఖ ఆవిర్భావం నుంచి ముత్యాల రామారావు డైరెక్టర్స్ బోర్డ్ కన్వీనర్ గా వ్యవహరిస్తూ, సేవాకార్యక్రమాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు గత 28 ఏళ్లుగా లయన్స్ క్లబ్ లో వివిధ హోదాలలో…

Read More