ప్రధాని మోడీ మాట, బంగారు భవితకు బాట. -రాష్ట్ర బిజెపి మీడియా కన్వీనర్ కపర్ది.
పాలకొల్లు: మే 22, (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపుమేరకు, అందరూ పొదుపు చర్యలు పాటించాలని, బిజెపి రాష్ట్ర మీడియా కన్వీనర్, ఏఎంసీ మాజీ చైర్మన్, ఉన్నమట్ల కపర్తి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో, ప్రధాని మోడీ సూచించిన అంశాలు అనివార్యంగా ఆచరించవలసిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ప్రపంచంలో నెలకొన్న భయానక యుద్ధ పరిస్థితులు సృష్టించే సమస్యలకు ముందుగానే సిద్ధం కావటానికి ప్రధాని…