Skip to main content

Telugu News Power

Blog

ఛాంబర్స్ కళాశాలలో శనివారం మెగా జాబ్ మేళా.

స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జికేఆర్ చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఈనెల 26న ఏపీ ఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గోడ పత్రికను బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా, మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గం విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ లో సుమారు 20 పైగా కంపెనీలు 1500 పైగా…

Read More

శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఉపాలయం శ్రీ అశ్వద్ధ గణపతి విఘ్నేశ్వర స్వామి వారి అన్నదాన కార్యక్రమం.

తాపేశ్వరం, సురుచి స్వీట్స్ 51కేజీల లడ్డు వితరణ భీమవరం:సెప్టెంబర్, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఉపాలయం శ్రీ అశ్వద్ధ గణపతి విఘ్నేశ్వర స్వామి వారి అన్నదాన కార్యక్రమం భీమవరం శాసన సభ్యులు పి ఏ సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. స్వామి వారికి తాపేశ్వరం కి చెందిన సురుచి స్వీట్స్ వారు సమర్పించిన 51 కేజీల లడ్డూ ను భక్తులకు…

Read More

నేడు అన్ని పాఠశాలకు సెలవు.

భీమవరం:సెప్టెంబర్,23 (తెలుగు న్యూస్ పవర్.కామ్) తుపాను ప్రభావిత,ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీ ఈ ఓ తెలిపారు.అన్ని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ మరియు ఇతర యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్లకు* ఈ సమాచారాన్ని వెంటనే తెలియజేసి, గురువారం పాఠశాలలు నిర్వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి, ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలకు…

Read More

డేటింగ్ యాప్ వలలో చిక్కి సొమ్ములు పోగొట్టుకున్న బాధితుడు.

స్థానిక రూరల్ పోలీసుల అదుపులో 5గురు నిందితులు. పాలకొల్లు:సెప్టెంబర్,23( తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో దోపిడీ, బలవంతంగా డబ్బులు దోచుకున్న నేరాలకు సంబంధించి ఈనెల 21న కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇచ్చిన వివరాలు:ఐదుగురు సభ్యుల ముఠా “గ్రైండర్”(జి ఆర్ ఐ ఎన్ డి ఆర్) డేటింగ్ యాప్ ద్వారా ఒక వ్యక్తిని ప్రలోభపెట్టారు, స్థానిక ఆరట్లకట్ట గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి బాధితుడిని రప్పించారు. నిందితులు కత్తితో ఫిర్యాదుదారుడిని…

Read More

రిసార్ట్స్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్.

మొగల్తూరు: సెప్టెంబర్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పేరుపాలెం బీచ్ సమీపంలో ది పాలెం రిట్రీట్ రిసార్ట్స్ ను మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు సౌకర్యాలు కల్పించటానికి ఈ రిసార్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పర్యాటకులకు ఉత్సాహం, ఉల్లాసం కలిగించే విధంగా రిసార్ట్స్ ఏర్పాటు చేసిన వారిని అభినందించారు. ఇక్కడ గ్రామీణ ప్రాంత వాతావరణంలో ఉండే వివిధ కళాకృతులను ఏర్పాటు చేశారు….

Read More

ఛాంబర్స్ కళాశాలలో ఉచిత రక్త పరీక్షలు.

పాలకొల్లు: సెప్టెంబర్, 21( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జె కె ఆర్ చాంబర్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమవారం పాలకొల్లు వాలంటరీ బ్లడ్ బ్యాంకు వారి సౌజన్యంతో డిగ్రీ విద్యార్థులకు ఉచిత రక్త నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి రక్త నిర్ధారణ పరీక్షలు చేయించుకొనుట ద్వారా తమ రక్త గ్రూపు ఓ, ఏ, బి, ఏబి లలో ఏ తరగతికి…

Read More

శ్రీ అద్దేపల్లి ప్రభుత్వ కళాశాలలో ఘనంగా గురజాడ జయంతి.

పాలకొల్లు:సెప్టెంబర్,21 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో గురజాడ వెంకట అప్పారావు జయంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. తెలుగు విభాగం ఆధ్వర్యంలో మహాకవి, ఆధునిక తెలుగు కవిత్వ యుగకర్త,గురజాడ జయంతి వేడుకలను కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా కె రత్న మాణిక్యం ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.ఈ కార్యక్రమానికి, తెలుగు విభాగాధిపతి డా బూసి వెంకటస్వామి అధ్యక్షత వహించారు. తెలుగు అధ్యాపకులు రగుతు షణ్ముఖరావు సభ…

Read More

సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: సెప్టెంబర్, 21 (తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తన క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. వివిధ ఆరోగ్య సమస్యలపై చికిత్స పొందిన, పేద, మధ్యతరగతి వర్గాల వారు 129 మందికి రూ. 64.65 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో రూ. 17.5 9 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంత్రి వెల్లడించారు….

Read More

సప్త ప్రదక్షిణలలో పాల్గొన్న భక్తులు.

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము మాడవీధుల్లో సోమవారం సప్త ప్రదక్షిణల కార్యక్రమం జరిగింది. భక్తులు సంఖ్య సుమారు 450 మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమములో ఆలయ ఛైర్మన్ మీసాల రామచంద్రరావు,ఆలయ ధర్మకర్త పిని శెట్టి శ్రీనివాసు, పెనుమత్సశ్రీదేవి, పర్యవేక్షకులు వాసు,ఆలయ ప్రధాన అర్చకులు కిష్టప్ప, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి ధూప సేవ, శ్రీ స్వామివారి పంచ హారతులు సేవ నిర్వహించారు.

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ తోట నారాయణరావు.

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానమును సోమవారం తోట నారాయణరావు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. డాక్టర్ తోట నారాయణరావు ఇస్రో సైంటిస్ట్(జి),తిరుపతి వారు తల్లిదండ్రులు, సోదరి ( అమెరికా) కుటుంబ సమేతంగా శ్రీ స్వామి వారు, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉపముఖ్యమంత్రి కార్యాలయం సూచనల మేరకు జనసేన పార్టీ జిల్లా నాయకులు, స్థానిక కనకదుర్గమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు తులా రామలింగేశ్వర రావు వీరికి స్వామివారి అనుగ్రహ దర్శనం సహకరించారు.వారికి ఆలయ చైర్మన్…

Read More