Telugu News Power

Blog

తిరుమలలో శ్రీవారి దర్శనం ప్రారంభం.

తిరుమల: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్) చంద్రగ్రహణం సందర్భంగా, మంగళవారం ఆలయాలు మూసి ఉంచారు. గ్రహణం విడిచిన తరువాత, శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసే నిమిత్తం, శాస్త్రోక్తంగా ఆలయ సంప్రోక్షణ చేశారు. గ్రహణ శుద్ధి కార్యక్రమాల అనంతరం రాత్రి 8:30 గంటలకు భక్తులను స్వామివారి దర్శనానికి అధికారులు అనువమతించారు.

Read More

అల్లు వారి ఇంట పెళ్ళంట, భారీగా ఫ్రీ వెడ్డింగ్ షూట్.

హైదరాబాద్: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. పాలకొల్లు ముద్దుబిడ్డ, విఖ్యాత హాస్యనటులు, అల్లు రామలింగయ్య, మనవడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, పాన్ ఇండియా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, మెగా మేనల్లుడు అల్లు శిరీష్ వివాహం ఈనెల 6న జరగనుంది. వివాహ వేడుకల్లో భాగంగా, మంగళవారం ఫ్రివెడ్డింగ్ షూట్ జరిగింది. కాబోయే దంపతులు, నయనిక రెడ్డి, అల్లు శిరీష్ ఈ వేడుకకు ప్రత్యేక…

Read More

కేరళలో బిజెపి గెలుపు తథ్యం. -కేంద్రమంత్రి వర్మ ఆశాభావం

కోచి: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, నర్సాపురం పార్లమెంటు సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ మంగళవారం కేరళలోని కొచ్చి విమానాశ్రయం చేరుకున్నారు. వీరికి కేరళ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, జి జి జోసెఫ్, కార్యదర్శి రేణు సురేష్, జోనల్ ఉపాధ్యక్షులు ఎం ఎన్ గోపి, ఎర్నాకులం అధ్యక్షులు, ఎం ఏ బ్రహ్మ రాజ్, తదితర బిజెపి నాయకులు స్వాగతం పలికారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో…

Read More

విద్యార్థులకు విజయ్,రష్మికల పెళ్ళికానుక.

హైదరాబాద్: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కాం) ఇటీవల ఓ ఇంటి వారైనా సినీ నటుల జంట, విజయ్ దేవరకొండ, రష్మిక మదన్న ల వివాహ వేడుకల సంబరం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీరి స్వగ్రామం తెలంగాణలో ని నాగర్ కర్నూల్ జిల్లా, తుమ్మన్ పేటకు, నూతన గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు తమ పెళ్ళి కానుకగా, 9,10 తరగతులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందజేస్తామని ప్రకటించారు….

Read More

సితార డిజైనర్ చీర లక్ష

హైదరాబాద్: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్.కామ్) సూపర్ స్టార్ కృష్ణ, స్టార్ కపుల్ మహేష్ బాబు, నమ్రతల, గారాల పట్టి సితార ఘట్టమనేని ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇందుకు కారణం ఆమె ధరించిన ఓ డిజైనర్ చీర. చీర ఖరీదు అక్షరాల లక్ష రూపాయలు. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిల్యాన్ని ఈ చీర రూప శిల్పి.

Read More

100 కోట్ల ప్రాజెక్ట్ కు అధిపతి, అప్పటికి వయసు పదహారే

ఫ్లోరిడా: మార్చి, 3 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఫ్లోరిడాలో పెరిగిన భారతీయ యువతి ప్రంజలి అవస్థి16 ఏళ్ల వయసులో,స్టార్టప్ డెల్వ్.ఏఐ స్థాపించి రూ.100 కోట్ల విలువైన విజయం సాధించిన ప్రేరణాత్మక గాథ!భారత్‌లో జన్మించి 11 ఏళ్ల వయసులో అమెరికా ఫ్లోరిడాకు తరలి వచ్చిన 16 ఏళ్ల ప్రంజలి అవస్థి, ఇంకా హైస్కూల్ పూర్తి చేయకముందే 2022 జనవరిలో డెల్వ్.ఏఐ(డిఇల్ వి.ఏఐ) అనే ఏఐ-ఆధారిత పరిశోధన వేదిక స్థాపించింది. ఈ వేదిక పరిశోధకులకు విద్యా సంబంధమైన విషయాన్ని(అకడమిక్…

Read More

మంత్రి నిమ్మలచే 4.29 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

పాలకొల్లు; మార్చి,2(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు సోమవారం నాలుగు కోట్ల 29 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 6 శంకుస్థాపనలు చేశారు. స్థానిక ఏఎస్ ఎన్ ఎం ప్రభుత్వ కళాశాలకు 23 లక్షలు, కులాయి చెరువు గట్టు అభివృద్ధి సుందరీకరణకు, 2 కోట్ల రూపాయలు, మూడో వార్డు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 40 లక్షల రూపాయలు, సమత మహిళా మండలి భవన నిర్మాణానికి 29వ వార్డులో 40…

Read More

కొత్త రైల్వే జోన్ కు ఆర్థిక సలహాదారు నియామకం.

విశాఖపట్టణం: మార్చి, 2(తెలుగు న్యూస్ పవర్. కాం) విశాఖపట్నం కేంద్రంగా, కొత్తగా ఏర్పాటు అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సోమవారం డాక్టర్ పూడి హరి ప్రసాద్, ప్రిన్సిపల్ ఫైనాన్స్ షియల్ అడ్వైజర్ గా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వీరి స్వస్థానం ఉత్తరాంధ్రకు చెందిన ఉద్దానం గ్రామం. వీరు 1993 ఐఆర్ఎస్ బ్యాచ్ కు చెందినవారు. రైల్వే శాఖలో ఏదో హోదాల్లో పని చేశారు, రక్షణ విభాగంలో సంయుక్త కార్యదర్శిగా సేవలు అందించారు. కొత్త రైల్వే…

Read More

లస్కర్లకు వేతనాల పెంపు.

పాలకొల్లు: మార్చి, 2 (తెలుగు న్యూస్ పవర్. కాం) రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు, నిమ్మల రామానాయుడు, జలవనురుల శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న లస్కర్ల సమస్యలను మండలిలో ఇటీవల ప్రస్తావించారు. లస్కర్లకు వేతనాల పెంపు, రిటైర్ అయిన వారి స్థానంలో కొత్తవారిని ఔట్సోర్సింగ్ విధానాల్లో భర్తీ చేయడం వంటి అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా లస్కర్లు మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం కలుసుకుని, కృతజ్ఞతలు తెలియజేశారు. గత 10…

Read More

కొత్త ఉపాధి హామీ పథకం పై అవగాహన సదస్సులు.

పాలకొల్లు: మార్చి,2(తెలుగు న్యూస్ పవర్.కాం) కేంద్ర ప్రభుత్వం, ఉపాధి హామీ పథకాన్ని కొత్తగా,విబి-జి రామ్ జి (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ & ఆజీవికా మిషన్–గ్రామీణ్) పథకం ప్రవేశపెట్టింది. ప్రజలకు ఈ పథకం పట్ల స్పష్టమైన అవగాహన కల్పించేందుకు మండలం లో 6 వారాల పాటు “విబి-జి రామ్ జి జన్-సంవాద్” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, స్థానిక మండల యం. పి. డి. ఓ యన్. ఉమామహేశ్వరరావు సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ కుటుంబాలకు…

Read More