Skip to main content

Telugu News Power

నరసాపురం – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు పునరుద్ధరించాలి.

భీమవరం: సెప్టెంబర్,28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి, స్థానిక పార్లమెంటు సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మను స్థానిక బిజెపి నాయకులు క్యాంపు కార్యాలయంలో కలిశారు. నరసాపురం నుంచి వైజాగ్ కు రెగ్యులర్ గా ప్రతిరోజు రైలు నడపాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. నరసాపురం, పాలకొల్లు, కోనసీమ ప్రాంత ప్రజలు విశాఖపట్నం వెళ్లడానికి నేరుగా రైలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్న…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి మాడవీధుల్లో సప్త ప్రదక్షిణలు.

పాలకొల్లు:సెప్టెంబర్, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం మాడవీధుల్లో సోమవారం ప్రదోషకాలంలో సప్త ప్రదక్షిణలలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆర్. శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ ధర్మకర్త పినిశెట్టి శ్రీనివాస్, ఆలయసూపరింటెండెంట్ పి. వాసు, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, ఆలయ అర్చకులు రఘునాథ్,సిబ్బంది పాల్గొన్నారు.

Read More

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానంలో జరిగే సుదర్శన హోమం కు రూ.లక్ష విరాళం.

సఖినేటిపల్లి: సెప్టెంబర్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన అంతర్వేది గ్రామములో వేంచేసియున్న స్వయంభూ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం నందు నిర్వహించు నిత్య సుదర్శన హోమమునకు శాశ్వత విరాళముగా, పశ్చిమగోదావరి జిల్లా దిరుసుమర్రు వాస్తవ్యులు సాగి సీతారామరాజు, వారి కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళంగా సమర్పించారు. వీరికి శ్రీ స్వామి వారి దర్శనానంతరము, ఆలయ సిబ్బంది శ్రీ స్వామి వారి చిత్రపటం, ప్రసాదముల అందజేసారు.

Read More

ఉచిత వైద్య సేవలను అభినందించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: సెప్టెంబర్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) వృద్ధాశ్రమాలు నిర్వహిస్తూ, వారికి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న మహనీయులను మంత్రి నిమ్మల ప్రశంసించారు. స్థానిక పూలపల్లి వృద్ధాశ్రమంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వేగేసిన సోమరాజు జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం సివిఎన్ఆర్ఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. వైద్య శిబిరాన్ని మంత్రి నిమ్మల ప్రారంభించారు. వైద్యులు బాల, మనోజ్, శంకర్ లను మంత్రి సత్కరించారు. ఈ కార్యక్రమంలో, రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు,…

Read More

బీసీలకు అన్యాయం జరిగింది జగన్ పాలనలోనే. వైసిపి పై ధ్వజమెత్తిన కూటమి బీసీ నాయకులు.

పాలకొల్లు: సెప్టెంబర్,27(తెలుగు న్యూస్ పవర్. కామ్) బీసీలకు అన్యాయం జరిగింది జగన్ ప్రభుత్వ పాలనలోనేని కూటమి బీసీ నాయకులు వైసిపి పార్టీపై ధ్వజమెత్తారు. పలువురు బీసీ నాయకులు ఆదివారం స్థానికం గా జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. వైసిపి పార్టీ రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీసీ గర్జన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, కూటమి ప్రభుత్వాన్ని నిరాధారమైన ఆరోపణలతో నిందించడానికి తీవ్రంగా ఖండించారు. బి సి ల సంక్షేమ, సాధికారితల కోసం టిడిపి పార్టీ నిరంతరం కృషి…

Read More

రైతుల మేలు కోరేది కూటమి ప్రభుత్వం. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు: సెప్టెంబర్, 27 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రం లో తీవ్ర ఎల్ నినో లో పరిస్థితుల్లో కూడా10.40 లక్షల ఎకరాల సార్వా సాగుకు సాగునీటి సరఫరా చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక నాగరాజుపేట, వరిధనం గ్రామాల్లో రూ. 1. 98 కోట్లతో ఈ పట్టణంలో పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, మంత్రి మాట్లాడుతూ, రైతులు కష్టపడి…

Read More

శ్రీ క్షీరా రామం లో భగవద్గీత మహా యజ్ఞం. వెయ్యి మంది భక్తులకు అన్నదానం.

పాలకొల్లు:సెప్టెంబర్27(తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం ఉదయం 9 గంటలకు భగవద్గీత మహా యజ్ఞం వైభవంగా జరిగింది. భక్తులు భక్తిశ్రద్ధలతో భగవద్గీత పారాయణం చేసారు. భగవద్గీత పారాయణం చేసిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణాధికారి, రేపాక శ్రీనివాస్, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, భక్తులు 1000 మందికి అన్నప్రసాదం ఏర్పాట్లు చేసారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త లు ఉప్పలపు దుర్గ పెద్దిరాజు, నాలం నాగ వెంకట…

Read More

డాక్టర్ బి వి రాఘవయ్య గారి సేవలు చిరస్మరణీయం

పాలకొల్లు: సెప్టెంబర్,26( తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో కళాశాల ప్లానింగ్ డెవలప్‌మెంట్ కమిటీ (సీపీడీసీ ) సెక్రటరీగా సేవలందించిన డాక్టర్ బి వి రాఘవయ్య గారి సంతాప సభ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. రత్న మాణిక్యం అధ్యక్షతన కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కే. రత్న మాణిక్యం మాట్లాడుతూ, డా. బి వి రాఘవయ్య, కళాశాల అభివృద్ధికి అందించిన సేవలను, ఆయనతో…

Read More

శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రతిభా పురస్కారం ఏర్పాటు.

పాలకొల్లు :సెప్టెంబర్,26 (తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి పేర ప్రతిభా పురస్కారం ఏర్పాటు చేసారు. స్థానిక కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్న మాణిక్యం నేతృత్వంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది తమ జీతాలనుండి డెబ్భై ఐదు వేల రూపాయల విరాళాన్ని అందించారు. ఆ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.కళాశాల వ్యవస్థాపకులు శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి పేరిట ఈ శాశ్వత ప్రతిభా బహుమతిని ఏర్పాటు కొరకు…

Read More

శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో చండీహోమం.

భీమవరం: సెప్టెంబర్, 26( తెలుగు న్యూస్ పవర్.కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, వేదపండితులు చండీహోమం కార్యక్రమం నిర్వహించారు. దంపతులు 64ని మంది, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు గొంతెన రమణ, పాపోలు ఏడుకొండలు, ఈ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద…

Read More