పెదగోపురం ఈ.వో. గా ఆర్. శ్రీనివాసరావు నియామకం.
పాలకొల్లు: సెప్టెంబర్,26 (తెలుగు న్యూస్ పవర్.కామ్) పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము కార్యనిర్వహణాధికారిగా ఆర్. శ్రీనివాసరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్, విజయవాడ వారి ఉత్తర్వులు మేరకు విధుల్లో చేరినట్టు పత్రికలకు శనివారం వెల్లడించారు. దేవాదాయ శాఖలో బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ, పెదగోపురం ఈవో బదిలీ పట్ల ఆయా వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం మవుతున్నది. ఈ బదిలీకి సంబంధించి తెర వెనుక గత…