శ్రీలంకలో జయశ్రీ మహాబోధి టెంపుల్ సందర్శించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్.
శ్రీలంక తెలుగు కాంగ్రెస్ ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటిస్తున్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం అనురాధపురలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రం “జయశ్రీ మహాబోధి టెంపుల్” సందర్శించారు. ఈ బౌద్ధక్షేత్రం ప్రపంచంలో అత్యంత పవిత్రమైన బౌద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఉన్న బోధివృక్షం భారతదేశంలోని బోధ్‌గయలో బుద్ధుడు జ్ఞానోదయం పొందిన మహాబోధి వృక్షానికి చెందిన కొమ్మ నుండి పెంచబడినదిగా బౌద్ధ సంప్రదాయం చెబుతుంది. ఈ మహావృక్షాన్ని బంగారు కడ్డీలతో సంరక్షిస్తున్నారు. క్రీ.పూ. 3వ శతాబ్దంలో చక్రవర్తి…